breaking news
vatti vasanthakumar
-
ఉంగుటూరు.. ఆ దారే వేరు..
సాక్షి, భీమడోలు(ఉంగుటూరు) : నియోజకవర్గం 1967లో ఆవిర్భవించింది. అంతకుముందు తొలుత 1955లో అలంపురం నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఆ తర్వాత పెంటపాడు నియోజకవర్గంలో ఉండేది. 1967లో ఉంగుటూరు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009 పునర్విభజనకి ముందు పూర్తి మెట్టప్రాంతంగా ఉండేది. పునర్విభజన తర్వాత భీమడోలు, ఉంగుటూరు మండలాలకు డెల్టా మండలాలైన నిడమర్రు, గణపవరం మండలాలను కలపడంతో మెట్ట, డెల్టా మేలుకలయికగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన కొల్లేరు ప్రాంతం నియోజవర్గంలోనూ విస్తరించి ఉంది. భౌగోళిక స్వరూపం గ్రామాలు : 81 సాగు విస్తీర్ణం : 27,064హెక్టార్లు ఆక్వా సాగు విస్తీర్ణం : 14,474 ప్రధాన పంటలు : వరి, మొక్కజొన్న,చెరకు, అపరాలు మెట్ట. ఇదీ ఉంగుటూరు నియోజకవర్గం ముఖచిత్రం. నియోజకవర్గంలో మండలాలు:భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు, గణపవరం జనాభా : 2,66,139 పురుషులు:1,19,070 స్త్రీలు:1,47,069 ఓటర్లు : 1,93,475 పురుషులు:96,241 స్త్రీలు:97,221 ఇతరులు:13 రాజకీయ ప్రత్యేకత ఉంగుటూరు నియోజవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందనే భావన బలంగా ఉంది. అలాగే చరిత్రను చూస్తే ఒకసారి గెలిచిన వారు రెండోసారి విజేతలైన దాఖాలాలు ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చింది. దీంతో వరుసగా 2004, 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వట్టి వసంతకుమార్ గెలుపొందారు. రాజకీయ చైతన్యం ఎక్కువ ఈ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే, విద్యావేత్త, విద్యాదాత చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా వాటిలో ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. భీమడోలు మండలం పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురానికి చెందిన వట్టి వెంకటరంగ పార్థసారథి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు. వీవీఆర్ పార్థసారథి తనయుడు వట్టి వసంతకుమార్ దివంగత సీఎం వైఎస్సార్ ప్రధాన అనుచరుడు. ఆయన ఆశీస్సులతో 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో రెండో సారి గెలిచి రాష్ట్ర మంత్రిగా పని చేశారు. కాంటూరు హామీకి తూట్లు కొల్లేరు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ప్రాంత పరిరక్షణకు గత ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కొల్లేరులోని అభయారణ్యం పరిధి ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరు కుదించి తీరుతానని, మిగిలిన భూములు పేదలకు పంచుతానని స్పష్టం చేశారు. కొల్లేరులోని 9 మండలాల్లో ఐదో కాంటూరు దిగువన గల 77138 ఎకరాల్లో చేపల చెరువులను కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వసం చేశారు. అయితే ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తే 14,861 ఎకరాల మిగులు భూములు ఉంటాయి. వాటన్నింటినీ పేదలకు పంచుతానని పేర్కొన్నారు. అయితే ఈ హామీకి చంద్రబాబు తూట్లు పొడిచారు. జిరాయితీ భూములకు నష్టపరిహారం ఇస్తామని ఇచ్చిన హామీనీ విస్మరించారు. బాబు హయాంలోనే కొల్లేరు కలుషితం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఆక్వా బకాసురులు కొల్లేరుపై కన్నేశారు. చేపల చెరువులు తవ్వేశారు. దీంతో కొల్లేరు కలుషితమైపోయింది. సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చే విదేశీ పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో పక్షుల జాతి అంతరించిపోవడాన్ని గమనించిన విదేశాలు తాము ఇచ్చిన నిధులు దుర్వినియోగమవుతున్నాయని ప్రపంచ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో చంద్రబాబు కొల్లేరు చెరువుల ధ్వంసానికి జీఓ నంబర్ 120 ఇచ్చారు. ఆ జీఓ కొల్లేరు ప్రజల పాలిట శాపంగా మారింది. 2006లో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో అప్పటి ప్రభుత్వం చెరువులను ధ్వంసం చేసింది. కొల్లేరు వాసుల జీవనం అధ్వానంగా మారేందుకు చంద్రబాబు కారకుడయ్యారు. ముఖ్య సమస్యలివీ.. ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్ హయాంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అయితే టీడీపీ హయాంలో పేదల కోసం ఒక్క సెంటు భూమి కొనలేదు. వైఎస్సార్ హయాంలో సేకరించిన భూమిలోనే ఇళ్లస్థలాలు ఇచ్చి జబ్బలు చరుచుకుంది టీడీపీ సర్కార అర్హులైన వారికి ఇళ్లస్థలాలు ఇచ్చిన దాఖలాలే లేవు. ఫలితంగా అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ హామీతో హర్షాతిరేకం చంద్రబాబు జీఓతో కొల్లేరు వాసులు పొట్టకొట్టిన నేపథ్యంలో ఇక్కడి మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్సీని ఇస్తానని, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కొల్లేరు ప్రాంత ప్రజలు ఆయన అధికారం చేపట్టే క్షణం కోసం నిరీక్షిస్తున్నారు. వలసల పాపం బాబుదే నియోజకవర్గంలోని నిడమర్రు, భీమడోలు మండలాల్లో కొల్లేరు పరీవాహక ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ మత్స్యసిరికి కొదవ ఉండేది కాదు. విదేశీ పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదంగా ఉండేది. ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి సంతాన ఉత్పత్తి కోసం పక్షులు ఇక్కడికి వచ్చేవి. దీంతో కొల్లేరు సంరక్షణకు ఆయా దేశాలు ఆర్థిక చేయూతనిచ్చేవి. అయితే స్వచ్ఛ కొల్లేరు ధ్వంసం అయిపోయింది. మత్స్యసంపదపై ఆధారపడి జీవించే వేలాది జీవితాలు నాశనమయ్యాయి. మత్స్యకారులు వలసబాట పట్టారు. పొట్ట చేత పట్టుకుని ఇతర జిల్లాలకు వెళ్లిపోయారు. కొందరు ఇళ్లలో వృద్ధులు, పిల్లలను వదిలేసి మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలకు పనుల కోసం పోయారు. ఈ పాపమంతా ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. భీమడోలు మండలంలోని పాతూరు సహకార చక్కెర కర్మాగారం చంద్రబాబు హయాంలోనే మూతపడింది. ఆ ఫ్యాక్టరీని నమ్ముకున్న వేలాదిమంది రోడ్డున పడ్డారు. జీవనం కోసం వలసపోయారు. -
మాజీ మంత్రి వట్టి కాంగ్రెస్‌కు గుడ్‌బై
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ కలవడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇరు పార్టీల అధ్యక్షులు రాహుల్, చంద్రబాబు ఢిల్లీలో గురువారం భేటీ కావడం, కలిసి పనిచేయాలని నిర్ణయించడం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. చంద్రబాబు లాంటి వ్యక్తితో చేతులు కలుపడమంటే పార్టీని పూర్తిగా దెబ్బతీయడమేనని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల పట్ల కలత చెందిన మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన బాటలో నడిచేందుకు మరికొందరు నేతలు సిద్ధమవుతున్నారు. 1970వ దశకం మొదట్లో కాంగ్రెస్‌లో చేరి 45 సంవత్సరాలుగా ఇంకో పార్టీవైపు చూడలేదని వట్టి వసంత్‌కుమార్ ‘సాక్షి’తో అన్నారు. 1983లో ఎన్టీ రామారావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెడితే వీధులెక్కి పోరాటాలు చేశామని, ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాము ఎన్నడూ వెనుతిరిగి చూడలేదన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని విడగొడితే పార్టీ ఓటింగ్ రెండు శాతానికి పడిపోయిందన్నారు. అయినా తాము పార్టీని వదలకుండా, దాన్ని బతికించుకోవాలని నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాటాలు చేశామన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి నిజాయితీతో పనిచేసుకుంటూ వచ్చాను, ఈరోజు సమాజాన్ని దోచేసిన నాయకులతో స్టేజి పంచుకోగలనా? అని వట్టి ప్రశ్నించారు. ఏ ఒక్కరితో వేలు పెట్టి చూపించుకునే పరిస్థితిలో తాను ఉండనని, అందుకే ఈ అనైతిక కార్యాచరణకి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. -
వట్టి వసంతకుమార్ మాతృమూర్తి కన్నుమూత
భీమడోలు : రాష్ర్ట మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మాతృమూర్తి వట్టి వాసుకి(82) శనివారం కన్నుమూశారు. ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. భర్త డీసీసీబీ మాజీ చైర్మన్ వట్టి వెంకటరంగ పార్థసారధి. కుమారులు మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, రమేష్‌లు కన్నీటి పర్యంతమయ్యారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఉమ్మడి ఆంధ్రరాష్ర్టంలో పసల సూర్యచంద్రరావు డెప్యూటీ స్వీకర్‌గా పని చేశారు. ఆయన ఏకైక కుమార్తె వాసుకి. ఆమెకు ఎంఎంపురానికి చెందిన వట్టి వెంకటరంగ పార్థసారధితో వివాహం జరిగింది. భర్త, కుమారుడు రాజకీయాల్లో రాణించేందుకు పూర్తి సహాయ సహకారాలందించిన వాసుకి సేవలు ఎనలేనివని పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రజాప్రతినిధుల సంతాపం ఏలూరు (టూటౌన్) : రాష్ట్ర సహకార కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు రాత్రి ఎంఎంపురంలోని వసంత్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వాసుకి మృతికి పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, జడ్పీ మాజీ చైర్మన్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు సంతాపం వ్యక్తం చేశారు. వైసీపీ కన్వీనర్లు పుప్పాల వాసుబాబు( ఉంగుటూరు) తలారి వెంకట్రావు (గోపాలపురం), గంటా మురళీకృష్ణ, వైసీపీ నాయకులు ఇందుకూరి రామకృష్ణంరాజు, జిల్లా నాయకులు కరాటం రాంబాబు, నాయకులు కరణం పెద్దిరాజు, బాదర్వాడ కృష్ణమోహనరాజు, వగ్వాల భాస్కర్, దేవినేని అవినాష్, , కారుమంచి రమేష్, జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన వివిధ వర్గాల నాయకులు నివాళులర్పించారు.