breaking news
VAT Bill
-
మున్సిపల్, వ్యాట్ బిల్లులకు మండలి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: పురపాలక, వాణిజ్య పన్నుల శాఖలకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులకు ఆదివారం శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎన్నికల సంస్కరణలు, అధికారులకు అధికారాల వికేంద్రీకర ణకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రవేశపెట్టగా, విలువ ఆధారిత పన్నుకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండలిలో ప్రవేశపెట్టారు. వ్యాట్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించ కపోవడం పేదలపై పెనుభారం మోపినట్లవుతోందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసికెళ్లేందుకు ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. -
కేజ్రీవాల్ ఇంటి ముందు ధర్నా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆప్ సర్కారు ఆమోదించిన వ్యాట్ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఉత్తర ఢిల్లీ సివిల్ లైన్స్ లోని కేజ్రీవాల్ నివాసం ఎదుట ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యాట్ బిల్లు(రెండో సవరణ)ను కేజ్రీవాల్ ప్రభుత్వం మంగళవారం ఆమోదించింది. దీని ప్రకారం ప్రభుత్వం 12.5 నుంచి 30 శాతం వ్యాట్ విధించనుంది.