breaking news
vara lakshmi vratam
-
శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వత్రం ఎప్పుడంటే..?
సకల శుభాల శ్రావణ మాసం ఈ నెల 25న ఆరంభం కానుంది. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల సౌలభ్యం కోసం ఆలయ నిర్వహణ కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది, అందుచేత మహిళలు ఈరోజును ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు. నెల రోజులుగా ఆషాఢం కావడంతో ముహూర్తాలు లేవు. ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో మహిళలు శ్రావణ లక్ష్మీ వ్రతాలను ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈనెల 26న మొదటి శుక్రవారం కావడంతో తమ ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రావణ లక్షి్మకి పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.నోముల మాసం శ్రావణం..పురోహితులు శ్రావణ మాసాన్ని నోముల మాసంగా అభివర్ణిస్తారు. శ్రావణంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతాలను ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణంలో వచ్చే ఏ మంగళవారమైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని యువతులు పెళైన ఏడాది తరువాత ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు.ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తారు. ముఖ్యమైన పండగలు..శ్రావణ మాసమంతా పండగల సందడి ఉంటుంది.ఈ నెల 26న తొలి శుక్రవారం, ఆగస్టు 1న రెండవ శుక్రవారం, ఆగస్టు 3న ఆదివారం స్నేహితుల దినోత్సవం, ఆగస్టు 8న మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 9న రాఖీ పండగ, అదే రోజు జంధ్యాల పౌర్ణమి, ఆగస్టు 15న నాల్గవ శుక్రవారం, ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండగలు శ్రావణంలో ఉన్నాయి. ఆగస్టు 22న ఐదవ శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది.శ్రావణం పూర్తయిన వెంటనే భాద్రపదం మాసం ఈ ఏడాది ఆగస్టు 27న జరగనున్న వినాయకచవితితో ప్రారంభంకానుంది.శ్రావణమాసానికి అత్యంత ప్రాధాన్యంసకల శుభాలను ఒసగే శ్రావణం జ్ఞానస్థితిని అందిస్తుంది. హరిహర భేదం లేదని నిరూపించే శ్రావణమాసంలో వైష్టవారాధనతో పాటు మహాశివుడికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు.ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి.ఎస్వీఎల్ఎన్ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టంఈ నెల 28 నుంచి మంచి ముహూర్తాలు.. నెల రోజులుగా ఉన్న ఆషాఢ మాసం ఈనెల 22తో ముగియనుంది. ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో ఈనెల 28 నుంచి ఆగస్టు 22 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో వ్రతాలతో పాటు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభాకార్యాలకు మంచి రోజులు కావడంతో శుభకార్యాలు చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జూలై 26,27,30,31 ఆగస్టు నెలలో1,3,4,6, 7, 8, 9, 10, 11, 13,14,17,18 తేదీలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణమాసంలో ఉన్న 17 మంచి ముహూర్తాల్లో జిల్లాలో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. (చదవండి: వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!) -
వరలక్ష్మి కృపకు ఆఖరి శుక్రవారం...ముఖ్యంగా పెళ్లికాని పడతులకు
మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసపు రెండో శుక్రవారం జరుపుకోవడం శాస్త్రంగా ఎంతో కాలం జరుగుతూ వస్తున్నది. అయితే ఏదైనా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం కానీ, ప్రత్యేక పూజలు కానీ చేసుకోలేని వాళ్లకు ఆఖరి శుక్రవారం చివరి అవకాశంగా భావిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, సకలశుభాలు కలగాలని ప్రార్థిస్తారు.చివరి రోజు మరింత ప్రత్యేకం..శ్రావణమాసం, శుక్రవారాలు ఎంత ప్రత్యేకమైనవో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే శుభప్రదమైన శ్రావణమాసంలో చివరి వారం కావడంతో బోలెడంత సందడి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిల లక్ష్మీ దేవి పూజకు మరింత ప్రత్యేకమని చెప్పాలి. ఆఖరి రోజు వ్రతం చేస్తే:ఆఖరి రోజున ఉపవాసం పాటించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజున యథావిధిగా రకరకాల పిండి వంటలు, క్షీరాన్నం, పళ్లు, పూలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ శుభసమయంలో శ్రీ యంత్రానికి పూజలు నిర్వహిస్తారు. రాత్రి నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ హ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే లక్ష్మి ఇంట్లో నివాసం ఉంటుందని నమ్మకం.అలాగే వరలక్ష్మి రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 11 పసుపు పిండి ముద్దలను లక్ష్మీదేవి పాదాలకు సమర్పించి, పూజ తర్వాత వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచితే దీనివల్ల ఆర్థిక లబ్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పించాలి. దీనివల్ల ఆర్థిక లబ్ది పొందే అవకాశం ఏర్పడుతుంది. పెళ్లికాని పడుచులకు వరం..పూజ చేసుకున్న వారి నుంచి తాంబూలం తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు తొందరగా పెళ్లవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. వరమహాలక్ష్మి వివిధ రూపాలలో కరుణిస్తుందని, అన్ని సమస్యలు తొలగిపోయి పెళ్లి జరిగేలా అనుకూలత ఇస్తుందని నమ్మకం. అందుకే కొన్ని ప్రాంతాలలో ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి, పూజ చేసుకుని ముత్తైదువుల నుంచి తాంబూలం అందుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. -
దేనికైనా రాసిపెట్టి ఉండాలి!
అపురూపం మనం తినే ప్రతి బియ్యపు గింజ మీదా మన పేరు రాసి ఉంటుందంటారు! నిజమే... మనకు దక్కాలని రాసిపెట్టి లేకపోతే, ఏదీ దక్కదు. నోటిదాక వచ్చిన కూడు ఆఖరిక్షణంలో నేలపాలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలాంటి ‘ఆఖరి క్షణపు’ అద్భుతాలకు, ఆశ్చర్యాలకు నెలవు... సినిమా ఫీల్డ్. కొన్ని పాత్రలకు ఎవర్నో అనుకుని, ఇంకెవర్నో తీసుకుంటారు. ఉదాహరణకు ‘మిస్సమ్మ’ సినిమానే తీసుకోండి. ఈ సినిమా లేకపోతే సావిత్రి లేదు. ఆమె కెరీర్‌కి ఓ గొప్ప టర్నింగ్ ఇది. నిజానికి ఈ పాత్ర భానుమతిది. నాలుగురీళ్ల షూటింగ్ కూడా జరిగిపోయింది. వరలక్ష్మీ వ్రతం చేసుకుని గంట ఆలస్యంగా షూటింగ్‌కి వచ్చిందని, నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి కయ్‌మన్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌కి ముందే ఇన్ఫామ్ చేశానని భానుమతి గట్టిగా రిటార్ట్ ఇచ్చారు. దాంతో చిలికి చిలికి గాలివాన అయ్యింది. చక్రపాణి కోపంతో అప్పటికప్పుడు షూట్ చేసిన రీళ్లన్నీ తెప్పించి తగల బెట్టేశారు. భానుమతి వెళ్లిపోయింది. మళ్లీ రాలేదు. ఆ ప్లేస్‌లో సావిత్రి వచ్చింది. గోల్డెన్ చాన్స్ ఆమెకు. ‘మిస్సమ్మ’ సావిత్రికి పెద్దబ్రేక్ ఇచ్చింది. అదంతా ఓ చరిత్ర. ఒకవేళ భానుమతి ‘మిస్సమ్మ’ చేసుంటే... ఎలా ఉండేదో కదా! ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలానే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ మధ్య వంశీ ‘దొంగరాముడు అండ్ పార్టీ’ అనే సినిమా తీశారు. శ్రీకాంత్ హీరో. సుహాసిని అనే కొత్తమ్మాయిని నాయికగా తీసుకున్నారు. ఫొటో సెషన్ కూడా చేశారు. అంతా ఓకే అనుకుని, లాస్ట్ మినిట్‌లో లయను తీసుకున్నారు. ఈ సుహాసిని ఆ తర్వాత ‘చంటిగాడు’ సినిమాతో హీరోయిన్గా ఎంటరైంది. నాగార్జున హీరోగా లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘డాన్’ సినిమా గుర్తింది కదా! ఇందులో మొదట హీరోయిన్గా మమతా మోహన్‌దాస్‌ని తీసుకున్నారు. ఓపెనింగ్ కూడా జరిగింది. కట్ చేస్తే - తర్వాత ఆ ప్లేస్‌లో అనుష్క వచ్చారు. మమత ఇక్కడ చాన్సు మిస్సయినా, తర్వాత ‘కింగ్’, ‘కేడీ’ సినిమాల్లో నాగ్‌తో కలిసి యాక్ట్ చేశారు. -సేకరణ: శ్రీబాబు