breaking news
vanathi Srinivasan
-
దక్షిణాది మహిళకే బీజేపీ పగ్గాలు?
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పానికి నిదర్శనంగా బీజేపీ చారిత్రక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ చరిత్రలో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు ఒక మహిళకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు ఈసారి దక్షిణాదికి చెందిన మహిళా నేతకే దక్కుతాయని ఢిల్లీలో ఉహాగానాలు ఊపందుకున్నాయి. ఈ రేసులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ప్రముఖ మహిళా నేతలు ఉన్నారనే చర్చ జరుగుతోంది.వారిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు.. మహిళకు పార్టీ పగ్గాలు కట్టబెట్టేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కూడా ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఏడాదిన్నర కాలంగా జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు కొద్దిరోజుల్లో తెరదించేలా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ముందంజలో నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ లను కలిశారు. కమలం పార్టీ అధ్యక్ష పీఠం కోసం జరుగుతున్న రేసులో ఆమె ముందువరుసలో ఉన్నారనే చర్చ మొదలైంది. సీనియర్ నేతగా, గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన అనుభం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించేందుకు వీలవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రేసులో పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్ నిర్మలా సీతారామన్ తర్వాత.. కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరు వినిపిస్తోంది. ఆమెకు పలు భాషల్లో ప్రావీణ్యం ఉంది. రాజకీయాల్లో ఎంతో అనుభవజ్ఞురాలు. అలాగే బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. తమిళనాడుకు చెందిన ఆమె వృత్తిరీత్యా న్యాయవాది. ప్రస్తుతం కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌పై విజయం సాధించారు. 1993లో బీజేపీలో చేరిన నాటినుంచి ఎన్నో కీలక పదువులు చేపట్టారు.2020లో మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా, 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి చేరుకున్న మొదటి తమిళనాటు మహిళా నేత వనతి. కాగా.. ఢిల్లీలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్‌ల సమావేశాలు నిర్వహిస్తోంది. ఆర్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, బీజేపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ లు పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లో బీజేపీ కొత్త అధ్యక్ష ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. -
National President: బీజేపీకి లేడీ బాస్?
-
వచ్చే నెలలోనే కొత్త సారథి..!
సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వచ్చే నెలలో కొలిక్కి రానుంది. పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఖరారు చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి చివరికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినా వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో వచ్చే నెల రెండో వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాంతం, అనుభవం, విధేయతల అనుగుణంగా పలువురు సీనియర్ నేతల పేర్లపై చర్చ జరుగుతుండగా, దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భిన్న ప్రాతిపదికలు.. జాతీయ అధ్యక్షుడి ఎంపికలో ప్రధానంగా నాలుగు అంశాల ప్రాతిపదికన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రాంతం, విధేయత, అనుభవంతో పాటు కొత్తగా మహిళను నియమించే అంశం తెరపైకి వచి్చంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే, దక్షిణాది రాష్ట్రాలకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడి రేసులో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. 45 ఏళ్లుగా పార్టీలో ఉన్న అనుభవం, యువమోర్చా నుంచి పార్టీలో పనిచేసిన అనుభవం ఆయనకు అనుకూలంగా మారుతోంది. దక్షిణాది నుంచి గతంలో బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు అధ్యక్షులుగా సేవలందించారు. ఇప్పటివరకు పార్టీ మహిళా అధ్యక్షురాలు లేనందున ఈసారి మహిళా అధ్యక్ష కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఇందులో తమిళనాడుకు చెందిన కీలక నేత వనతి శ్రీనివాసన్ పేరు ముందు వరుసలో ఉంది. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు మహిళల మద్దతు కూడగట్టేందుకు ఈమె ఎంపిక కలిసొస్తుందన్నది పార్టీ అంచనా. బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను ఎంపిక చేసింది. అదే వరుసలో మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. విధేయత, పార్టీలో పనిచేసిన అనుభవం ఆధారంగా చూస్తే భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు సన్నిహితులు. పైగా యూపీ, మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వ్యూహాలు రచించడంలో దిట్టలైన వీరిద్దరిలో ఒకరి ఎంపిక జరిగితే అది కచ్చితంగా మోదీ, షాల సూచన మేరకే జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆర్ఎస్ఎస్ మద్దతున్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులైన మనోహర్‌లాల్ ఖట్టర్, శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి ఆర్ఎస్ఎస్ నుంచి పూర్తిగా మద్దతున్నా, కేంద్రంలో వీరికున్న ప్రాధాన్యం దృష్ట్యా అధ్యక్ష ఎంపికలో వీరిని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? తేలాల్సి ఉంది. -
మహిళాభ్యుదయం కోసమే ‘4 ఈ సెంటర్’
నాగోలు: మహిళల అభ్యున్నతి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని, మహిళాసాధికరతకు ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ అన్నారు. బుధవారం రాత్రి నాగోలు డివిజన్ బండ్లగూడ అనంద్‌నగర్‌లో బీజేపీ రంగారెడ్డి అర్బన్ మహిళా మోర్చా పాలసీ, రీసెర్చ్ ఇంచార్జి కాలంశెట్టి లయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (చదువు, ఉపాధి, వ్యవస్థాపకత, సాధికారత) 4 ఈ సెంటర్‌ను వనతి శ్రీనివాసన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలను చదువు, ఉపాధి రంగాలలో ప్రోత్సహించాలని సూచించారు. వ్యవస్థాపకత, సాధికరత కోసం 4 ఈ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లో రాణించేలా మహిళలను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిరంతరం ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సుకన్య సమృద్ధి పథకం, ఆయుష్మాన్ భారత్ తదితర పథకాలపై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. మహిళల అభ్యదయ కోసం తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా 4 సెంటర్ నాగోలులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, నాగోలు కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, రాష్ట్ర ఇంచార్జి నళిని, రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ విభాగం అధ్యక్షుడు సామ రంగారెడ్డి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి, నేతలు శ్యామల, గజం రాజ్యలక్షి్మ, బద్దం బాలకృష్ణగౌడ్, డప్పురాజు పాల్గొన్నారు. -
తమిళి సై టీం రెడీ
* కార్యవర్గం ప్రకటన * వానతికి ఉపాధ్యక్ష పదవి * ప్రధాన కార్యదర్శిగా మోహన్‌రాజు సాక్షి, చెన్నై : రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తన టీంను సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని తమిళి సై ప్రకటించారు. వానతీ శ్రీనివాసన్‌కు ఉపాధ్యక్ష పదవి, ఎస్ మోహన్‌రాజు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకున్న పొన్ రాధాకృష్ణన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని నెలల అనంతరం ఎట్టకేలకు ఆ పదవి తమిళి సై సౌందరరాజన్‌ను వరించింది. పార్టీలకు అతీతంగా అందరూ ఆహ్వానించారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి ఆమె సాగించిన సేవకు ప్రతి రూపంగా పార్టీ నాయకత్వ పగ్గాలు దక్కాయని చెప్పవచ్చు. అయితే, ఆమెను అధికార పూర్వకంగా అధ్యక్షురాలిగా ఆమోదించేందుకు మరి కొన్ని నెలలు పట్టాయి. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమెను అధ్యక్షురాలిగా ఆమోదిస్తూ తీర్మానించారు. దీంతో తమిళి సై టీం ఎలా ఉండబోతోందోనన్న ఎదు రు చూపులు పెరిగాయి. రాష్ట్రంలో అధికార పగ్గాలు లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీకి రాష్ట్ర కార్యవర్గం మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో తన టీం ఎంపికపై తీవ్ర కసరత్తులు చేసిన తమిళి సై ఎట్టకేలకు శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ జాబితాను ప్రకటించారు. కొత్త టీం బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో అధ్యక్షురాలితో పాటుగా తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, తొమ్మిది మంది కార్యదర్శుల్ని నియమించారు. కోశాధికారి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా ఒకర్ని నియమించారు. ఆ జాబితా మేరకు ఉపాధ్యక్షులుగా - వానతీ శ్రీనివాసన్, శుభ నాగరాజన్, కరుప్పు ఎం.మురుగానందన్, డీ.కుప్పురాము, ఎం.చక్రవర్తి, ఎస్.సురేంద్ర, ఎం.సుబ్రమణి, శివగామి పరమశివం, తమిళరసి యోగంను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా ఎస్.మోహన్‌రాజులు(నిర్వాహక), ఎస్ఆర్.శరవణ పెరుమాళ్, కేఎస్.నరేంద్రన్, జీకేఎస్.సెల్వకుమార్, కార్యదర్శులుగా ఎస్.పళనిస్వామి, ఎస్.ఆదవన్, కె.టి.రాఘవన్, పొన్ బాలగణపతి, సీ.ధర్మరాజు, బి.జి.మోహన్‌రాజు, మహాలక్ష్మి, గిరిజ, మనోహరన్, అనుచంద్రులు వ్యవహరించనున్నారు. రాష్ట్ర కోశాధికారిగా ఎస్ఆర్ శేఖర్, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా కే.సర్వోత్తమన్లనునియమించారు. కాగా కన్యాకుమారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ధర్మరాజును రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో ఆయన స్థానంలో ఆ జిల్లా అధ్యక్షుడుగా ధర్మపురం తిరుగణేషన్ వ్యవహరించనున్నారు.