breaking news
Vamsadhara villagers
-
అచ్చెన్నకు మా ఉసురే తగిలింది
సాక్షి, శ్రీకాకుళం: తమ త్యాగాలకు కనీస విలువ ఇవ్వకుండా నాడు పోలీసులతో ఉక్కుపాదం మోపించి కేసులు పెట్టించారని, ఆ ఉసురే మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి తగిలిందని వంశధార నిర్వాసితులు మండిపడ్డారు. ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు అరెస్టయిన నేపథ్యంలో వంశధార నిర్వాసితులు శనివారం హిరమండలంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన అచ్చెన్నపై చూపుతున్న కరుణ తమపై నాడు చూపారా అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. 2017లో సంక్రాంతి చేసుకొని ఆనందంగా గ్రామాలను విడిచిపెడతామని చెప్పినా వినకుండా పోలీసు లాఠీదెబ్బలతో పాటు కేసులు నమోదుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. నాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేగా ఉన్న కలమట వెంకటరమణమూర్తి ప్రోద్బలంతోనే అదంతా జరిగిందన్నారు. నాడు లేని బాధ ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. బాధను దిగమింగుతూ కష్టాలను ఎదురీదుతూ గడిపామని అప్పటి పరిస్థితులను తలచుకున్నారు. కనీసం పునరావాస కాలనీల్లో వసతులు లేకుండా బలవంతంగా పంపించారని మండిపడ్డారు. అందుకే జైలు పాలయ్యారన్నారు. చదవండి: ‘కోడెలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు’ నాడు తమపై కేసులు మోపినప్పుడు కనీసం పలకరించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తమకు న్యాయం జరిగిందన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి చొరవచూపుతున్నారని.. ప్రాధాన్యతాక్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. సమావేశంలో జి.శ్రీనివాసరావు, ఎం.భాస్కరరావు, రేగాన ప్రకాశరావు, తొత్తడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: జేసీ ట్రావెల్స్ అక్రమాల పుట్ట -
వాతపెట్టి వెన్న రాస్తున్నారు!
వాతపెట్టి వెన్న పూసినట్టుంది వంశధార నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం తీరు. నాలుగున్నరేళ్లుగా నరకాన్ని చూపించిన సర్కార్ ఇప్పుడు కేసులు ఎత్తివేసినట్టుప్రకటన చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కేసులు ఎత్తివేత తెరపైకి తెచ్చారన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు తాము ఎలా ఉన్నామో.. ఏం చేస్తున్నామో కనీసం పట్టించుకోకుండా.. తమ త్యాగాలకు విలువ లేకుండా వ్యవహరించిన ప్రభుత్వం కేసుల ఎత్తివేతను సాకుగా చూపి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడంపై పునరావాస కాలనీల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులు పెదవివిరుస్తున్నారు. గుండెల్లో మానని గాయాన్ని రేపి మందురాసే ప్రయత్నం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతోనే సర్కార్ దిగి వచ్చిందని ప్రజలంటున్నారు. శ్రీకాకుళం, హిరమండలం,కొత్తూరు: భవిష్యత్ తరాల కోసం సర్వం త్యాగం చేసి నిర్వాసితులుగా మారిన వారిపై ప్రభుత్వం కపట ప్రేమ నటిస్తోంది. వంశధార ప్రాజెక్టు నిర్మాణంతో ఆస్తులను కోల్పోయిన తమకు తగిన పరిహారం, ప్యాకేజీ అందించి ఆదుకోవాలని కోరితే ఆగ్రహిం చిన టీడీపీ సర్కార్ అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందని.. ఎన్నికలు సమీపిస్తుండడంతో కేసులు ఎత్తివేస్తున్నట్టు చెప్పడం విడ్డూరంగా ఉందని నిర్వాసితులంటున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేసిన సుమారు 1200 మందిపై సర్కార్ పోలీసులు కేసులను గతంలో పెట్టించిం ది. అయితే వీరిపై కేసులు ఎత్తివేయాలనిరాష్ట్ర ప్రభుత్వం గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. అయితే ఇన్నాళ్లు లేని ప్రేమ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒలకబోస్తుండడాన్ని నిర్వాసితులు తప్పుపడుతున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రభుత్వాన్ని నమ్మమని తేల్చి చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలా.. వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా హిరమండలం మండలంలోని దుగ్గుపురం, పాడలి, తులగాం, పెద్దసంకిలి, చిన్నకొల్లివలస, గార్లపాడు పంచాయతీలు, ఎల్.ఎన్. పేట మండలంలోని పెద్ద కొల్లివలస పంచాయతీ, కొత్తూరు మండలంలోని ఇరపాడు పంచాయతీ పరిధిలోని 19 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. అయితే నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేసింది. పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించలేదు. ప్యాకేజీలు, పరిహారాలు చెల్లించలేదు. నిర్వాసిత రైతులు సాగు చేసిన పంట పొలాలను పోలీసుల సాయంతో ధ్వంసం చేశారు. దీంతో నిర్వాసితుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వాసితుంటున్న ప్రాంతంలో పర్యటించి నిర్వాసితుల తరఫున గళమెత్తారు. దీంతో ప్రభుత్వం దిగు వచ్చింది. ముందుగా యూత్ప్యాకేజీలు, పరిహారాల పేరుతో రూ.420 కోట్లు విడుదల చేసింది. కానీ ఇందులో కూడా నియోజకవర్గం స్థాయి ప్రజాప్రతినిధి నుంచి గ్రామాల్లో అధికా ర పార్టీ చోటా నాయకులు, బినామీల పేరిట యూత్ ప్యాకేజీలను కైంకర్యం చేశారు. వేలాదిమంది నిర్వాసితులకు ఇతర ప్యాకేజీలు, నష్టపరిహారం అందించలేదు. పునరావాసం కల్పిం చలేదు. ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా రిజర్వాయర్ పనులపైనే దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో నిర్వాసిత గ్రామాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. 2017 జనవరి 22వ తేదీ భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులంతా కదలివచ్చి రిజర్వాయర్ పనులను అడ్డుకున్నారు. తమ హక్కులను కాలరాస్తున్నారని భావించి రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపడుతున్న కంపెనీల కు చెందిన నిర్మాణ సామగ్రి, యంత్రాలు ధ్వంసం చేశారు. జనరేటర్‌తో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రూ.4 కో ట్లు నష్టం వాటిల్లినట్లు సంబంధిత కంపెనీ చెప్పుకొచ్చింది. అం తనష్టం జరగలేదని నిర్వాసిత సంఘ నాయకులు, విపక్షాలు మొత్తుకున్నా పోలీసులు వినలేదు. ఇదే అదునుగా భావించిన ప్రభుత్వం సుమారు 1200 మందిపై 16 రకాల కేసులు పెట్టిం చింది. వీటిలో ఆరేడు కేసులు నమెదైన వ్యక్తులున్నారు. త్యాగా లకు విలువ లేకపోగా.. తమకు న్యాయపరంగా రావల్సిన పరిహారం మంజూరు కాకపోవడంతోనే తామంతా రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని నిర్వాసితులు చెప్పినా ప్రభుత్వం వినలేదు. ఏళ్ల తరబడి ఉంటున్న గ్రామాల నుంచి బలవంతగా పోలీసుల సాయంతో ఖాళీ చేయించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను సైతం నేలమట్టం చేశారు. ఒక్క నెల గడువు అడిగినా పాలకులు, ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్ హామీతో.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాతపట్నం నియోజకవర్గం మెళియపెట్టిలో గత ఏడాది డిసెంబర్ 24వ తేదీన జరిగిన బహిరంగ సభలో వంవధార నిర్వాసితులపై ఉన్న కేసులన్నీ ఎత్తువేస్తామని ముందుగానే ప్రకటించారు. దీంతో నిర్వాసితులంతా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో నిర్వాసితులకు దగ్గరవ్వాలని చూస్తున్న చంద్రబాబు నిర్వాసితులపై నమోదు చేయించిన కేసులను ఎత్తివేస్తున్నట్టు చేసిన ప్రటనను ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఎన్నికల స్టంటే నిర్వాసితుల పక్షాన పోరాడుతున్నాననే అక్కసుతో ప్రభుత్వం అన్నిరకాల కేసులు తనపై మోపింది. కొద్ది రోజులు కుటుంబాన్ని వదిలి అజ్ఞాత జీవితాన్ని సైతం గడిపాను. భార్య, పిల్లలు ఆకలితో అలమటించారు. నిర్వాసితులుగా మారిన మాకు న్యాయంగా రావల్సిన నష్టపరిహారాలతో పాటు మెరుగైనా ప్యాకేజీ అందించాలని మాత్రమే తాము కోరాం. కానీ ప్రభుత్వం తమపై కక్షకట్టే విధంగా వ్యవహరించింది. ఇప్పుడు కేసుల ఎత్తివేత ఎన్నికల స్టంటే. – గొర్లె మోహన్‌రావు, నిర్వాసితుడు పాడలి -
వంశధార నిర్వాసితుల ఆందోళన.. ఉద్రిక్తత
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం దుగ్గుపురంలో వంశధార నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆదివారం పాడలి, తులగాం, దుగ్గుపురంలో వంశధార స్టేజ్ పనులు పునః ప్రారంభమయ్యాయి. పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించొద్దని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాదిగా బయలుదేరిన గ్రామస్తులు పనులను అడ్డుకుని అక్కడి టెంట్లను కూల్చి కుర్చీలను విరగ్గొట్టారు. నిర్వాసితుల ఆందోళనతో అధికారులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో వంశధార రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించారు.