టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ
మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలకేంద్రంలో మంగళవారం భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న వల్లూరి సాయికుమార్ అనే టీడీపీ నేత ఇంట్లోకి దొంగలు ప్రవేశించి రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రూ.50 వేల నగదును దోచుకెళ్లారు. విషయం తెలిసి రామచంద్రాపురం డీఎస్పీ మురళీకృష్ణ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను సంఘటనాస్థలానికి రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చేపట్టారు.