breaking news
vagdevi engineering college
-
ధర్మసాగర్ రిజర్వాయర్‌లో విద్యార్థులు గల్లంతు
వరంగల్ : వరంగల్ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద శనివారం విషాదం చోటు చేసుకుంది. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వరంగల్ శివారులోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు శనివారం చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు యువకులతోపాటు ఇద్దరు యువతులు ఉన్నారు. వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్న ఉప్పల శ్రీనిధి, రమ్య ప్రత్యూష, శ్రావ్యారెడ్డి(19), కర్నె శివసాయి (19), పొలినేని శివసాయికృష్ణా (20), పొలినేని వినూత్న (18) తో పాటు మరో యువకుడు కలిసి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు సరదాగా ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. అయితే అదృష్టవశాత్తు ప్రత్యూషను మాత్రం పక్కనే ఉన్న మరో కళాశాల విద్యార్థులు కాపాడారు. విద్యార్థుల మరణ వార్త విన్న వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి శ్రావ్యారెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుల వివరాలు ఇవీ... ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి వెళ్లిన వారిలో.. శ్రావ్యారెడ్డి, కర్నె శివసాయి, ఉప్పల శ్రీనిధి, పొలినేని శివసాయికృష్ణ, పొలినేని వినూత్న మరణించారు. రామప్రత్యూషను మాత్రం చుట్టుపక్కల ఉన్నవాళ్లు కాపాడగలిగారు. -
ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు: విద్యార్థులకు గాయాలు
వరంగల్ : వరంగల్ నగరంలోని ఆర్టీఏ జంక్షన్లో బస్సు... ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి... విద్యార్థులతో వెళ్తున్న స్థానిక వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు... బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో విద్యార్థులు గాయపడ్డారు.