ట్యాంకర్ను ఢీకొట్టిన బస్సు: విద్యార్థులకు గాయాలు | students injured in bus accident in warangal | Sakshi
Sakshi News home page

ట్యాంకర్ను ఢీకొట్టిన బస్సు: విద్యార్థులకు గాయాలు

Jul 29 2016 9:57 AM | Updated on Nov 9 2018 4:44 PM

వరంగల్ నగరంలోని ఆర్టీఏ జంక్షన్లో బస్సు..ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది.

వరంగల్ : వరంగల్ నగరంలోని ఆర్టీఏ జంక్షన్లో బస్సు... ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు.

వివరాలు ఇలా ఉన్నాయి... విద్యార్థులతో వెళ్తున్న స్థానిక వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు... బ్రేక్లు ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో విద్యార్థులు గాయపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement