breaking news
vadiyampeta
-
ఎన్హెచ్ 44పై ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం : నగర శివారులోని జాతీయ రహదారి 44పై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వడియంపేటకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో 14మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా బుక్కచర్ల నుండి వడియంపేటకు వ్యవసాయ పనులకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులంతా మహిళలే. పని వెళ్లిన తమవాళ్లు విగతజీవులుగా మారడటంతో కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
బుక్కరాయసముద్రం : వడియంపేటలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయాలపాలయ్యారు. పొలీసులు తెలిపిన వివరాలు మేరకు... నల్లమాడ గ్రామానికి చెందిన రమణ హైదరాబాద్ సమీపంలోని షాద్నగర్లో ఓ పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఆదివారం రమణ అతని భార్య కళ్యాణి, పెద్ద కూతురు జయశ్రీ, చిన్న కూతురు తేజశ్విని, రమణ వదిన భాగ్యలక్ష్మి, ఆమె కుమార్తె మాధవిలు షాద్నగర్ నుంచి నల్లమాడకు కారులో బయలు దేరారు. అనంతపురం నగర సమీపంలో వడియంపేట దగ్గరకు రాగానే రామ్నగర్ మలుపు వద్ద జాతీయ రహదారిపై గ్యాస్ ఫ్యాక్టరీ నుంచి రోడ్డుపైకి వస్తున్న లారీ... కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారందరికీ గాయాలయ్యాయి. కళ్యాణి, జయశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.