ఈ ఏడాది చివరి నాటికి అధునాతన కార్ల టెక్నాలజీ..!
ఎదురెదురుగా వాహనాలు వచ్చినా... ఒకదానితో ఒకటి ఢీకొనవు... అంతే కాకుండా ప్రమాదానికి ఆస్కారముందని డ్రైవర్లను అప్రమత్తం కూడా చేస్తాయి... దీంతో ప్రమాదాలు విపరీతంగా తగ్గే అవకాశముంటుంది.... అవును మీరు వింటున్నది వాస్తవమే. ఈ ఏడాది చివరి నాటికి ఈ అధునాతన టెక్నాలజీ రోడ్లపైకి వచ్చే అవకాశముంటుంది. కార్లలో అమర్చే V2V చిప్ ద్వారా ఇది సాధ్యమే.2026 చివరి నాటికి కొత్త వాహనాలలో V2V చిప్ చేరే అవకాశముంటుంది. కొత్త కార్లలో కంపెనీల నుంచే చిప్ యాడ్ అయిన తర్వాత వాహనాలు చేతికి అందుతాయి. చిప్ ధర కేవలం 5వేల రూపాయల నుంచి నుండి 7 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇప్పటికే... ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ....రెనాల్ట్ ఇండియా కంపెనీ.... తన పాపులర్ ఎస్ యూవీ డస్టర్ వాహనానికి సంబంధించి మూడవ తరం మోడల్ ను ఇటీవల జనవరి 26న భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఆ వాహనంలో చిప్ అమర్చి ఉన్న తీరును.. అది పని చేస్తున విధానాన్ని... టీజర్ ను విడుదల చేసి ఫస్ట్ లుక్ ను చూపించింది. ఈ కారు భద్రత కోసం లెవల్ -2 ఏడీఏఎస్ ఫీచర్లను పొందే అవకాశం ఉందని ప్రతినిధులు వెల్లడించారు.