Uttar Pradesh Assembly Polls 2017
-
యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్ కౌంటర్
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అధికార బీజేపీ, విపక్ష సమాజ్‌వాదీ పార్టీల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. ఎన్కౌంటర్లపై ఇరు పార్టీలు వాదులాడుకుంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన “యమరాజ్” వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఎన్కౌంటర్లు చేయింస్తోందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించడంతో ఈ వివాదం ముదిరింది. అఖిలేశ్ ఆరోపణలకు ఎన్డీఏ మిత్రపక్షం సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కౌంటర్ ఇవ్వడంతో వాగ్యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది.ఉత్తరప్రదేశ్‌లో కులం, రాజకీయ ప్రయోజనాల ఆధారంగా బీజేపీ ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేయిస్తోందని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. వీటిలో కొన్ని నకిలీ ఎన్కౌంటర్లు కూడా ఉన్నాయని ధ్వజమెత్తారు. యోగి ఆదిత్యనాథ్ సర్కారు కొన్ని వర్గాలను ప్రత్యేకంగా టార్గెట్ చేసిందన్నారు. అఖిలేశ్ ఆరోపణలకు మద్దతుగా సమాజ్‌వాదీ పార్టీ యువజన విభాగ నేత పంకజ్ రాజ్‌భర్.. లక్నోలోని పార్టీ కార్యాలయం బయట ఓ భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. 2024 నుంచి 2026 మధ్య కాలంలో హత్యకు గురైన రాజ్‌భర్ కులానికి చెందిన వారి ఫొటోలు ఇందులో ముద్రించారు. వారణాసి, ఘాజీపూర్, జౌన్పూర్, బరాబంకీ, కుషీనగర్, సంత్ కబీర్ నగర్, మౌ, బల్లియా జిల్లాల్లో హత్యకు గురైన వారి వివరాలు ఇందులో పేర్కొన్నారు.ఈ పోస్టర్ రాజకీయంగా యూపీలో తీవ్ర దుమారం రేపింది. రాజకీయ ప్రయోజనాల కోసమే సమాజ్‌వాదీ పార్టీ తన కార్యాలయం ఎదుట ఈ పోస్టర్ పెట్టిందని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ విమర్శించారు. ప్రభుత్వ ఎన్కౌంటర్లను ఆయన సమర్థించారు. పోస్టర్లో పేర్కొన్న పలువురిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేర కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి నేరస్థులపై పోలీసులు తీసుకునే చర్యలకు రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఎంతో మంది నేరస్థులను కాపాడిందని ఆయన ఆరోపించారు.ఎన్నికల అంశంగా ఎన్కౌంటర్లు2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజ్‌భర్ వర్గం మద్దతు పొందడానికి సమాజ్‌వాదీ పార్టీ చేసిన ప్రయత్నంగా ఈ వ్యవహారాన్ని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎన్కౌంటర్ల అంశం కీలకంగా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై మున్ముందు అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని భావిస్తున్నారు. చదవండి: కేంద్రం నిర్ణయంపై అన్నామలై అభ్యంతరంటికెట్ చిరిగిపోవడం ఖాయంమహిళలు, అమ్మాయిల జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరిస్తూ యమరాజు పదాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్కువగా ఉచ్చరిస్తున్నారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని, వెంటనే వారి టికెట్ కత్తిరించడానికి యమరాజు సిద్ధంగా ఉంటాడని సీఎం యోగి వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, ఆయన 9 ఏళ్ల పాలనలో 17,043 ఎన్కౌంటర్లు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
సోనియాజీకి అస్వస్థత.. మోదీ ట్వీట్
-
సోనియాజీకి అస్వస్థత.. మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: వారణాసి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియగాంధీ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అర్ధంతరంగా తన రోడ్డుషోను రద్దు చేసుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ విషయం తెలియగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్లో స్పందించారు. ‘సోనియా అనారోగ్యంగా ఉన్నారని తెలిసింది. ఆమె త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’అని మోదీ ట్వీట్ చేశారు. నరేంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసి ప్రధాన టార్గెట్‌గా సోనియాగాంధీ మంగళవారం యూపీలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వారణాసిలో ఆమె భారీ రోడ్డుషో చేపట్టారు. తద్వారా యూపీలో తమ బలాన్ని చాటే ప్రయత్నం చేశారు. ఇప్పటికే యూపీ సీఎం అభ్యర్థిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల కోసం ప్రియాంకగాంధీతోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
సోనియాకు తీవ్ర జ్వరం.. రోడ్ షోకు బ్రేక్!
వారణాసి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వారణాసిలో తలపెట్టిన రోడ్డుషో అర్ధాంతరంగా ముగిసింది. ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో రోడ్డుషోను సగంలోనే రద్దు చేయాల్సి వచ్చింది. అస్వస్థతకు గురైన సోనియా వైద్యుల సలహాపై హుటాహుటిన ఢిల్లీ విమానంలో వెళ్లిపోయారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటే ఉద్దేశంతో సోనియా నేతృత్వంలో వారణాసిలో భారీ రోడ్డుషో నిర్వహించారు. అత్యంత అట్టహాసంగా వేలాదిమంది కార్యకర్తలతో ఈ రోడ్డుషో సాగింది. ఎస్వీయూలో నిలబడి పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ సోనియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని గంటలపాటు రోడ్డుషోలో పాల్గొన్న ఆమె.. రోడ్డుషో ముగిసిన అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే, రోడ్డు షో మరికాసేపట్లో ముగుస్తుందనగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యులు ఆమెను పరీక్షించి తదుపరి కార్యక్రమాలు రద్దుచేసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో సోనియా అర్ధంతరంగా విమానంలో బయలుదేరారు. అయితే, ఆమె త్వరలోనే కోలుకొని పార్టీ ప్రచారంలో పునరుత్తేజంతో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. -
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప..!?
వారణాసి: వరుస ఎదురుదెబ్బల నడుమ గత వైభవం కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. అందరి కన్నా ముందే పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రచారభేరిని మోగిస్తున్న ఆ పార్టీ యూపీ గడ్డపై సత్తా చాటాలని తాపత్రయపడుతోంది. అయితే, ఇదంతా ఆషామాషి విషయం కాదని హస్తం నేతలే అంగీకరిస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప యూపీ ఎన్నికల్లో తాము గట్టెక్కలేమని యూపీ పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ కుండబద్ధలు కొట్టారు. అయితే, ఆ అద్భుతం మంగళవారం వారణాసిలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రోడ్డుషోతో ప్రారంభమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసి ప్రధాన టార్గెట్‌గా సోనియాగాంధీ మంగళవారం ప్రచార శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఇందులో భాగంగా వారణాసిలో ఆమె రోడ్డుషోలో పాల్గొంటున్నారు. 6.4 కిలోమీటర్ల దూరంపాటు ఈ బైక్ ర్యాలీ.. రోడ్డుషో జరగనుంది. అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో సోనియా ప్రసంగిస్తారు. ఈ రోడ్డు, బహిరంగ సభ ద్వారా తమ బలాన్ని చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే యూపీ సీఎం అభ్యర్థిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల కోసం ప్రియాంకగాంధీతోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.


