సోనియాజీకి అస్వస్థత.. మోదీ ట్వీట్‌ | I pray for Sonia quick recovery, good health, says PM Modi | Sakshi
Sakshi News home page

సోనియాజీకి అస్వస్థత.. మోదీ ట్వీట్‌

Aug 2 2016 8:29 PM | Updated on Oct 22 2018 9:16 PM

వారణాసి పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియగాంధీ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: వారణాసి పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియగాంధీ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అర్ధంతరంగా తన రోడ్డుషోను రద్దు చేసుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ విషయం తెలియగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్‌లో స్పందించారు. ‘సోనియా అనారోగ్యంగా ఉన్నారని తెలిసింది. ఆమె త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’అని మోదీ ట్వీట్ చేశారు.

నరేంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసి ప్రధాన టార్గెట్‌గా సోనియాగాంధీ మంగళవారం యూపీలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వారణాసిలో ఆమె భారీ రోడ్డుషో చేపట్టారు. తద్వారా యూపీలో తమ బలాన్ని చాటే ప్రయత్నం చేశారు. ఇప్పటికే యూపీ సీఎం అభ్యర్థిగా ఢిల్లీ మాజీ ముఖ్యమం‍త్రి షీలా దీక్షిత్‌ను కాంగ్రెస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల కోసం ప్రియాంకగాంధీతోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement