వేడుకగా వెంకన్న ఉట్లోత్సవం
సాక్షి,తిరుమల: శ్రీకృష్ణజన్మాష్టమి పురస్కరించుకుని శుక్రవారం మధ్యాహ్నం తిరుమల ఆలయం వద్ద ఉట్లోత్సవం (శిక్యోత్సవం) వేడుకగా జరిగింది. మలయప్ప, శ్రీకృష్ణస్వామి వేర్వేరు వాహనాలపై ఆలయ పురవీధుల్లో ఊరేగారు. తొలుత పెద్ద జీయర్మఠంలోనూ, తర్వాత హథీరామ్మఠంలోనూ, చిన జీయర్మఠం, కర్ణాటకా సత్రాల వంటి మొత్తం 16 ప్రాంతాల్లో ప్రత్యేక çపూజలందుకున్నారు. ఆయా ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో టీటీడీ ఉద్యోగులు, మఠం సిబ్బంది, స్థానికంగా ఉండే యువత ఉట్టికొట్టేందుకు ఉత్సాహం చూపారు. ఈసందర్భంగానే ¿¶ క్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు దంపతులు, డెప్యూటీఈవో కోదండరామారావు, హథీరాంమఠం మహంత్ అర్జున్దాస్ పాల్గొన్నారు.