breaking news
utilize
-
స్వచ్ఛ ఓటర్ల జాబితా ముఖ్యం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు అనేది అత్యంత కీలకమని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులు ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీలో 100శాతం స్వచ్చత ఎంత ముఖ్యమో... ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈసీఐ ప్రతినిధుల బృందం సారథి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై శుక్రవారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్‌తోపాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్‌కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్ పోలీస్ నోడల్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ తదితరులు హాజరయ్యారు. ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ అర్హత ఉన్నవారందరూ ఓటు నమోదు చేసుకునేలా, ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం ప్రధానమని చెప్పారు. బూత్, నియోజకవర్గ స్థాయిలో గతంలో నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలించి... తక్కువగా ఉన్నచోట అందుకు కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సమగ్ర, పటిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) అవసరమని, స్వచ్చమైన ఓటర్ల జాబితాతోపాటు సుశిక్షితులైన మానవవనరులు, మెటీరియల్ తదితరాలపై దృష్టిసారించాలన్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలు ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ఈఎస్ఎంఎస్, సువిధ, ఈఎన్‌కోర్, సీ విజిల్, ఈటీపీబీఎంఎస్, ఓటర్ టర్నవుట్, కౌంటింగ్ ఓట్స్ యాప్‌లపై అధికారులు, సిబ్బందికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్నారు. జిల్లాస్థాయిలోనూ సమర్థ మానవ వనరులతో ఐటీ టీమ్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, ఓటు హక్కుపై స్ఫూర్తిదాయకమైన ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు, విశ్వసనీయత పెంపొందిస్తూ క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, మద్యం, డబ్బు తదితరాల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, ఎన్నికల సమయంలో నమోదైన కేసుల విచారణ, రాజకీయ తటస్థత కలిగిన ఎన్జీవోలు, పౌర సంస్థల భాగస్వామ్యం, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం, ఓటింగ్ శాతం పెంపు కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు తదితరాలపై ఈసీఐ అధికారులు పలు సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు ఎస్ఎస్ఆర్–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎస్పీలు శాంతిభద్రతల పరిరక్షణ, గత ఎన్నికల నిర్వహణ సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణ, అక్రమ మద్యం, డబ్బు తరలింపులను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, చెక్‌పోస్టుల మ్యాపింగ్, సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారదర్శకంగా ఎస్ఎస్ఆర్–2024: సీఈవో రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్–2023 కింద ఈ ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రచురించిన తర్వాత నుంచి దాదాపు 90 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో 89 లక్షల దరఖాస్తుల పరిష్కారం పూర్తయిందన్నారు. మిగిలినవి ఈ నెల 26లోపు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం ఎస్ఎస్ఆర్–2024, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ప్రతి దశలోనూ సమస్యను గుర్తించడంతోపాటు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి
– మంత్రి లక్ష్మారెడ్డి – ఆయకట్టుకు కోయిల్‌సాగర్ నీటి విడుదల కోయిల్‌సాగర్ (దేవరకద్ర రూరల్): సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రతి నీటి బొట్టు వథా కాకుండా చూడాల్సిన బాధ్యత ఆయకట్టు రైతులపై ఉందన్నారు. దేవరకద్ర మండలంలోని భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ కోయిల్‌సాగర్ నీటిని గురువారం దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిలతో కలిసి మంత్రి లక్ష్మారెడ్డి ఆయకట్టుకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ఎంతో శ్రమకోర్చి జూరాల నుంచి లిఫ్టు ద్వారా కోయిల్‌సాగర్‌కు కష్ణా జలాలను తరలించామన్నారు. నీటిని వథా చేయకుండా ఆయకట్టు రైతులు సేద్యానికి ఉపయోగించుకొని లబ్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిలాల్, ఎంపీడీఓ భాగ్యలక్ష్మి, ఎంపీపీ గోపాల్, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, హర్షవర్ధన్‌రెడ్డి, దేవరకద్ర వ్యవసాయ కమిటీ ఛైర్మన్ జెట్టి నర్సింహ్మారెడ్డి, ప్రాజెక్టు కమిటీ మాజీ ఛైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి, నాయకులు దేవరి మల్లప్ప, కొండా శ్రీనివాస్‌రెడ్డి, రఘువర్మ, భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కర్ణంరాజు, దొబ్బలి ఆంజనేయులు, అంజన్‌కుమార్, ఇరిగేషన్ అధికారులతో పాటు దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాల ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిధులను సద్వినియోగం చే సుకోవాలి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రజాధనాన్ని వృథా చేయొద్దని హితవు ముత్తారం : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను గ్రామ పంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పుట్టమధు పేర్కొన్నారు. మండలంలోని లక్కారంలో ఉపా«ధిహామి నిధులు రూ.13లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ. 8 లక్షలతో అంగన్వాడీ భవనం, ఖాజీపల్లి రూ.8 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం కాకుండా చూడాలని ఆయన కోరారు. ప్రజల నుండి పన్నుల రూపంలో వసూళ్లు చేసిన డబ్బులనే ప్రభుత్వం అభివృద్ధి పనులకు వెచ్చిస్తోందని అలాంటి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని ఆయన అన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన శ్రీకోదండరామాలయం నిర్మాణం పూర్తిచేయించాలని స్థానికులు కోరగా ఆలయ నిర్మాణం పూర్తిచేయించడం తనవల్ల కాదని నిర్మాణానికి తనవంతు సాయం అందిస్తానని హామిఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తెచంద్రమౌళి, మండల కోఆప్షన్ సభ్యుడు సలీంసత్తార్, సర్పంచ్‌లు అగ్గిమల్ల సతీష్, చెల్కల అశోక్, నూనె కుమార్, ఉపసర్పంచ్ బర్ల శ్రీలత, మాజీ ఎంపీటీసీ రొడ్డ శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్డు సభ్యుల అలక.. లక్కారం, ఖాజీపల్లిలో ఆదివారం నిర్వహించిన పలు శంకుస్థాపన శిలాఫలకాల్లో తమపేర్లు ముద్రించలేదని వార్డుసభ్యులు అలకభూనారు. కనీసం పంచాయతీ భవన నిర్మాణం శిలాఫలకంలోనైనా తమపేర్లు ముద్రించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. పంచాయతీ భవనం ప్రారంభం సమయంలో ఏర్పాటు చేసే శిలాఫలకంలో వార్డు సభ్యులందరి పేర్లు ముద్రించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీపీ అత్తె చంద్రమౌళి హామీ ఇచ్చినా వారు వినిపించుకోలేదు. దీంతో శంకుస్థాపన కార్యక్రమానికి వార్డుసభ్యులు దూరంగా ఉన్నారు. ఉచిత వైద్యశిబిరం ప్రారంభం ఓడేడ్‌లో దివంగత మాజీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యుడు పోతుపెద్ది రాంచెంద్రారెడ్డి స్మారకార్థం ఏర్పాటుచేసిన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంబించారు. గ్రామంలోని నిరుపేదలకు రాంచెంద్రారెడ్డి వైద్యపరంగా ఏన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి యేడాది గ్రామస్తుల కోసం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన సంవత్సరీకం సందర్భంగా వైద్యశిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉచిత వైద్యశిబిరం నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇల్లెందుల అశోక్‌గౌడ్, ఎంపీటీసీ పోతుపెద్ది కవిత, మాజీ సర్పంచ్ పోతుపెద్ది కిషన్‌రెడ్డి, నాయకులు అల్లాడి యాదగిరిరావు, పూదరి మహేందర్, శీలం తిరుపతి, కోటగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.