breaking news
USISPF
-
యూఎస్ఐఎస్పీఎఫ్ బోర్డ్లోకి కుమార మంగళం బిర్లా
న్యూయార్క్: దేశీ పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తాజాగా యూఎస్–ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్ ఫోరం (యూఎస్ఐఎస్పీఎఫ్) డైరెక్టర్ల బోర్డులో చేరారు. వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలుస్తూ, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు కృషి చేస్తున్నందుకు గాను గత నెలలో వాషింగ్టన్ డీసీలో జరిగిన లీడర్షిప్ సదస్సు 2025లో ఆయన గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, ఆర్థిక బంధాలను పటిష్టం చేయడంలో యూఎస్ఐఎస్పీఎఫ్ బలమైన శక్తిగా ఎదిగిందని బిర్లా తెలిపారు. తమ సంస్థ అమెరికాలో అతి పెద్ద భారతీయ ఇన్వెస్టరుగా కార్యకలాపాలు సాగిస్తోందని, మరింతగా పెట్టుబడులను పెంచే ప్రణాళికలు ఉన్నాయని ఆయన వివరించారు. అమెరికాలో ఆదిత్య బిర్లా గ్రూప్ 15 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. మెటల్స్, కార్బన్ బ్లాక్, రసాయనాలు తదితర రంగాల్లో 15 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. దాని అనుబంధ సంస్థ అయిన నోవెలిస్ ప్రపంచంలోనే అతి పెద్ద అల్యుమినియం రీసెక్లింగ్ కంపెనీ. -
ప్రత్యక్ష, పరోక్ష పన్నులు: సీతారామన్‌కు యూఎస్ఐఎస్పీఎఫ్ కీలక సూచనలు
న్యూఢిల్లీ:మరికొన్ని రోజుల్లో 2023-24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రడీ అవుతున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని ఇండియా సెంట్రిక్ టాప్ పరిశ్రమ బృందం ఆర్థికమంత్రికి కీలక విజ్ఞప్తి చేసింది. భారత దేశంలోని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని, హేతు బద్ధీకరించాలని భారతదేశం-కేంద్రీకృత అమెరికా వ్యూహాత్మక, వ్యాపార సలహా బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. ఇది ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచి, భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తెచ్చి పెడుతుందని తెలిపాయి. విదేశీ కంపెనీల కార్పొరేట్ పన్ను రేట్లను హేతుబద్ధం చేయండి అంటూ యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ సమర్పణలకు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖకు కోరింది. మూలధన లాభం పన్ను సంస్కరణలను సరళీకృతం చేయాలని, వివిధ సాధనాల హోల్డింగ్ కాలాలు, రేట్లను సమన్వయం చేయాలని కోరింది. గ్లోబల్ టాక్స్ డీల్‌కు భారత నిబద్ధతను పునరుద్ఘాటించడంతోపాటు, సెక్యూరిటీలలో పెట్టుబడి నుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ (FPI) వరకు రాయితీ పన్ను విధానాన్ని విస్తరించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి సూచించింది. అంతేకాదు హెల్త్ లాంటి నిర్దిష్ట సెక్టార్లలో పునరుత్పాదక శక్తి, ఆర్ అండ్ డీ పెట్టుబడులపై పన్ను రాయితీలను కూడా కోరింది.(Union Budget 2023 ఆ పథకాలకు పెద్ద పీట, వారికి బిగ్ బూస్ట్) స్థిరమైన, ఊహాజనిత పన్ను పర్యావరణం కోసం వాదించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం సరళీకరణ, వ్యాపారం ఖర్చులను హేతుబద్ధీకరించడం, పన్ను రేట్లు , సుంకాలను హేతుబద్ధీకరించడం వంటివి ఉన్నాయి. చమురు మరియు సహజ వాయువు కంపెనీలకు అందించిన కస్టమ్స్ సుంకం మినహాయింపులపై వివరణ కోరింది. దీంతోపాటు ఎక్స్-రే యంత్రాల కోసం కస్టమ్స్ సుంకం రేట్లను 10 శాతం నుండి 7.5 శాతానికి తగ్గించడం, నిర్దేశిత పరిశోధన ద్వారా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపును అందించాలని తెలిపింది. ఉత్పత్తి ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని పోషకాహార ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంపును ఉపసంహరించుకోవాలని కూడా అభిప్రాయపడింది. భారతదేశంలో శాస్త్రీయంగా రూపొందించే పోషకాహారం లభ్యతను ప్రోత్సహించాలని ఆర్థిక మంత్రిని కోరింది. కస్టమ్స్ టారిఫ్‌లు సుంకాలు మరియు కస్టమ్స్ సిఫారసుకు సంబంధించి టెలికాం ఉత్పత్తులపై కస్టమ్స్ టారిఫ్ చట్టంలోని అస్పష్టతలను పరిష్కరించాలని తెలిపింది. అలాగే CAROTAR , ఫేస్‌లెస్ ఎసెస్మెంట్ వంటి వాణిజ్య సులభతర పథకాలను బలోపేతం చేయాలని అధునాతన జీవ ఇంధన ప్రాజెక్టులకు రాయితీ కస్టమ్స్ సుంకం పొడిగింపును యూఎస్ఐఎస్పీఎఫ్ కోరింది. (Union Budget-2023పై కోటి ఆశలు: వెండి, బంగారం ధరలపై గుడ్‌న్యూస్!)