breaking news
United States Air Force
-
పశ్చిమాసియాలో యుద్ధం.. ‘బ్లడ్ చిట్’ చూశారా? అంటే ఏంటంటే?
న్యూఢిల్లీ: అమెరికా వైమానిక దళానికి చెందిన మూడు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు మార్చి 1న రాత్రి 11.03 గంటలకు కువైట్ గగనతలంలో కుప్పకూలాయి. ఈ ఘటన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి సంబంధించిన యుద్ధ చర్యల సమయంలో జరిగింది.ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇరాన్ యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు దాడులు చేస్తున్న సమయంలో కువైట్ గగనతలరక్షణ వ్యవస్థలే పొరపాటుగా అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకున్నాయి.ఈ ఘటన తర్వాత ‘బ్లడ్ చిట్’ అనే చిన్న నోటీసుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాల పైలట్లే ‘బ్లడ్ చిట్’ను తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.వైరల్ అవుతున్న బ్లడ్ చిట్లో ఏముంది?అమెరికన్ పైలట్లు తమ జాకెట్ల లోపల ఈ బ్లడ్ చిట్‌ను కుట్టుకుని మరీ ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లిష్, అరబిక్, టర్కిష్, పర్షియన్, కుర్దిష్ భాషలలో అందులో సందేశం ఉంది. "నేను అమెరికన్‌ని. నాకు మీ భాష రాదు. నేను మీకు ఎటువంటి హాని చేయను. దయచేసి నాకు ఆహారం, నీరు, ఆశ్రయం, దుస్తులు అందించి వైద్య సాయం అందేలా చేయండి. అమెరికన్ లేదా మా మిత్ర దేశాల దళాల వద్దకు చేరుకోవడానికి నాకు సాయం చేయండి. మీరు నా పేరు, ఈ నంబర్‌ను అమెరికా అధికారులకు అందిస్తే, మీకు బహుమతి లభిస్తుంది" అని బ్లడ్ చిట్లో ఉంది. అయితే, ఈ బ్లడ్ చిట్ నిజంగా అమెరికా దళాలకు చెందిందేనా? అన్న విషయంపై అధికారికంగా ఎటువంటి నిర్థారణ లేదు. అయినప్పటికీ బ్లడ్ చిట్లు పెట్టుకెళ్లడం అమెరికా దళాలకు అలవాటే.బ్లడ్ చిట్ అంటే ఏంటి?బ్లడ్ చిట్ అనేది చిన్న నోటీసు. యుద్ధ సిబ్బంది, ముఖ్యంగా వైమానిక దళ సిబ్బంది తమ వద్ద దీన్ని పెట్టుకుంటారు. సాధారణ పౌరులను ఉద్దేశించి దీన్ని రాసిపెట్టుకుంటారు. తనకు సాయం అందించాలని అభ్యర్థిస్తూ ఓ సందేశాన్ని అందులో రాస్తారు. యుద్ధ విమానం కూలిపోతే లేదా ఏదైనా ప్రాంతంలో చిక్కుకుపోతే అక్కడి సాధారణ ప్రజలకు దీన్ని చూపిస్తారు. సైనికుడికి అక్కడి భాష రాకపోవచ్చు.దీంతో బ్లడ్ చిట్‌ను సాధారణంగా అనేక భాషల్లో ముద్రిస్తారు. దాన్ని చూపిస్తున్న వ్యక్తి మిత్ర దేశానికి చెందిన సైనికుడని అందులో ఉంటుంది. ఆ వ్యక్తికి ఆహారం, నీరు, ఆశ్రయం, వైద్య సాయం అందించాలని అందులోనే ముందుగానే రాసి పెట్టుకుంటారు. తనకు సాయం చేసి సురక్షితంగా తిరిగి పంపితే తమ దేశ ప్రభుత్వం ప్రతిఫలం ఇస్తుందన్న హామీ కూడా అందులో రాసి ఉంటుంది. “బ్లడ్ చిట్” అనే పదం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆ సమయంలో చైనా, బర్మా సహా ఆసియా ప్రాంతాల్లో అమెరికా వైమానిక సిబ్బంది తమ జాకెట్ వెనుక భాగంలో బ్లడ్ చిట్ కుట్టించుకునేవారు. అమెరికా జెండా ముద్రించి, స్థానిక భాషల్లో సందేశం రాసి బ్లడ్ చిట్ ఉండేది.American pilots shot down over Kuwait had a “blood chit” in English, Arabic, Turkish, Persian & Kurdish: asking locals for food, water, shelter, medical help, and to contact U.S. authorities for a reward. pic.twitter.com/NRSB73XW9X— Zar Hemi 🇬🇧 (@ZerdashtHami) March 3, 2026 -
చిరకాల శత్రువుల కరచాలనం
ప్రమాదంలోనూ ఓ సుగుణం ఉంది. ఊహింపశక్యంకాని కూటములకు అది దారితీస్తుంది. ఐఎస్ఐఎస్ విషయంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన మౌన ఒప్పందం అలాంటిదే. అమెరికా వైమానిక దళం మద్దతుతో ఇరాన్‌కు చెందిన అల్ కుద్స్ సైనికాధికారులు, సైన్యమూ తిక్రిత్‌లో ఇరాకీ భూతల ప్రతిఘటనా దాడికి నేతృత్వం వహించారు. అణు ఒప్పందం కుదిరితే ఇరాన్‌పై ఆంక్షల సడలింపు గురించి ఇప్పటికే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సమాలోచనలు జరుపుతున్నది. పౌరులకు సౌఖ్యంగా అనిపించేలా చేయడానికి దేశాలు కనిపెట్టిన భ్రమే స్థిరత్వం. ప్రభుత్వాల నియంత్రణకు మించిన గురుత్వాకర్షణ శక్తి ఈడ్చుకు పోతుంటే దేశాలు మునిగిపోతాయి. లేదంటే మంచిగా ఒక్కొక్క మెట్టే పైకి పోతాయి. గమన వేగం తరచుగా మెల్లగానూ, కొన్నిసార్లు అదృశ్యంగానూ సాగుతుంది. అంతేగానీ సమాజం ఎన్నటికీ స్థిరంగా ఉండదు. 21వ శతాబ్ది మొదటి పదిహేనేళ్లలో ఆఫ్రికా ఖండపు అట్లాంటిక్ తీరప్రాంతాల నుంచి పసిఫిక్ మహాసముద్రంలోని జపాన్ తీరం వరకు ఉన్న ప్రాంతం ఒక వాలు గా మారింది. అందులోని పశ్చిమ భాగం ఊబిలోకి దిగజారిపోతుండగా, భారత్ మొదలు తూర్పు భాగం ఒక్కొక్క అంగుళమే పైకి లేస్తోంది. ఇది ఒక సరిసమాన వాస్తవం కాకపోవచ్చు. కొన్ని మినహాయింపులు దీనికి ఉన్నాయి. ఒంటరిగా, విడిగా ఉన్న భూభాగంగా ఇజ్రాయెల్ దీనికి మినహాయింపు కాదు. ఆ దేశ రాజధాని టెల్ అవీవ్‌లోని రియల్ ఎస్టేట్ ధరలే ఉదాహణ. శతఘు్నల గురికి అందుబాటులో, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆ నగరంలో కంటే మీరు యూరప్‌లోనే అపార్ట్‌మెంట్‌ను కొనుక్కోవ చ్చు. కానీ అక్కడా ఇక్కడా రియల్ ఎస్టేట్ ధరలు ఒకేలా ఉంటాయి. ఇజ్రాయెల్‌ను చట్టుముట్టి ఉన్న దేశాల రాజకీయాల వల్ల ఆ దేశ భౌగోళిక- రాజకీయాలు మారాయి. ఇజ్రాయెల్ ప్రథమ శ్రేణి దేశంగానే ఉంటున్నా... పలు యుద్ధాలు వ్యాపించి ధ్వంసమైన ఆ ప్రాంతంలో దాని అస్తిత్వం నేడు అనుబంధమై నదిగా మారింది. ఇజ్రాయెల్ నేత బెంజమిన్ నెతన్యాహూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతూనే ఉండి ఉండొచ్చు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఏకాకి గా ఉండటం ద్వారానే తన భద్రతను అత్యుత్తమంగా పరిరక్షించుకుంటోంది. వివేకంతో దగ్గరగా నిలచి జాగ్రత్తగా గమనిస్తున్న వీక్షక పాత్రధారిగా మారిం ది. ఇజ్రాయెల్ తన శత్రువులను బలహీనపర్చాల్సిన పనే లేదు. అవి వాటికవే తమను తాము బలహీనపరచుకుంటున్నాయి. ఇజ్రాయెల్ చుట్టూ వ్యాపించిన సంఘర్షణ అంచులు ఇక ఎంత మాత్రమూ జాతీయ సరిహద్దుల వెంబడి సాగడం లేదు. అట్టోమన్ సామ్రా జ్య పతనంతో మొదలైన జాతీయ సరిహద్దుల విచ్ఛిన్నం వలస పాలనలో సుదీర్ఘంగా కొనసాగింది. వారి ఆదేశాల ఫలితంగానే పలు దేశాల సరిహద్దు లు సాధారణ సరళ రేఖలుగా మారాయి. అందుకే ఉద్రిక్తతల రేఖలు భౌగోళి కమైనవి కావు, జనాభాపరమైనవి. పాత శత్రుత్వాలకు సంబంధించినవి. ప్రజాభీష్టానుసారం, ప్రజల ఇచ్ఛకు అనుగుణంగా, ప్రజలకు మంచి యైన దాన్ని చేయడానికి మౌలిక ఆవశ్యకత జాతీయ రాజ్యాల ఏర్పాటే. కానీ అరబ్బు, అరబ్బేతర ప్రాంతాల్లోని చాలా సున్నీ ముస్లిం దేశాలు జాతీయ రాజ్యాలను ఏర్పరచుకోవడంలో విఫలమై అంతర్యుద్ధాల్లోకి దిగజారాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ క్షీణత మరమ్మతులకు వీలుకానంతగా దిగజారినట్టనిపి స్తోంది. చరిత్ర శిథిలాలు, తప్పిదాల శకలాల అతుకుల బొంతగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఆవిర్భావం అందుకు గొప్ప ఉదాహణ. ఈ తీవ్రవాద భూతం తమ శత్రువులను నాశనం చేస్తుందనే ఆశ తో ప్రాంతీయ, ప్రపంచ శక్తులు దానికి ఆర్థిక వనరులను సమకూర్చాయి. అది తన పోషకులకు కూడా అంతే విధ్వంసకారి అని ఇప్పుడు వాటికి అర్థమైంది. ప్రమాదంలో కనీసం ఓ సుగుణం ఉంది. ఒకప్పుడు ఊహింపశక్యంకాని కూటములను అది పెంపొందింపజేస్తుంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఐఎస్ఐఎస్ విషయంలో కుదిరిన మౌన ఒప్పందం కచ్చితంగా అలాంటి వాటి లోకెల్లా ఆసక్తికరమైనది. అవి రెండూ ఆ కూటమిలోకి భిన్న దృక్పథాలతో వచ్చినవి. విభిన్నమైన యుద్ధానంతర పరిస్థితులు వాటికవే సమస్యాత్మక దశ కు ఊపిరిపోస్తాయి. కానీ ఇప్పటికైతే అవి తమ పరిమిత ఒప్పందాన్ని సమం జసమైనదిగా చేసే దారి కోసం అన్వేషిస్తున్నాయి. అమెరికా వైమానిక దళం మద్దతుతో ఇరాన్‌కు చెందిన అల్ కుద్స్ సైనికాధికారులు, సైన్యమూ ఇరాకీ భూతల ప్రతిఘటనా దాడికి నేతృత్వం వహించాయి. సహకారం వల్ల తక్షణ వ్యూహాత్మక లాభాల అనుభవమూ, విశాల ప్రయోజనకరమైన అంశాలు కలసి అమెరికా, ఇరాన్‌ల మధ్య అణు ఒప్పందం కుదరడాన్ని అనివార్యం చేశాయి. దీనికి కూడా అవాంతరాలు త లెత్తే అవకాశం ఉంది. అయితే అణు ఒప్పందం కుదిరితే ఇరాన్‌పై ఆంక్షల సడలింపు గురించి ఇప్పటికే ఐరాస భద్రతా మండలి సమాలోచనలు జరుపుతున్నది. అంతా అనుకున్నట్టే జరిగితే అమెరికా, ఇరాన్‌లు రెండూ ఇరాక్ హింసాగ్ని గుండాన్ని చల్లార్చడానికి కలిసి ప్రయత్నించడం ప్రారంభమవుతుంది. రెండిటిలో ఏదీ ఈ పనిని ఒంటరిగా చేయలేదు. ఇరాక్ భూభాగంపై ఇరాన్ కాల్బలం కవాతు చేయగలిగిన స్థితిలో ఉంది, అమెరికా సేనలు అక్కడ కాలు మోపే పరిస్థితి లేదు. తాత్కాలికమే అయినా అదీ ఉన్న స్థితి. ఐఎస్ఐఎస్ ఒక వ్యాధిలాగా తీవ్ర పర్యవసానాలతో ప్రబలి...అల్‌కాయిదా సమస్యను నల్లి కాటులా అనిపించేలా చేసే ప్రమాదకర అత్యవసర పరిస్థితిని రెంటిలో ఏదీ తక్కువగా అంచనా వేయడం లేదు. మనం మాట్లాడుతున్నది ఆత్మాహుతి దాడులకు పంపే ఉగ్రవాదుల గురించి కాదు.... అరబ్బు ప్రాంతాల్లోనూ, వాటిని దాటి కూడా విఫల పరిపాలన సృష్టించిన శూన్యాన్ని భర్తీ చేస్తూ దేశాలను ఆక్రమించడానికి జిహాద్ పేరిట సిద్ధంగా ఉన్న సేనల గురించి. ఈ పెద్ద లక్ష్యంతో పోలిస్తే ఇతరత్రా సమాం తర ప్రయోజనాలు ఏవైనా సాపేక్షంగా తక్కువ మూల్యం చెల్లించాల్సినవే. ఐఎస్ఐఎస్ కేంద్రంగా నెలకొనే అరాచక పరిస్థితులకు చెల్లించాల్సి మూల్యం అంచనాకు అందేది కాదు. ఇది అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ కాలంలోని మిగతా భాగం గడిచేలోగా పూర్తయ్యే పనేమీ కాదు. అయితే ఆయన దీన్ని ప్రారంభించకపోతే ఆయన వారుసునిగా వచ్చేవారు కూడా ఆ పని చే యలేరు. 1979లో అమెరికా, ఇరాన్‌ల మధ్య విభేదాలు తలెత్తడం, అదే ఏడాది సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చే యడంతో అంతవరకు ఉన్న ప్రయోజనాల పరస్పర అనుసంధానాల సంతులనం తలకిందులైంది. పశ్చి మ ఆసియాలో జరిగిన మూడు అరబ్బు-ఇజ్రాయెల్ యుద్ధాలను, లెబనాన్ సంక్లిష్ట కల్లోలాన్ని, పాలస్తీనా కోసం సాగిన బహుముఖ యుద్ధాలను ఆ సంతులనం తట్టుకుని నిలిచింది. షియా-సున్నీ శాంతికి హామీని కల్పిం చింది. సుదీర్ఘమైన ఈ డ్రామాలోని ఉప ఇతివృత్తం ఆ షియా-సున్నీ సంబం ధాలే. సోవియట్ సేనలు నిష్ర్కమించాయి, వారి యూనియన్ మరణిం చింది. కానీ పర్యవసానాలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. అమెరికా- ఇరాన్ అణు ఒప్పందం సైతం వారి మధ్య చెప్పుకోదగినంతటి సౌహార్ద్రతకు దారితీస్తుందని చెప్పలేం. ఆదర్శవంతమైన దాని కోసం అన్వేషణలో మంచి దాన్ని విడనాడవద్దనేది అంతర్జాతీయ జీవితంలోని మౌలిక నియమం. ఇప్పటికిదే ఉత్తమం. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
భూమికి తిరిగొచ్చిన అమెరికా అంతరిక్ష విమానం
లాస్ ఏంజెలిస్: భూమి చుట్టూ 22 నెలల పాటు రహస్యంగా చక్కర్లు కొట్టిన అమెరికా అంతరిక్ష విమానం ‘ఎక్స్-37బీ’ ఎట్టకేలకు భూమికి క్షేమంగా తిరిగి వచ్చింది. 2012, డిసెంబరులో మూడోసారి నింగికి ఎగిరిన ఈ విమానం శుక్రవారం కాలిఫోర్నియాలోని వైమానిక స్థావరంలో సురక్షితంగా దిగింది. నాసా గతంలో ఉపయోగించిన స్పేస్ షటిల్ వ్యోమనౌకల మాదిరిగా మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలయ్యే అంతరిక్ష విమానం తయారీలో భాగంగా.. అమెరికా ఈ బుల్లి మానవ రహిత విమానాన్ని రహస్యంగా పరీక్షిస్తోంది. 8.8 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ విమానం మూడోసారి విజయవంతంగా తిరిగిరావడంతో.. అంతరిక్ష విమాన తయారీలో కీలక ప్రగతి సాధించినట్లైందని అమెరికా వాయుసేన ప్రకటించింది. కాగా, ప్రస్తుతం అమెరికా వద్ద బోయింగ్ కంపెనీ రహస్యంగా తయారుచేసిన రెండు ‘ఎక్స్-37బీ’ అంతరిక్ష విమానాలు ఉన్నాయని ‘జిన్హువా’ వార్తాసంస్థ పేర్కొంది.


