united airlines pilot
-
పాస్‌పోర్టు మర్చిపోయిన పైలట్.. విమానం వెనక్కి..
విమానంలో ప్రయాణించే ప్రయాణికులకే కాదు.. విమానం నడిపించే పైలట్‌కు కూడా పాస్‌పోర్టు ఉండాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. అలాంటి ఇబ్బందే ప్రయాణికులకు అనుభవంలోకి వచ్చింది. ఎయిర్‌పోర్టు (Airport) నుంచి బయలుదేరిన విమానం పైలట్ పాస్‌పోర్టు (Passport) మర్చిపోవడంతో వెనక్కి మళ్లింది. అసలేం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం 257 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం చైనాలోని షాంఘైకి బయలుదేరింది. టేకాఫ్ అయిన 2 గంటల తర్వాత పైలట్ వద్ద పాస్‌పోర్టు లేదని గుర్తించారు. అతడు పాస్‌పోర్టు ఇంట్లో మర్చిపోయి వచ్చాడు. దీంతో చేసేది లేక ఎయిర్‌పోర్టు అధికారుల ఆదేశాల మేరకు విమానాన్ని వెనక్కిమళ్లించాడు. యూ–టర్న్ తీసుకున్న విమానం సాయంత్రం 5 గంటలకు మళ్లీ లాస్ ఏంజెలెస్ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది.ప్రయాణికుల కోసం అధికారులు మరో విమానాన్ని, పైలట్‌ను సిద్ధం చేశారు. రాత్రి 9 గంటలకు అది టేకాఫ్ అయ్యింది. 12 గంటలు ప్రయాణించి ఎట్టకేలకు షాంఘైకి చేరుకుంది. పైలట్ వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించిన సంగతి నిజమేనని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి నిర్ధారించారు. లాస్ ఏంజెలెస్‌లో ల్యాండైన వెంటనే ప్రయాణికులకు ఆహార కూపన్లు, పరిహారం అందించామని చెప్పారు. ఒక్కో కూపన్ విలువ 15 డాలర్లు (రూ.1,283) అని తెలిపారు. యూఎస్ పోస్ట్‌మాస్టర్ జనరల్ రాజీనామావాషింగ్టన్: డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) చీఫ్ ఎలాన్ మస్క్‌తో విభేదాల నేపథ్యంలో యూఎస్ పోస్ట్ మాస్టర్ జనరల్ లూయిస్ డిజాయ్ రాజీనామా చేశారు. తన శాఖకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందివ్వాలన్న మస్క్ నిర్దేశాలను ఆయన ఖాతరు చేయలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. నష్టాలను తగ్గించేందుకు యూఎస్ పోస్టల్ సర్వీస్‌ను ప్రైవేటీకరించాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఈ విభాగాన్ని కామర్స్ విభాగంలో ఆధ్వర్యంలో ఉంచాలని ప్రకటించారు కూడా.చదవండి: ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు.. అమెరికాకు భారీ షాక్ రిపబ్లికన్ పార్టీకి విరాళాలిచ్చే ప్రముఖుల్లో ఒకరైన లూయిస్‌ను ట్రంప్ మొదటి సారి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు 2020లో యూఎస్పీఎస్ చీఫ్‌గా నియమించారు. డోజ్ సిఫారసుతోనే పోస్టల్ శాఖలో కనీసం 10 వేల మందిని తొలగించేందుకు ఈ నెల ప్రారంభంలోనే లూయిస్ అంగీకరించారు. ఇతర మార్పులను కాంగ్రెస్ ద్వారా చేయాలని ఆయన వాదిస్తున్నారు. ఈ విషయంలో మస్క్‌తో తలెత్తిన విభేదాల నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు. -
అనుభవంలేని పైలట్లతో ప్రమాదాలు
న్యూఢిల్లీ: ప్రయాణికుల విమాన చార్జీల విషయంలో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల మధ్య నేడు అనారోగ్య పోటీ నెలకొందని, ఇది అత్యంత ప్రమాదకరమైనదని రిటైర్డ్ అమెరికా నావల్ ఏవియోటర్, మాజీ యునెటైడ్ ఏయిర్‌లైన్స్ పైలట్ అమి ఫ్రహర్ తెలియజేస్తున్నారు. ఈ పోటీ కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు తక్కువ జీతాల పేరిట తక్కువ అనుభవంగల పైలట్లను నియమిస్తున్నారని, ఇది విమాన ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని ఆయన హెచ్చరించారు. ఆయన ఫ్రాన్స్‌లో కూలిపోయిన జర్మనీ విమానం ‘ఎయిర్‌బస్ ఏ320’ ప్రమాదం గురించి ప్రస్తావిస్తూ, తానిక్కడ కోపైలట్ ఆత్మహత్య చేసుకోవాలనే మానసిక పరిస్థితి గురించి మాట్లాడదల్చుకోలేదని, కేవలం 630 కిలోమీటర్ల ఫై్లయింగ్ అనుభవం ఉన్న కోపైలట్ లూబిడ్జ్ను ఎలా విధుల్లోకి తీసుకున్నారన్నదే తన ప్రశ్నని అన్నారు. తాను 2001 నుంచి ఇప్పటివరకు, అంటే దశాబ్దకాలంలో జరిగిన ఐదు అమెరికా విమాన ప్రమాదాల సంఘటనలపై అధ్యయనం చేశానని, అన్ని కూడా పైలట్ అనుభవరాయిత్యం కారణంగానే జరిగాయని ఆయన చెప్పారు. ఈ ప్రమాదాల అనంతరమే పెలైట్ల నియామకానికి అమెరికా విమానయాన సంస్థలు వెయ్యి గంటల ఫై్లయింగ్ అనుభవాన్ని ప్రమాణికంగా పెట్టుకున్నాయని ఆయన తెలిపారు. పైగా ఈ పైలట్లందరూ పౌర విమానయాన శిక్షణా సంస్థల్లో శిక్షణ పొందిన వారని, ఎవరూ కూడా సైనిక శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందినవారు కాదని చెప్పారు. సైనిక శిక్షణ సంస్థల్లో కొంతకాలమైన శిక్షణ తప్పనిసరి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కోపైలట్ లూబిడ్జ్కి కూడా ఇలాంటి శిక్షణ తీసుకోలేదని విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. లోకాస్ట్ పోటీ కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు తక్కువ అనుభవంగల పైలట్లను తీసుకోవడమే కాకుండా వారిని ఎక్కువ గంటలపాటు విధుల్లో ఉంచుతున్నారని, అది మరీ ప్రమాదకారణమని ఆయన హెచ్చరించారు. పైలట్లు ఎక్కువ గంటలపాటు విధులు నిర్వహిస్తే వారు అలసిపోవడమే కాకుండా వారిలో మానసిక ఒత్తిడి తీవ్రమవుతుందని, కోపైలట్ లూబిడ్జ్ తరహాలో మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.