breaking news
under-11
-
చాంప్స్ సాహితి, హరిచరణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి అండర్-11 చెస్ టోర్నమెంట్‌కు నగరం నుంచి సాహితి, హరిచరణ్ సాయి అర్హత సంపాదించారు. హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో సూపర్ కిడ్స్ చెస్ అకాడమీలో ఈ టోర్నీ జరిగింది. ఈ సెలక్షన్ టోర్నమెంట్ బాలికల విభాగంలో వి. సాహితి గెలుపొందగా, జి. సాహిత్య రన్నరప్‌గా నిలిచింది. బాలుర విభాగంలో హరిచరణ్ టైటిల్ సాధించగా, కె. తరుణ్ రెండో స్థానం పొందాడు. విభాగానికి ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీలో హైదరాబాద్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రత్యేక ప్రైజ్‌మనీ ఈవెంట్ విజేతలు: బాలికలు: 1. త్రిష, 2. వైష్ణవి. 3. సంజన వర్మ, 4. హర్షిత, 5.పద్మప్రియా, 6.సాధ్వి, 7. సుసేన్ రెడ్డి; బాలురు: 1. సాయి సిద్ధార్థ, 2. హర్షిత్‌కృష్ణ, 3. అకిరా సౌమ్యనాథ్, 4. ప్రణవ్, 5. వరుణ్ గోపాల్, 6. రోహిత్, 7. ప్రణీత్ ఉప్పల. -
విజేత ప్రియాంక
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నూతక్కి ప్రియాంక జాతీయ అండర్-11 చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం ముగిసిన ఈ టోర్నీ లో ప్రియాంక పది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 11 రౌండ్లలో ప్రియాంక పది గేముల్లో గెలవడం విశేషం. అండర్-11 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాహుల్ శ్రీవాత్సవ్ రన్నరప్‌గా నిలిచాడు. అతను ఎనిమిదిన్నర పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.