చాంప్స్ సాహితి, హరిచరణ్ | champions sahithi, haricharan | Sakshi
Sakshi News home page

చాంప్స్ సాహితి, హరిచరణ్

May 19 2014 12:12 AM | Updated on Sep 2 2017 7:31 AM

రాష్ట్రస్థాయి అండర్-11 చెస్ టోర్నమెంట్‌కు నగరం నుంచి సాహితి, హరిచరణ్ సాయి అర్హత సంపాదించారు. హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో సూపర్ కిడ్స్ చెస్ అకాడమీలో ఈ టోర్నీ జరిగింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి అండర్-11 చెస్ టోర్నమెంట్‌కు నగరం నుంచి సాహితి, హరిచరణ్ సాయి అర్హత సంపాదించారు. హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో సూపర్ కిడ్స్ చెస్ అకాడమీలో ఈ టోర్నీ జరిగింది. ఈ సెలక్షన్ టోర్నమెంట్ బాలికల విభాగంలో వి. సాహితి గెలుపొందగా, జి. సాహిత్య రన్నరప్‌గా నిలిచింది. బాలుర విభాగంలో హరిచరణ్ టైటిల్ సాధించగా, కె. తరుణ్ రెండో స్థానం పొందాడు. విభాగానికి ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీలో హైదరాబాద్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
 
 ప్రత్యేక ప్రైజ్‌మనీ ఈవెంట్ విజేతలు: బాలికలు: 1. త్రిష, 2. వైష్ణవి. 3. సంజన వర్మ, 4. హర్షిత, 5.పద్మప్రియా, 6.సాధ్వి, 7. సుసేన్ రెడ్డి; బాలురు: 1. సాయి సిద్ధార్థ, 2. హర్షిత్‌కృష్ణ, 3. అకిరా సౌమ్యనాథ్, 4. ప్రణవ్, 5. వరుణ్ గోపాల్, 6. రోహిత్, 7. ప్రణీత్ ఉప్పల.
 

Advertisement
 
Advertisement
Advertisement