breaking news
TV artiste
-
నిరుద్యోగికి కుచ్చుటోపీ పెట్టిన టీవీ ఆర్టిస్ట్
హైదరాబాద్ : టీవీ సీరియల్లో భాగస్వామిగా చేర్చుకుంటానంటూ ... ఓ నిరుద్యోగికి కుచ్చు టోపీ పెట్టాడో టీవీ ఆర్టిస్ట్. నటుడు కావాలని ప్రయత్నాల్లో ఉన్న హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన రాయుడు సత్యవర ప్రసాద్‌కు, టీవీ ఆర్టిస్ట్ బొప్పన విష్ణువర్ధన్ పరిచయమయ్యాడు. ప్రముఖ ఛానెల్లోని ఓ సీరియల్లో ఛాన్స్ వచ్చిందని, అందుకోసం అర్జెంట్‌గా ఐదు లక్షలు కావాలని, 45 రోజుల్లో తిరిగిచ్చేస్తానని ప్రసాద్‌కు చెప్పాడు. అంతే కాకుండా 40శాతం వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానన్నాడు. అయితే, గత జూన్‌లో డబ్బు తీసుకుని ఇప్పటివరకూ తిప్పుతున్నా .. పైసా కూడా తిరిగివ్వలేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైగా ఐపిఎస్ మాగంటి కాంతారావు తన మామయ్య అని, అతడికి చెబితే ఏదో ఒక పెండింగ్ కేసులో ఇరికిస్తాడని బెదిరిస్తునట్టు తెలిపాడు. ఈ విషయాన్ని ఐపిఎస్ కాంతారావు దృష్టికి తీసుకెళ్లగా .. తనకెవ్వరూ తెలిదయని చెప్పారు. దీంతో బాధితుడు తనకు న్యాయం చేయమని కోరుతున్నాడు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవీ ఆర్టిస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్‌లో అర్ధరాత్రి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మోతీనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లోవ్యభిచారం చేస్తుండగా... ఓ టీవీ ఆర్టిస్ట్‌ను పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దర్నీ అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన టీవీ ఆర్టిస్ట్ కుంకుమ పువ్వు సీరియల్లో నటిస్తున్న ఓ నటిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నారు. మరోవైపు వ్యభిచార నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.