ఇసుక లారీలు సీజ్
నిడదవోలు రూరల్: నిడదవోలు మండలంలోని పందలపర్రు ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పట్టుకుని సీజ్ చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై కె.నరేంద్ర తెలిపారు. ర్యాంపు వద్ద మంగళవారం అర్ధరాత్రి లారీల్లో ఇసుకను లోడ్ చేస్తుండగా పోలీస్ సిబ్బంది వీటిని స్వాధీనం చేసుకున్నారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.