breaking news
Transko officials
-
ఊరు నిండా చీకటి
- 718 పంచాయతీలలో వెలగని వీధి దీపాలు - బిల్లులు కట్టలేదంటూ సరఫరా నిలిపేసిన ట్రాన్స్‌కో - చెల్లించాల్సిన బకాయిలు రూ. 108 కోట్లు - ఆందోళన చెందుతున్న సర్పంచులు - చేతులెత్తేసిన విద్యుత్ అధికారులు మోర్తాడ్: వీధి దీపాలకు సంబంధిం చిన బకాయిల వసూలు కోసం ట్రాన్స్‌కో అధికారులు కొరడా ఝళిపించారు. బకాయిలు చెల్లిం చడం లేదనే కారణంతో గురువారం రాత్రి ఒక్కసారిగా జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల పరిధిలో వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో జిల్లా అంతటా గ్రామాలలో చీకట్లు నిండుకున్నాయి. జిల్లాలోని మేజర్ పంచాయతీలు రూ.51 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ. 57 కోట్ల బకాయిలు విద్యుత్ సంస్థకు చెల్లించాల్సి ఉంది. గతంలోనే వీటి వసూలు కోసం వి ద్యుత్ ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను నిలపివేశారు. ఎన్నికల సందర్భంలోనే వివిధ రాజకీయ పక్షాల విజ్ఞప్తి మేరకు ఒక్క రోజులోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అప్పట్లో రూ. 91 కోట్ల బకాయిలు పంచాయతీలు చెల్లిం చాల్సి ఉంది. ఎన్నికల తరువాత ప్రభుత్వం ద్వారా లేక పంచాయతీ నిధుల నుంచో విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని సర్పంచులు హమీ ఇవ్వడంతో సరఫరాను కొనసాగించారు. అయినా, బకాయిలు వసూలు కాకపోవడ ం, పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో అధికారులు విద్యు త్ సరఫరాను నిలిపివేశారు. గ్రామాల్లోని వీది దీపాలు వెలుగకపోవడంతో గ్రామాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో ఆం దోళన చెందిన సర్పంచులు అధికారులను ఫోన్లలో వాకబు చే యగా ఉన్నతాధికారుల ఆదేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే సమాధానం లభించింది. కఠిన నిర్ణయం తప్పలేదు గ్రామ పంచాయతీలు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. బకాయిలను చెల్లించాలని సర్పంచులకు పలుమార్లు నోటీసులు జారీ చేశాం. వారిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. నాలుగేళ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. బకాయిల వసూలు కోసం మాపై ఎంతో ఒత్తిడి ఉంది. -ప్రభాకర్, ట్రాన్స్‌కో ఎస్ఈ -
ట్రాన్స్‘ఫార్మర్ల’ కష్టాలు
- కాలిపోతున్నట్రాన్స్ఫార్మర్లు - స్పందించని అధికారులు - తరలించేందుకు కాడెడ్లుగా మారిన కర్షకులు మెదక్: ఓవైపు అనావృష్టి...మరోవైపు కరెంట్ కోతలతో సతమతమవుతున్న రైతన్నలకు కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు కన్నీళ్లు పెట్టిస్త్తున్నాయి. ఈ క్రమంలోనే పురిట్లో ఉన్న వరి పంటలను రక్షించుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లను వెంటనే మరమ్మతు చేయించాల్సిన ట్రాన్స్‌కో అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో రైతన్నలే చందాలు వేసుకొని ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయించేందుకు తరలిస్తున్నారు. కరువు కాలంలో కాసులు లేక...కాడెడ్ల బండి ఉన్నా..ఎడ్లులేక గత్యంతరం లేని పరిస్థితుల్లో శనివారం పాపన్నపేట మండలం డాక్యా తండాకు చెందిన గిరిజన రైతులు బండిని లాగుతూ పాపన్నపేట రిపేర్ సెంటర్‌కు ట్రాన్స్ఫార్మర్ను తరలించిన సంఘటన కర్షకుల కన్నీటి వెతలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. జిల్లాలో సుమారు 18 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ సెంటర్లుండగా, అందులో మండల కేంద్రమైన పాపన్నపేటలోని సెంటర్ కూడా ఒకటి. పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఇక్కడికే తీసుకొస్తుంటారు. అయితే ఏ ట్రాన్స్ఫార్మర్ కాలినా..వెంటనే ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించగానే ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి నిర్ధారణ చేసుకోవాలి. అనంతరం కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఫిర్యాదు నమోదు చేసుకొని సంబంధిత ఏఈ ట్రాన్స్పోర్ట్ నోట్(టీనోట్) ఇస్తారు. ఈ మేర కు డిపార్ట్మెంట్కు చెందిన వాహనంలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ సెంటర్‌కు తీసుకురావాలి. దాన్ని మరమ్మతు చేసిన అనంతరం తిరిగి డిపార్ట్మెంట్ వాహనంలోనే తీసుకొచ్చిన చోటుకు తరలించాలి. రిపేర్ అయినా కాకున్న 24 గంటల్లో రోలింగ్ ట్రాన్స్ఫార్మర్కు వినియోగదారులకు అందించాలి. ఈ మేరకు రైతుల నుంచి ఒక్కో సర్వీస్ కు రూ.30 చొప్పున సర్వీస్ టాక్స్కింద వసూలు చేస్తారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ప్రైవేట్ వాహనాలే దిక్కు ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్లు తరలించేందుకు ఒక వాహనం ఉంటుంది. కానీ అవి ఎప్పుడు అందుబాటులో ఉండక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ సొంత ఖర్చులతో ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేసుకొని రిపేర్ సెంటర్‌కు ట్రాన్స్ఫార్మర్ను తరలిస్తుంటారు. ఈ క్రమంలో రిపేర్ సెంటర్లో ట్రాన్స్ఫార్మర్ను అన్లోడ్, లోడ్ చేసేందుకు సుమారు రూ.600, ప్రైవేట్ వాహనంలో తరలించేందుకు సుమారు రూ.3 వేలు, పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్ విప్పి, బిగించడానికి సుమారు రూ.500 ఖర్చు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. తడిసిమోపెడవుతున్న ఖర్చులు లోవోల్టేజీ..అధిక లోడ్ తదితర కారణాల వల్ల ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయి. దీంతో మరమ్మతుల వ్యయం తడిసిమోపెడవుతుందని అన్నదాతలు వాపోతున్నారు. నెల రోజుల క్రితం ఎల్లాపూర్‌లో 63కే వీ ట్రాన్స్ఫార్మర్ అధికలోడుతో 15 రోజుల్లో ఆరుసార్లు కాలిపోయినట్లు రైతులు చె ప్పారు. అలాగే 2 నెలల క్రితం నాగ్సాన్పల్లిలో వారం రోజుల్లో ఓ ట్రాన్స్ఫార్మర్ నాలుగుసార్లు కాలిపోయిందని తెలిపారు. దీంతో వేలాది రూపాయలు ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాడెడ్లుగా మారిన కర్షకులు పాపన్నపేట మండలం అర్కెల గ్రామ పంచాయతీ పరిధిలోని డాక్యా తండాలో మూడు రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ సెంటర్‌కు తరలించడానికి డబ్బులు లేకపోవడం, కనీసం కాడెడ్లుగా లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో గిరిజన రైతులే ఎడ్లుగా మారి సుమారు 5 కిలో మీటర్ల దూరం ఎడ్లబండిపై కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను లాక్కొచ్చారు. తీరా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయిన తర్వాత ట్రాక్టర్ తీసుకొస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తామని ట్రాన్స్‌కో ఉద్యోగి మెలిక పెట్టడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. పనిభారంతోనే... సబ్‌డివిజన్‌లో పనిభారం వల్ల డిపార్ట్మెంట్ వాహనాన్ని రైతుల వద్దకు పంపలేక పోతున్నాం. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసం డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు అడిగితే నాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం -శేఖర్, ట్రాన్స్‌కో సబ్ ఇంజనీర్