breaking news
track repair work
-
ఒడిశా రైలు ప్రమాదం.. 51 గంటల్లోనే ట్రాక్ రెడీ..
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలుప్రమాదం స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెండు ట్రాక్‌ల పునరుద్ధరణ పూర్తయ్యింది. కేవలం 51 గంటల్లోనే.. ప్రమాదస్థలంలో ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తిచేసింది. ఒడిశా- పశ్చిమబెంగాల్ రూట్లో యధావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ట్రాక్ పునరుద్ధరణ తర్వాత వందేభారత్ రైలు ట్రయల్ రన్ చేపట్టారు. హౌరా-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అనుమతించారు. రద్దు చేసిన అన్ని రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నారు. కాగా దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదానికి మూలకారణాన్ని, ఈ ‘నేరపూరిత’ చర్యకు ప్రధాన కారకులను ఇప్పటికే గుర్తించినట్టు ఆదివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన కాసేపటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. ప్రమాదంలో మరణించిన వారి తుది సంఖ్యను . 275గా రైల్వే శాఖ ఆదివారం ప్రకటించింది. #WATCH | Howrah - Puri Vande Bharat Express crosses from Odisha’s Balasore where the deadly #TrainAccident took place on June 2. Indian Railways resumed train movement on the affected tracks within 51 hours of the accident. pic.twitter.com/myosAUgC4H — ANI (@ANI) June 5, 2023 -
నిడదవోలు రైల్వేగేటు మూసివేత
నిడదవోలు :ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన రాకపోకల కోసం ఏర్పాటుచేసిన నిడదవోలు రైల్వేగేటును శుక్రవారం అధికారులు మూసివేశారు. రైల్వే టెక్నికల్ ఇంజినీరింగ్ విభాగంకు చెందిన గ్యాంగ్ ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 22 వరకు వారం రోజుల పాటు గేటు మూసి ఉంటుంది. పోలీసులు వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు. రెండేళ్లకు ఒక్కసారి గేటు వద్ద ట్రాక్ మరమ్మతులు చేపడతారు. రైల్వేగేటు ఇరువైపులా తాత్కాలిక గేట్లను ఏర్పాటుచేసి హెచ్చరిక బోర్డులను ఉంచారు. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు గేటు మూసివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. బస్సులో ప్రయాణించేవారికి మాత్రం కాస్త ఉపశమనం ఉంది. ఇటు తాడేపల్లిగూడెం నుంచి అటు రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి బస్సులను ఆర్టీసీ గేటు వరకూ నడుపుతోంది. గేటు వద్ద ప్రయాణికులు బస్సు దిగి ఆవలివైపున ఉన్న మరో బస్సు ఎక్కుతున్నారు. అయితే తాత్కాలిక గేటులతో సహా మొత్తం నాలుగు గేట్ల కింద నుంచి వంగి ప్రయాణికులు ట్రాక్ దాటడానికి ఇబ్బందులెదుర్కొంటున్నారు. వద్ధులు, చంటి పిల్లల తల్లులు ఆపసోపాలు పడుతున్నారు. రైల్వే సిబ్బంది గేటు వద్దనే ఉండి ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకల సమాచారం అందిస్తూ ట్రాక్ దాటే ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. మోటారు సైకిల్ వంతెన దాటించేందుకు రూ. రైల్వేగేటు మూసివేయడంతో రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే కాలిబాట వంతెనపై విపరీతమైన ట్రాఫిక్ ఉంటోంది. తాడేపల్లిగూడెం, తాళ్లపాలెం, శెట్టిపేట, నందమూరు తదితర ప్రాంతాలకు వెళ్లడానికి మోటారు సైకిలిస్ట్‌లు కాలిబాట వంతెనను ఆశ్రయిస్తున్నారు. స్థానిక యువకులు ప్రయాణికుల వద్ద రూ.20 నుంచి రూ.30 వరకూ తీసుకుని మోటారు సైకిళ్లను వంతెన దాటిస్తున్నారు.