tower circle
-
స్మార్ట్ కరీంనగర్
టవర్‌సర్కిల్ : ఎన్టీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దేశంలోని వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి, ఆ దిశగా అడుగులేస్తోంది. గతేడాది జూలైలో కేంద్రం స్మార్ట్‌సిటీల సన్నాహక జాబితా విడుదల చేసింది. జాబితాలో తెలంగాణలోని ఐదు సిటీలుండగా అందులో కరీంనగర్ పేరును పొందుపరిచారు. అయితే తెలంగాణలోని రెండు సిటీలను మాత్రమే స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడి ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నగరానికి స్మార్ట్‌సిటీ హోదా తీసుకురావడం కోసం ప్రయత్నిస్తామని చెప్పడంతో నగర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్మార్ట్‌సిటీల జాబితాల్లో కరీంనగర్‌ను కూడా ఎంపిక చేశా రు. కరీంనగర్‌తోపాటు హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, ని జామాబాద్ కూడా స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కించుకున్నారుు. నిధుల వరద స్మార్ట్‌సిటీగా ఎంపికైతే నగరం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ప్రఖ్యాత నగరాలకు దీటుగా తీర్చిదిద్దుతారు. నగరం మొత్తం శాటిలైట్ అనుసంధానంగా, వైఫై నగరంగా మారుతుంది. ఇంటి పన్నులు రెండిం తలుగా పెరుగుతాయి. అన్ని రంగాల్లో నగరం అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇందుకోసం కేంద్రం నుం చి దశల వారీగా రూ.వెయ్యి కోట్ల వరకు నిధులు వస్తాయని తెలుస్తోంది. పారి శుధ్యం, రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినే జీ, నిరంతర నీటి సరఫరా వంటి మౌ లిక సదుపాయాలు మెరుగుపడతాయి. నెరవేరనున్న కల స్మార్ట్‌సిటీ హోదా దక్కుతుందనే నమ్మకంతోనే అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీని పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖత చూపించినట్లు తెలుస్తోంది. గతంలో మంజూరు చేసిన రూ.77 కోట్లకు మరో రూ.50 కోట్లు అదనంగా నిధులను మంజూరు చేసి యూజీడీని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. అందుకు తగ్గట్టుగానే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్అండ్బీ రోడ్ల పునర్నిర్మాణం కోసం రూ.46 కోట్ల నిధులను సీఎం మంజూరు చేశారు. ఇక స్మార్ట్‌సిటీ హోదా దక్కితే నగరం రూపురేఖలు మారనున్నాయి. స్మార్ట్ సిటీ హోదా విషయమై స్థానిక కార్పొరేషన్ అధికారులకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిసింది. -
నాణ్యతపై కన్నేయండి
టవర్‌సర్కిల్: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న పథకం మిషన్ కాకతీయ పథకంపై అందరిలోనూ భారీ అంచనాలున్నారుు. వేలాది చెరువుల పునరుద్ధరణతో పల్లెలు జలకళ సంతరించుకుని పచ్చదనం పరుచుకుంటాయని ఆశిస్తున్నారు. అరుుతే ఎక్కడా నిబంధనల మేరకు పకడ్బందీగా పనులు నిర్వహించినప్పుడే ఈ ఆశయం నెరవేరుతుంది. ఒకవేళ నాణ్యతలో రాజీ పడితే మాత్రం పది కాలాలు నిలవాల్సిన పనులు మూన్నాళ్ల ముచ్చట్టగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్లు బాధ్యతగా భావించి నాణ్యతతో పనులు చేయూల్సిన అవసరం ఎంతైనా ఉంది. అడ్డగోలు లెస్.. చెరువుల పునరుద్ధరణ టెండర్లలో కాంట్రాక్టర్లు అడ్డగోలు లెస్‌కు పనులు దక్కించుకుంటున్నారు. కాంట్రాక్టర్లు లెస్‌లు వేసేందుకు పోటీ పడుతున్న తీరు చూస్తుంటే పనుల నాణ్యతపై అనుమానాలు కలుగుతున్నారుు. జిల్లాలో టెండర్లు పూర్తరుున పలు చెరువులకు 18-30 శాతం వరకు లెస్‌కు కోట్ చేయడంతో కాంట్రాక్టర్ల తీరును శంకించాల్సి వస్తోంది. ఏ ఒక్క పనికి కూడా కనీసం ఎస్టిమేట్ రేట్లకు టెండర్లు వేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అధికారులే పేర్కొంటుండడం గమనార్హం. అడ్డగోలు లెస్‌లతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏవిధంగా పనులు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అన్ని చెరువులకు మార్చి 31లోపు టెండర్లు పూర్తిచేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అరుుతే కాంట్రాక్టర్లు భారీ లెస్తో టెండర్లు వేయడం చూస్తుంటే తర్వాత అగ్రిమెంట్ల సమయంలో వెనుకడుగు వేస్తారనే భయం అధికారులకు పట్టుకొంది. అదే జరిగితే టెండర్లు మరోమారు నిర్వహించాల్సిన పరిస్థితులు తలెత్తి మరింత ఆలస్యం కానుంది. మట్టి పనులే కదా అని... చెరువుల పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు ఎంత లెస్తో అరుునా టెండర్లు వేసేందుకు పోటీ పడుతున్నారు. చేసేది మట్టి పనులే కదా.. అధికారులను గుప్పిట్లో పెట్టుకుంటే సరిపోతుందిలే అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లు ఇప్పటివరకు టెండర్లు పూర్తయిన 76 పనుల్లో ఒక్క పనికి కూడా ఎక్కువ శాతానికి టెండర్లు వేయలేదు. గతంలో మాదిరిగా చెరువుల పునరుద్ధరణ పనులు ఇష్టానుసారంగా చేయడం కుదరదని పాలకులు, అధికారులు చెబుతున్నప్పటికీ కాంట్రాక్టర్ల తీరులో మార్పు రాకపోవడంతో అధికారులు నివ్వెరపోతున్నారు. ఇటీవల నిర్వహించిన టెండర్లలో 18-30 శాతం వరకు లెస్‌కు వేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. తప్పించుకోకుండా కొత్త నిబంధనలు పనులు పొందిన కాంట్రాక్టర్లు గతంలో బ్యాంకు గ్యారంటీ పెడితే సరిపోయేది. మిషన్ కాకతీయలో ఈ పద్ధతికి స్వస్తిపలికారు. అడ్డగోలు లెస్‌లకు టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్లు పనులను వదిలిపెట్టే అవకాశం లేకుండా నిబంధనలు విధించారు. లెస్‌లకు వెళ్లే కాంట్రాక్టర్లు మిగతా సొమ్ముకు 15 శాతం ఏఎస్డీ (అడ్వాన్స్ సెక్యూరిటీ డిపాజిట్) కింద డీడీ జతచేస్తేనే అగ్రిమెంట్ చేసే నిబంధనలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ఎక్కువ లెస్‌కు పోయే కాంట్రాక్టర్లు ముందుగానే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులు చేయకుంటే ఐదేళ్ల పాటు ఏ పనులు నిర్వహించకుండా సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీని బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు అధికారులకు ప్రభుత్వం అధికారాలు కట్టబెట్టింది. ఏఎస్డీ తప్పనిసరి కావడం, బ్లాక్‌లిస్టు భయం ఉండడంతో అగ్రిమెంట్ చేసుకోవడానికి కాంట్రాక్టర్లు జంకుతున్నారు. 2.68 లక్షల ఎకరాలకు సాగునీరు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలోని 5939 చెరువులను ఐదేళ్లలో పునరుద్ధరించనున్నారు. ప్రతి ఏడాది 20 శాతం చొప్పున అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జిల్లాలోని 1188 చెరువులను పునరుద్ధరించి 2.68 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 910 చెరువులకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో 440 చెరువులకు పరిపాలనా మంజూరు లభించింది. 262 చెరువులకు టెండర్లు పిలువగా, 76 చెరువులకు టెండర్లు పూర్తిచేసి, 33 మంది కాంట్రాక్టర్లకు పనుల కోసం అగ్రిమెంట్ చేశారు. -
మార్చి 3న చంద్రబాబు రాక
టవర్‌సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబ మార్చి 3న జిల్లాకు రానున్నారు. తెలంగాణలో పట్టుకోల్పోరుున పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయూ జిల్లాల్లో విస్తృతస్థారుు సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు టీటీడీపీ నేతలు కొద్దిరోజులుగా జిల్లాలోని నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించి జనసమీకరణకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కరీంనగర్ అంబేద్కర్‌స్టేడియంలో నిర్వహించే సభ కోసం నాయకులు ఎర్రబెల్లి దయూకర్‌రావు, ఎల్.రమణ, ఈ.పెద్దిరెడ్డి, సిహెచ్.విజయరమణారావు ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్‌ను నాయకులు ప్రకటించారు. మార్చి 3నఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో చంద్రబాబు రానున్నట్టు ఆయన తెలిపారు. 10 గంటలకు తిమ్మాపూర్ నుంచి మానకొండూర్ మీదుగా అంబేద్కర్‌స్టేడియం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జిల్లా ప్రతినిధులు మహాసభ, 3గంటల నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతినిధులు సభకు జిల్లాలోని పదివేలమంది ముఖ్య నేతలు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ ద్రోహులకు సీఎం పెద్దపీట : ఎర్రబెల్లి దయూకర్‌రావు సీఎం కేసీఆర్ ప్రజలను విస్మరిస్తూ.. పక్క పార్టీ నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని, ఆ పార్టీలో చేరేవారంతా తెలంగాణ ద్రోహులేనని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేకులకు టీఆర్ఎస్లో పెద్దపీట వేస్తుంటే ఉద్యమకారులు చూస్తూ ఎలా ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలంగాణకు బద్ధశత్రువులని, టీఆర్ఎస్లో మంత్రి పదవులకు అర్హులు లేనట్లు వారికి పదవులకు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పెడితే అఖిలపక్షం ఏర్పాటుచేసి చర్చించాలని, అన్యాయం జరిగితే అడిగేందుకు టీటీడీపీ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణను కరువు ప్రాంతంగా ప్రకటించేలా కేంద్రం పై ఒత్తిడి తెచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్లో మీడియాపై ఆంక్షలను టీడీపీ సహించదన్నారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలపై ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, కోదండరాం, గద్దర్, విమలక్క లాంటివారు ప్రశ్నించాలన్నారు. పూర్వ వైభవానికి కృషి : ఎల్.రమణ టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు పార్టీ కార్యకర్తలు సమాయత్తం కావాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. మానేరు గార్డెన్లో జరిగిన కరీంనగర్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు సమాలోచనలు జరిపి ఏకాభిప్రాయంతో పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే నియోజకవర్గ ఇన్చార్జీలను నియమిస్తామన్నారు. సమావేశంలో అన్నమనేని నర్సింగరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, గండ్ర నళిని, కళ్యాడపు ఆగయ్య, దామెర సత్యం, గాజ రమేశ్, తాజొద్దీన్, చెల్లోజి రాజు పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయ... నత్తనడక
టవర్‌సర్కిల్ : భూమిపై పడే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి... రైతులకు సాగునీటి కొరత తీర్చేందుకు... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పనులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. జిల్లాలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల డివిజన్ల పరిధిలో 5,939 చెరువులను ఐదేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. మొదటి సంవత్సరం 1,188 చెరువులు పునరుద్ధరించాలని నిర్ణయించి, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అన్ని చెరువులకు యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు పూర్తిచేయాలని ప్రభుత్వం ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించింది. నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ సర్వే పనుల్లో ఆలస్యంతో మిషన్ కాకతీయ మొదటి సంవత్సరం పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరో ఐదు నెలల్లో వర్షాకాలం రానుండగా పనుల్లో ఆలస్యం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. నత్తనడకన సర్వే డిసెంబర్లో ప్రారంభంమైన చెరువుల సర్వే, ప్రణాళిక రూపకల్పన వేగంగా జరగడం లేదు. నీటి పారుదలశాఖలో సిబ్బంది కొరతే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే ప్రణాళికలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినా సాధ్యం కాకపోవడంతో మార్చి నెలాఖరు వరకు గడువు పొడిగించారు. మూడు నెలల్లో ఇప్పటివరకు 781 చెరువులు గుర్తించి 590 చెరువులకు మాత్రమే ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడు నెలల్లో సగం చెరువులకు కూడా ప్రణాళికలు పూర్తికాకపోవడం, ఇంకా నెలా పది రోజుల గడువు మాత్రమే ఉండడంతో అధికారులు హైరానా పడుతున్నారు. 25 పనులకే టెండర్లు పూర్తి నిధులు మంజూరైన చెరువుల పునరుద్ధరణకు వెంటనే టెండర్లు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే 590 చెరువులకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించగా, 341 చెరువులకు నిధులు మంజూరు చేసింది. ఇందులో కేవలం 107 చెరువులకు మాత్రమే అధికారులు టెండర్లు పిలిచారు. ఇందులో 88 పనులకు టెండర్లు అప్లోడ్ చేసి 25 చెరువుల టెండర్లు పూర్తి చేశారు. ఎక్కడా పనులు ప్రారంభించకపోయినప్పటికీ 9 టెండర్లకు సంబంధించి వర్క్ ఆర్డర్లను కాంట్రాక్టర్లకు అందించారు. డిసెంబర్ 31న మొదటి దఫాలో 29 చెరువులకు రూ.13.46 కోట్లు మంజూరు కాగా ఆ తర్వాత దశల వారీగా 12 జీవోల ద్వారా ఇప్పటి వరకు 341 చెరువులకు రూ.120.27 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. నేడు మిషన్ కాకతీయపై సదస్సు మిషన్ కాకతీయ పనుల వేగం పెంచేందుకు, అధికారుల్లో నెలకొన్న స్తబ్ధత తొలగించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు గురువారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఎల్ఎండీలో నీటిపారుదల ఇంజినీరింగ్ ఉద్యోగులతో సదస్సు నిర్వహించనున్నారు. మిషన్ కాకతీయ లక్ష్యం, అధికారులు చేయాల్సిన పనులు, రైతులకు ఒనగూరే ప్రయోజనాలు తదితర అంశాలపై సదస్సులో మంత్రి వివరించనున్నారు. మంత్రి వస్తుండడంతో అధికారుల్లో హడావుడి మొదలైంది. ఇప్పటివరకు ప్రగతిపై సమీక్షించే అవకాశాలుండడంతో అధికారులు నివేదిక తయారీలో తలమునకలయ్యారు. -
పట్టు జారాక.. పటిష్టత కోసం..
టవర్‌సర్కిల్: జిల్లాలో ఒకప్పుడు పటిష్టంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమ పర్యసానంతో పూర్తిగా చతికిలపడింది. ఐదేళ్లలో పతనం చవిచూసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించడంతో అప్పటి వరకు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ద్వితీయ శ్రేణినాయకులు, కార్యకర్తలు డీలాపడిపోయారు. వారంతా తలోదిక్కు వెళ్లి వివిధ పార్టీల్లో చేరిపోయారు. ప్రస్తుతం జిల్లాలో జెండా మోసే వారు కరువయ్యారంటే పార్టీ పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. గతమెంతో ఘనం..: టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో జిల్లా ప్రజలు ఆ పార్టీకి అండగా నిలిచారు. 2009 ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరపున నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత పరిణామాలతో జిల్లాకు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య పార్టీని వీడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత టీ-టీడీపీ అధ్యక్షుడిగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎల్.రమణకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే జవసత్వాలు కోల్పోయిన టీడీపీ జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. 2014 ఎన్నికల్లో ఎల్.రమణ, జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు గెలుపు కోసం పార్టీ ప్రత్యేక దృష్టిపెట్టినా ప్రజలు తిరస్కరించడంతో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆ తర్వాత షరామామూలుగానే కేడర్ మొత్తం ఇతర పార్టీల్లోకి వలస వెళ్లింది. ముఖ్యమంత్రి హోదాలో..: తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారం చేజిక్కించుకున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 19న జిల్లా పర్యటనకు వస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ రోజు జిల్లా కేంద్రంలోనే ఉండి పార్టీ ఓటమికి కారణాలు, పార్టీ పటిష్టతకు చేపట్టవలసిన చర్యలపై పార్టీ శ్రేణులతో సమీక్షిస్తారని తెలిసింది. ఒకప్పుడు వెంకటస్వామి, జువ్వాడి చొక్కారావు వంటి రాజకీయ ఉద్దండులపై కొత్త వారిని పోటీలో నిలిపి మట్టికరిపించిన టీడీపీ ఇప్పుడు పూర్తిగా జవసత్వాలు కోల్పోయి సుప్తచేతనావస్థలో ఉంది. ఈ క్రమంలో చంద్రబాబునాయుడు పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నైరాశ్యంలో ఉన్న నాయకులకు భరోసా కల్పించేదెలా? పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహమేంటి? అనే అంశాలపై చంద్రబాబునాయుడు సమీక్షించనున్నట్లు తెలిసింది. -
షరతులు పెడితే మహోద్యమం
టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతున్న తరుణంలో... షరతులు పెడదామని ప్రయత్నిస్తే మహోద్యమం చేస్తామని టీఆర్ఎస్ శాసనసభపక్షనేత ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ హెచ్చరించారు. ఉద్యమాన్ని కీలక దశకు చేర్చిన కేసీఆర్ దీక్షకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గకేంద్రాల్లో శుక్రవారం దీక్షా దివస్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో చేపట్టిన దీక్షలకు ఈటెల, వినోద్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసం సబర్మతి ఆశ్రమం నుంచి దండియాత్రకు బయలుదేరితే, కేసీఆర్ ఉత్తర తెలంగాణభవన్ నుంచి దీక్షకు బయలుదేరారన్నారు. దీక్షకు దిగిన కేసీఆర్‌ను బలవంతంగా అరెస్టు చేస్తే తెలంగాణ యావత్తు అండగా నిలిచి రాష్ట్ర ప్రకటన వచ్చేవరకూ నిప్పు కణికై మండిందన్నారు. ప్రకటనను కాంగ్రెస్ పార్టీ మళ్లీ వెనక్కి తీసుకుని 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగాలకు కారణమైందని ఆరోపించారు. ఉద్యమాన్ని ఢిల్లీదాకా తీసుకెళ్లి, జాతీయపార్టీలను ఒప్పించి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేశామన్నారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగానే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అధికారదాహంతో తామే తెలంగాణ ఇచ్చామని ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్య మం, చరిత్రాత్మకమైన కేసీఆర్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. కాంగ్రెస్ చిత్తశుద్ధితో వ్యవహరించి శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ఆమోదించాలని డిమాం డ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ ఇవ్వాలని, పెత్తనం చేసేందుకు కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తే సీమాంధ్రులారా ఖబడ్దార్ అని హెచ్చరించారు. అసెంబ్లీలో యుద్ధమే : గంగుల తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అడ్డుకోవాలని చూస్తే తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తరిమికొట్టడమే కాక వీపులు పగులగొడతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఇందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఇందుకు మినహాయింపు కాదని, ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పారు. రాబోయే అసెంబ్లీ తెలంగాణ అంశంతో యుద్ధ వాతావరణంలో జరుగుతుందన్నారు. 1947లో గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం సాధిస్తే, 2013లో కేసీఆర్ తెలంగాణ సాధించడం ఖాయమని, కేసీఆర్ తెలంగాణ గాంధీగా కీర్తించబడతారని జోస్యం చెప్పారు. త్యాగాల పునాదుల మీదే తెలంగాణ : నారదాసు, ఈద తెలంగాణ బిడ్డల త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడుతోందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధించేవరకూ పిడికిలి బిగించి పోరాడాలని పేర్కొన్నారు. పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. కార్యక్రమం ఆసాంతం తెలంగాణ కళాకారుడు వెంకటస్వామి కళాబృందం ఆలపించిన ఉద్యమ గీతాలు, ధూంధాం సభికులను ఉర్రూతలూగించాయి. -
చర్చకు వచ్చే ధైర్యం లేక.. మొహం చాటేసిన ‘కొప్పుల’
టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్: బహిరంగ చర్చ కు పిలిచినప్పటికీ ధర్మపురి ఎమ్మెల్యే కొ ప్పుల ఈశ్వర్ రాకపోవడంతో తనపై చేసి న ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిం దని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి ల క్ష్మణ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆయన సవాలు చేసిన విధంగానే కరీంనగర్ చైతన్యపురిలోని మహాశక్తి ఆలయం వద్ద బహిరంగ చర్చకు వచ్చారు. దుర్గాదేవి దీక్షలో ఉండి కూడా కొప్పుల తనపై అసత్యపు ఆ రోపణలు చేశాడన్నారు. కేటీఆర్, నారదా సు లక్ష్మణ్‌రావు సమక్షంలో తెలంగాణ ఉ ద్యమంలో తాను పాల్గొనలేదని దుర్గామా త సమక్షంలో ప్రమాణం చేసినట్లయితే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీ నామా చేస్తానని సవాలు చేశారు. తాను చె ప్పిన ప్రకారం దుర్గామాత ఆలయానికి వ చ్చానని, ఎమ్మెల్యే కొప్పుల నిజాలు చెప్పే ధైర్యంలేక మొహం చాటేశారని ఆరోపిం చారు. ధర్మపురి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరవుతున్నానని ఓర్వలేకనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ వివేక్‌కు కిరాయిదూతగా మారిన ఈశ్వర్ తనపై ఆరోణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
దసరా ధమాకా
జిల్లాకు పండగ కళ వచ్చేసింది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా పండగ వాతావరణం సంతరించుకొంది. తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పండగలైన సద్దుల బతుకమ్మ, దసరాకు పది రోజుల ముందు నుంచే కొనుగోళ్ల సందడి మొదలైంది. ఈ రెండు పండగలకు తెలుగు పండగల్లో మరే పండగలకూ లేనంత జోష్ ఉంటుంది. మహిళలు బతుకమ్మ కోసం పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు ప్రత్యేకంగా భావిస్తారు. పేద, గొప్ప తేడా లేకుండా అందరూ దసరా పండగకు కొత్త బట్టలు కొనుక్కొని ధరించడం సాంప్రదాయం. సంవత్సరంలో ఎన్నో పండగలు వస్తూ పోతూ ఉన్నా బతుకమ్మ, దసరా పండగలకే పెద్ద క్రేజ్. దీనికితోడు కార్మికులకు, ఉద్యోగులకు పండగ అడ్వాన్సులు ఇస్తుండడంతో కొనుగోల్లు జోరందుకున్నాయి. - న్యూస్‌లైన్, టవర్‌సర్కిల్ టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : పండగ వచ్చిందంటే ప్రత్యేకంగా కనబడాలనే ఆరాటం ఖరీదైన వస్తువుల కొనుగోళ్లవైపు నడిపిస్తోంది. బట్టలు, గాజులు, కాస్మెటిక్స్, మ్యాచింగ్ సెంటర్లలో కొనుగోలు కోసం వచ్చిపోయే మహిళలతో వ్యాపార కూడళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఆలస్యమైతే మంచి డిజైన్లు దొరకవనే ఉద్దేశంతో ఎవరి శక్తిమేరకు వారు ముందుగానే కొనుగోళ్లు చేస్తున్నారు. పల్లెల నుంచి కొనుగోళ్లకు వచ్చే వారే ముందు వరుసలో ఉంటున్నారు. కూలీనాలీ చేసుకునేవారు సైతం పిల్లలకు పండగ బట్టలు కొనుగోలు చేసేందుకు అప్పుచేయడానికి కూడా వెనుకాడడం లేదు. మిగతా రోజుల్లో ఎప్పుడూ లేనంతగా గిరాకీ ఉండడంతో దుకాణదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిజైన్లు చూపించలేక సతమతమవుతున్నారు. టైలరింగ్ షాపుల్లోనూ బిజీ నెలకొంది. వారం ముందే ఇక బట్టలు కుట్టడం వీలుకాదని చెప్పే పరిస్థితి నెలకొంది. బట్టలదే అగ్రస్థానం... బతుకమ్మ, దసరా పండగలంటే బట్టలదే అగ్రస్థానం. ప్రతి వ్యక్తి పండగలకు కొత్త బట్టలు కొ నుగోలు చేస్తుంటారు. బట్టల కొనుగోళ్లలో మహిళలే ముందుటున్నారు. దుకాణాలు సైతం ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. పెద్దపెద్ద మాల్స్ వచ్చాక ఫిక్స్డ్ రేట్లకు అలవాటుపడ్డ ప్రజలు, దానిపై ఇచ్చే డిస్కౌంట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఎవరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే వారి వద్దే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నా రు. పజల ఆసక్తిని గమనించి వ్యాపారులు పోటీపోటీగా రేట్లను ప్రదర్శన పెట్టి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. చిన్న దుకాణాలు సైతం మాల్స్‌తో పోటీపడి విక్రయాలు జరుపుతున్నాయి. రేడీమేడ్ వస్త్ర వ్యాపారం బాగా పుంజు కుంది. బట్ట కొనుగోలుచేసి దానిని కుట్టించడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. రెడీమేడ్ షాపులు సైతం అందరికి అందుబాటు ధరలలో వస్త్రాలను తీసుకువచ్చాయి. ముఖ్యంగా కిడ్స్, మెన్స్వేర్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ముంబయి, కోల్‌కతా, సూరత్, హైదరాబాద్ వంటి నగరాల నుంచి స్టాక్ తెప్పిస్తున్నారు. గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి బట్టలు కొనుగోలు చేసేవారు సైతం ఇప్పుడు అన్ని బ్రాండెడ్ షోరూంలు అందుబాటులోకి రావడంతో ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. రూ.వెయ్యి కోట్ల పైనే.. బతుకమ్మ, దసరా పండగలకు కొత్త బట్టలు, వాటి మ్యాచింగ్, గాజులు, కాస్మెటిక్స్, చెప్పుల కోసం జిల్లా ప్రజలు చేసే ఖర్చు రూ.వెయ్యికోట్ల వరకు ఉంటుందని అంచనా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. పండగ సీజన్లో ఒక్క బట్టలపైనే రూ.800 కోట్లకు పైగా విక్రయాలు జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బట్టలకు తోడు మ్యాచింగ్‌లు, గాజులు, చెప్పులు, కాస్మెటిక్స్ చాలా ఖరీరయ్యాయి. మిగతావి అన్నీ కలిసి రూ.200 కోట్లపైనే వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నలుగురిలో చిన్నతనంగా కనబడకూడదనే తపనతో ఇంటిల్లిపాది మంచి బట్టలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేస్తే సంవత్సరాంతం కూడబెట్టిన డబ్బులన్నీ దసరా పండగకే ఖర్చవుతున్నాయని సామాన్యులు వాపోతున్నారు.