ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబ మార్చి 3న జిల్లాకు రానున్నారు. తెలంగాణలో పట్టుకోల్పోరుున పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారు.
టవర్‌సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబ మార్చి 3న జిల్లాకు రానున్నారు. తెలంగాణలో పట్టుకోల్పోరుున పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయూ జిల్లాల్లో విస్తృతస్థారుు సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు టీటీడీపీ నేతలు కొద్దిరోజులుగా జిల్లాలోని నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించి జనసమీకరణకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కరీంనగర్ అంబేద్కర్‌స్టేడియంలో నిర్వహించే సభ కోసం నాయకులు ఎర్రబెల్లి దయూకర్‌రావు, ఎల్.రమణ, ఈ.పెద్దిరెడ్డి, సిహెచ్.విజయరమణారావు ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు.
చంద్రబాబు జిల్లా పర్యటన షెడ్యూల్‌ను నాయకులు ప్రకటించారు. మార్చి 3నఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో చంద్రబాబు రానున్నట్టు ఆయన తెలిపారు. 10 గంటలకు తిమ్మాపూర్ నుంచి మానకొండూర్ మీదుగా అంబేద్కర్‌స్టేడియం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జిల్లా ప్రతినిధులు మహాసభ, 3గంటల నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతినిధులు సభకు జిల్లాలోని పదివేలమంది ముఖ్య నేతలు హాజరవుతారని తెలిపారు.
తెలంగాణ ద్రోహులకు సీఎం పెద్దపీట :
ఎర్రబెల్లి దయూకర్‌రావు
సీఎం కేసీఆర్ ప్రజలను విస్మరిస్తూ.. పక్క పార్టీ నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని, ఆ పార్టీలో చేరేవారంతా తెలంగాణ ద్రోహులేనని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేకులకు టీఆర్‌ఎస్‌లో పెద్దపీట వేస్తుంటే ఉద్యమకారులు చూస్తూ ఎలా ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలంగాణకు బద్ధశత్రువులని, టీఆర్‌ఎస్‌లో మంత్రి పదవులకు అర్హులు లేనట్లు వారికి పదవులకు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పెడితే అఖిలపక్షం ఏర్పాటుచేసి చర్చించాలని, అన్యాయం జరిగితే అడిగేందుకు టీటీడీపీ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణను కరువు ప్రాంతంగా ప్రకటించేలా కేంద్రం పై ఒత్తిడి తెచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్‌లో మీడియాపై ఆంక్షలను టీడీపీ సహించదన్నారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలపై ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, కోదండరాం, గద్దర్, విమలక్క లాంటివారు ప్రశ్నించాలన్నారు.
పూర్వ వైభవానికి కృషి : ఎల్.రమణ
టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు పార్టీ కార్యకర్తలు సమాయత్తం కావాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. మానేరు గార్డెన్‌లో జరిగిన కరీంనగర్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు సమాలోచనలు జరిపి ఏకాభిప్రాయంతో పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే నియోజకవర్గ ఇన్‌చార్జీలను నియమిస్తామన్నారు. సమావేశంలో అన్నమనేని నర్సింగరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, గండ్ర నళిని, కళ్యాడపు ఆగయ్య, దామెర సత్యం, గాజ రమేశ్, తాజొద్దీన్, చెల్లోజి రాజు పాల్గొన్నారు.