బహిరంగ చర్చ కు పిలిచినప్పటికీ ధర్మపురి ఎమ్మెల్యే కొ ప్పుల ఈశ్వర్ రాకపోవడంతో తనపై చేసి న ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిం దని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి ల క్ష్మణ్‌కుమార్ అన్నారు.
టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్: బహిరంగ చర్చ కు పిలిచినప్పటికీ ధర్మపురి ఎమ్మెల్యే కొ ప్పుల ఈశ్వర్ రాకపోవడంతో తనపై చేసి న ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిం దని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి ల క్ష్మణ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆయన సవాలు చేసిన విధంగానే కరీంనగర్ చైతన్యపురిలోని మహాశక్తి ఆలయం వద్ద బహిరంగ చర్చకు వచ్చారు. దుర్గాదేవి దీక్షలో ఉండి కూడా కొప్పుల తనపై అసత్యపు ఆ రోపణలు చేశాడన్నారు.
కేటీఆర్, నారదా సు లక్ష్మణ్‌రావు సమక్షంలో తెలంగాణ ఉ ద్యమంలో తాను పాల్గొనలేదని దుర్గామా త సమక్షంలో ప్రమాణం చేసినట్లయితే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీ నామా చేస్తానని సవాలు చేశారు. తాను చె ప్పిన ప్రకారం దుర్గామాత ఆలయానికి వ చ్చానని, ఎమ్మెల్యే కొప్పుల నిజాలు చెప్పే ధైర్యంలేక మొహం చాటేశారని ఆరోపిం చారు. ధర్మపురి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరవుతున్నానని ఓర్వలేకనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ వివేక్‌కు కిరాయిదూతగా మారిన ఈశ్వర్ తనపై ఆరోణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.