రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న పథకం మిషన్ కాకతీయ పథకంపై అందరిలోనూ భారీ అంచనాలున్నారుు.
టవర్‌సర్కిల్: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న పథకం మిషన్ కాకతీయ పథకంపై అందరిలోనూ భారీ అంచనాలున్నారుు. వేలాది చెరువుల పునరుద్ధరణతో పల్లెలు జలకళ సంతరించుకుని పచ్చదనం పరుచుకుంటాయని ఆశిస్తున్నారు. అరుుతే ఎక్కడా నిబంధనల మేరకు పకడ్బందీగా పనులు నిర్వహించినప్పుడే ఈ ఆశయం నెరవేరుతుంది. ఒకవేళ నాణ్యతలో రాజీ పడితే మాత్రం పది కాలాలు నిలవాల్సిన పనులు మూన్నాళ్ల ముచ్చట్టగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్లు బాధ్యతగా భావించి నాణ్యతతో పనులు చేయూల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అడ్డగోలు లెస్..
చెరువుల పునరుద్ధరణ టెండర్లలో కాంట్రాక్టర్లు అడ్డగోలు లెస్‌కు పనులు దక్కించుకుంటున్నారు. కాంట్రాక్టర్లు లెస్‌లు వేసేందుకు పోటీ పడుతున్న తీరు చూస్తుంటే పనుల నాణ్యతపై అనుమానాలు కలుగుతున్నారుు. జిల్లాలో టెండర్లు పూర్తరుున పలు చెరువులకు 18-30 శాతం వరకు లెస్‌కు కోట్ చేయడంతో కాంట్రాక్టర్ల తీరును శంకించాల్సి వస్తోంది. ఏ ఒక్క పనికి కూడా కనీసం ఎస్టిమేట్ రేట్లకు టెండర్లు వేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అధికారులే పేర్కొంటుండడం గమనార్హం. అడ్డగోలు లెస్‌లతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏవిధంగా పనులు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అన్ని చెరువులకు మార్చి 31లోపు టెండర్లు పూర్తిచేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అరుుతే కాంట్రాక్టర్లు భారీ లెస్‌తో టెండర్లు వేయడం చూస్తుంటే తర్వాత అగ్రిమెంట్ల సమయంలో వెనుకడుగు వేస్తారనే భయం అధికారులకు పట్టుకొంది. అదే జరిగితే టెండర్లు మరోమారు నిర్వహించాల్సిన పరిస్థితులు తలెత్తి మరింత ఆలస్యం కానుంది.
మట్టి పనులే కదా అని...
చెరువుల పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు ఎంత లెస్‌తో అరుునా టెండర్లు వేసేందుకు పోటీ పడుతున్నారు. చేసేది మట్టి పనులే కదా.. అధికారులను గుప్పిట్లో పెట్టుకుంటే సరిపోతుందిలే అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లు ఇప్పటివరకు టెండర్లు పూర్తయిన 76 పనుల్లో ఒక్క పనికి కూడా ఎక్కువ శాతానికి టెండర్లు వేయలేదు. గతంలో మాదిరిగా చెరువుల పునరుద్ధరణ పనులు ఇష్టానుసారంగా చేయడం కుదరదని పాలకులు, అధికారులు చెబుతున్నప్పటికీ కాంట్రాక్టర్ల తీరులో మార్పు రాకపోవడంతో అధికారులు నివ్వెరపోతున్నారు. ఇటీవల నిర్వహించిన టెండర్లలో 18-30 శాతం వరకు లెస్‌కు వేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
తప్పించుకోకుండా కొత్త నిబంధనలు
పనులు పొందిన కాంట్రాక్టర్లు గతంలో బ్యాంకు గ్యారంటీ పెడితే సరిపోయేది. మిషన్ కాకతీయలో ఈ పద్ధతికి స్వస్తిపలికారు. అడ్డగోలు లెస్‌లకు టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్లు పనులను వదిలిపెట్టే అవకాశం లేకుండా నిబంధనలు విధించారు. లెస్‌లకు వెళ్లే కాంట్రాక్టర్లు మిగతా సొమ్ముకు 15 శాతం ఏఎస్‌డీ (అడ్వాన్స్ సెక్యూరిటీ డిపాజిట్) కింద డీడీ జతచేస్తేనే అగ్రిమెంట్ చేసే నిబంధనలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ఎక్కువ లెస్‌కు పోయే కాంట్రాక్టర్లు ముందుగానే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులు చేయకుంటే ఐదేళ్ల పాటు ఏ పనులు నిర్వహించకుండా సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీని బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు అధికారులకు ప్రభుత్వం అధికారాలు కట్టబెట్టింది. ఏఎస్‌డీ తప్పనిసరి కావడం, బ్లాక్‌లిస్టు భయం ఉండడంతో అగ్రిమెంట్ చేసుకోవడానికి కాంట్రాక్టర్లు జంకుతున్నారు.
2.68 లక్షల ఎకరాలకు సాగునీరు
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలోని 5939 చెరువులను ఐదేళ్లలో పునరుద్ధరించనున్నారు. ప్రతి ఏడాది 20 శాతం చొప్పున అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జిల్లాలోని 1188 చెరువులను పునరుద్ధరించి 2.68 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 910 చెరువులకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో 440 చెరువులకు పరిపాలనా మంజూరు లభించింది. 262 చెరువులకు టెండర్లు పిలువగా, 76 చెరువులకు టెండర్లు పూర్తిచేసి, 33 మంది కాంట్రాక్టర్లకు పనుల కోసం అగ్రిమెంట్ చేశారు.