breaking news
tongue twister
-
సితు పాపను ఓడిస్తూ తాను ఓడిపోతూ
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ కొంచెం వీలు దొరికినా తన పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఆటపాటలతో తెగ ఆల్లరి చేస్తుంటారు. ఇక కరోనా లాక్డౌన్ సమయంలో దొరికిన అనూహ్య సమయాన్ని పూర్తిగా కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. మహేశ్-గౌతమ్-సితారలకు అల్లరికి సంబంధించిన ఫోటో, వీడియోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా మహేశ్-సితారలు టంగ్ ట్విస్టర్ గేమ్ ఆడుతన్న ఓ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. (మా నాన్న మాకు మంచి ఫ్రెండ్) ఇక ఈ వీడియోలో టంగ్ ట్విస్టర్ గేమ్‌లో తను గెలిచినట్లు తండ్రితో సితార వాదన చేస్తుండటం చూడవచ్చు. ఇక ఈ గేమ్‌లో ఓడిస్తూ, ఓడిపోతూ సితు పాపతో మహేశ్ సరదాగా ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తీ సురేష్ కన్ఫార్మ్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తాను మహేశ్‌బాబు సినిమాలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు కీర్తీ సురేష్. (‘మా నాన్న నవ్వు.. మా బిడ్డ చిరునవ్వు’) -
పొడుపు పద్యాలు
తెలుగు పద్యాల్లో టంగ్ ట్విస్టర్లే కాదు, చమత్కారభరితమైన పొడుపు కథలూ ఉన్నాయి. బుర్రకు పదును పెట్టే చమత్కారానికి మచ్చుగా కొన్ని పద్యాలు... ఇంటికిని వింటికిని ప్రాణమేది చెపుమ కంట మింటను మనమేమి కాంచగలము? నవ్వు పువ్వు దేనిని గూడి పొలుపుగాంచు ఒకటె రెండేసి ప్రశ్నల కుత్తరంబు ♦ ఇంటికి ప్రాణం ఏది? వింటికి ప్రాణం ఏది? అనే రెండు ప్రశ్నలు ఉన్నాయి మొదటి పాదంలో. రెండింటికీ ఒకటే సమాధానం- నారి. ఇంటికి ప్రాణం ఇల్లాలు (నారి), విల్లుకు ఆధారం అల్లెతాడు (నారి). ♦ కంటిలో దేనిని చూస్తాం? మింటిలో (ఆకాశంలో) దేనిని చూస్తాం? అనే రెండు ప్రశ్నలు రెండో పాదంలో ఉన్నాయి. ఈ రెండింటికీ ఒకటే సమాధానం-తారలు. తారలు అంటే నక్షత్రాలనే అర్థంతో పాటు కనుపాపలనే అర్థం కూడా ఉంది. ♦ నవ్వు దేనితో కలిసి మనోహరంగా ఉంటుంది? పువ్వు దేనితో కలిసి మనోహరంగా ఉంటుంది? అనే రెండు ప్రశ్నలు మూడో పాదంలో ఉన్నాయి. సమాధానం ఒక్కటే-వలపు. వలపు పండినప్పుడే నవ్వులూ పువ్వులూ రాణిస్తాయని కవిహృదయం. ఒడల నిండ కన్నులుండు నింద్రుడు కాడు కంఠమందు నలుపు! కాడు శివుడు! ఫణుల బట్టి చంపు పక్షీంద్రుడా? కాదు దీని భావమేమి తెలిసికొనుడు ఒళ్లంతా కళ్లుంటాయి గాని ఇంద్రుడు కాడట. మెడ నల్లగా ఉంటుంది గాని శివుడు కాడట. పాములను పట్టి చంపగలిగినా గరుత్మంతుడు కూడా కాడట. ఇదీ పొడుపు కథ. దీనికి సమాధానం ఏమిటంటారా? నెమలి. కరయుగంబు గలదు చరణంబులా లేవు కడుపు, నడుము, వీపు, మెడయు గలవు శిరము లేదు గాని నరుల బట్టుక మ్రింగి సొగసు గూర్చు దీని సొగసు గనుడి చేతులు ఉన్నాయి కాని కాళ్లు లేవు. కడుపు, నడుము, వీపు, మెడ ఉన్నాయి. తల లేదు. ఇలాంటిది ఏకంగా మనిషిని మింగేసి, సొగసునిస్తుందట? ఇదేమిటంటారా? చొక్కా. వండగ నెండిన దొక్కటి వండక మరి పచ్చిదొకటి వడికాలినదిన్ తిండికి రుచియై యుండును ఖండితముగ దీని దెల్పు కవియుం గలడే! వంటలో ఉడికించగా ఎండినది (కాచు), వండకుండా పచ్చిగా ఉన్నది (తమలపాకు), బాగా కాలినది (సున్నం). ఈ మూడు కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అదేమిటో అర్థమైంది కదా! ఆకు, వక్క, సున్నం, కాచు కలిపి చుట్టిన కిళ్లీ తింటే రుచిగా ఉండదూ మరి!