breaking news
Tirupati by -election
-
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. లోకేష్‌కు కాకాణి సవాల్
-
నిరూపిస్తే రాజీనామా చేస్తా.. లోకేష్‌కు కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పడిపోవడానికి టీడీపీ నేతలే కారణమని వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. క్యూలో ఓటర్లను కూడా టీడీపీ నేతలు భయబ్రాంతులకు గురిచేశారని అన్నారు. దొంగ ఓట్లంటూ టీడీపీ, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వద్ద ఎప్పుడూ మూడు స్క్రిప్ట్‌లు రెడీగా ఉంటాయన్నారు. పరిస్థితిని బట్టి వాటిని ప్రజలపై రుద్దడం వాళ్లకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో మత్స్యకారులకు రూ.43 కోట్ల ప్యాకేజీ ఇచ్చామని లోకేష్ చెప్పారు. అదంతా నిజం కాదు.. ఒక వేళ ఈ విషయాన్ని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానని కాకాణి.. లోకేష్‌కు సవాల్ విసిరారు. ( చదవండి: రాళ్లదాడి పేరుతో చంద్రబాబు సానుభూతి డ్రామా ) -
‘దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు’
సాక్షి, తిరుపతి: పోలింగ్‌పై టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందన్నారు. ప్రజా బలం లేకే టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్సీపీపై అభాండాలు వేస్తున్నారు. టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఓటమి భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని’’ పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఓటమికి చంద్రబాబు కారణాలు వెతుక్కుంటున్నారని.. ఇకనైనా ఆయన తన తప్పులు తెలుసుకుంటే ప్రజల్లో ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు. చదవండి: ‘సాహో చంద్రబాబు’పై చర్యలు తీసుకోండి విష నాలుకలు.. నీచ నాయకులు... -
తిరుపతి ప్రచారం లో టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి
-
సీఎంకు సవాల్ విసిరే స్థాయి లోకేష్‌కు లేదు
తిరుపతి: నిన్న అలిపిరిలో మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు మండిపడ్డారు. నారా లోకేష్‌కు సంస్కారం లేదని, బుర్ర తక్కువ పనులు, పిచ్చి చేష్టలుగా పరిగణించాలని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి.. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యముంత్రి అయిన వైఎస్ జగనమోహన్రెడ్డికి సవాల్ విసిరే స్థాయి లేదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ప్రమాణం చేస్తావా అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగలేదని మీరు ప్రమాణం చేయగలరా?.. పుష్కరాల్లో 29 మంది మృతికి కారణం చంద్రబాబు కాదని ప్రమాణం చేయగలరా? అంటూ లోకేష్‌ని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారణ చేస్తోందని చెప్పారు. ఇదే కాక, ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. లోకేష్‌కు, సీఎం జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, అది తెలుసుకుని నడుచుకోవాలని హితవు పలికారు. గడిచిన ఎన్నికల్లో టీడీపీని ప్రజలే పీకి పాడేశారు. ఇక ప్రస్తుతం టీడీపీ పనైపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే అన్నారన్నారు. ( చదవండి: మీ శ్రేయస్సు దృష్ట్యా సభకు రాలేకపోతున్నా: సీఎం జగన్ ) -
ఏకగ్రీవం కోసం పాట్లు
ఎన్నికల హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి పార్టీ కేడర్‌లో అసంతృప్తి కాంగ్రెస్ మాటల యుద్ధం తెలుగుదేశం అధినాయకత్వంలో ఆందోళన తిరుపతి: ఉప ఎన్నికను ఎలాగైనా ఏకగ్రీవం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ తంటాలు పడుతోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో ఆందోళనకు గురవుతోంది. మరోవైపు పార్టీ అభ్యర్థిపై కేడర్‌లో అసంతృప్తి గుబులు. దీంతో ఏకగ్రీవం వైపే ఆలోచి స్తోంది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థి సుగుణమ్మ బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలను సైతం అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అగ్రనేతలు పైకి నటిస్తూన్నారే తప్ప చిత్తశుద్ధితో పనిచేయలేదని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు, అభ్యర్థి అల్లుడు సంజయ్ సైతం ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే జన్మభూమి కమిటీల్లో పూర్తిగా కాంగ్రెస్ నుంచి తన వెంట వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం.. పూర్వం నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్న వారి అసంతృప్తికి కారణమైనట్లుగా పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయాలని ఇప్పటికే కొంతమంది నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా మద్యం షాపులు, రిక్రియేషన్ క్లబ్‌లను సైతం వదలకుండా ముఖ్యనేత మాముళ్లు వసూలు చేస్తున్నారని ఆ ప్రభావం ఎన్నికల్లో అభ్యర్థి విజయావకాశాలపై పడుతోందేమోననే భయం స్పష్టంగా కనిపిస్తోంది. కార్పొరేషన్లో ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగుల బదిలీలు, పనుల కేటాయింపుల్లో సైతం అభ్యర్థి బంధువు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిణామాలతో గడచిన ఏడు నెలల్లోనే పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చాలామంది కార్యకర్తలు పార్టీ అభ్యర్థికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో కీలక నేతలు చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి వంటి సీనియర్ నేతలు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మాటల యుద్ధం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్, ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి, దేశం అభ్యర్థిపై మాటల యుద్ధానికి దిగారు. ముఖ్యంగా చింతామోహన్ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ఏమైనా మహనీయులా? పొట్టిశ్రీరాములా? ప్రకాశం పంతులా? అల్లూరి సీతారామరాజా?.. కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని 500 కోట్లు సంపాదించారు. ’’ అంటూ వ్యాఖ్యానించడం టీడీపీ నాయకులను ఇరుకున పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా రాజధాని విషయంలో అన్యాయం చేశారంటూ విమర్శిస్తున్నారు. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది. శాప్ చైర్మన్‌గా పీఆర్ మోహన్? శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తికి చెందిన తెలుగుదేశం నాయకుడు పీఆర్‌మోహన్ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్‌గా నియమితులైనట్లు తెలిసింది. చైర్మన్‌తో పాటు మరో ఆరుగురిని కమిటీ సభ్యులుగా నియమించడానికి ఎంపిక చేసినట్లు తెలిసింది. వారిలో సభ్యులుగా వెయిట్‌లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరితో పాటు మరో ఐదుగురిని నియమించినట్లు సమాచారం. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా పీఆర్ మోహన్ శాప్ చైర్మన్‌గా పనిచేశారు. ఏకగ్రీవం కోసం పాట్లు అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయాలని ఇప్పటికే కొంతమంది నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా మద్యం షాపులు, రిక్రియేషన్ క్లబ్‌లను సైతం వదలకుండా ముఖ్యనేత మాముళ్లు వసూలు చేస్తున్నారని ఆ ప్రభావం ఎన్నికల్లో అభ్యర్థి విజయావకాశాలపై పడుతోందేమోననే భయం స్పష్టంగా కనిపిస్తోంది. కార్పొరేషన్లో ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగుల బదిలీలు, పనుల కేటాయింపుల సైతం అభ్యర్థి బంధువు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిమాణాలతో గడచిన ఏడు నెలల్లోనే పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చాలామంది కార్యకర్తలు పార్టీ అభ్యర్థికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో కీలక నేతలు చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి వంటి సీనియర్ నేతలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మాటల యుద్ధం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్, ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి, దేశం అభ్యర్థిపై మాటల యుద్ధానికి దిగారు. ముఖ్యంగా చింతామోహన్ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ఏమైనా మహనీయులా? పొట్టిశ్రీరాములా? ప్రకాశం పంతులా? అల్లూరి సీతారామరాజా?.. కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని 500 కోట్లు సంపాదించారు. ’’ అంటూ వ్యాఖ్యానించడం టీడీపీ నాయకులను ఇరుకున పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా రాజధాని విషయంలో అన్యాయం చేశారంటూ విమర్శిస్తున్నారు. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది.