‘దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు’ | Minister Peddireddy Ramachandra Reddy Fires On TDP | Sakshi
Sakshi News home page

పోలింగ్‌పై టీడీపీ అబద్ధాలు ప్రచారం..

Apr 17 2021 12:29 PM | Updated on Apr 17 2021 2:54 PM

Minister Peddireddy Ramachandra Reddy Fires On TDP - Sakshi

బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు.

సాక్షి, తిరుపతి: పోలింగ్‌పై టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందన్నారు. ప్రజా బలం లేకే టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్‌సీపీపై అభాండాలు వేస్తున్నారు. టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఓటమి భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని’’ పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఓటమికి చంద్రబాబు కారణాలు వెతుక్కుంటున్నారని.. ఇకనైనా ఆయన తన తప్పులు తెలుసుకుంటే ప్రజల్లో ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు.
చదవండి:
‘సాహో చంద్రబాబు’పై చర్యలు తీసుకోండి
విష నాలుకలు.. నీచ నాయకులు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement