breaking news
Tiruchanuru temple
-
అమ్మవారి సేవలో ఖడ్గం హీరోయిన్.. !
సినీనటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే సంగీత హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైంది. చివరగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన సంగీత ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాదిలోనే మసూద చిత్రంతో పలకరించింది. అయితే తాజాగా సినీనటి సంగీత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సంగీత గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు. అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా.. అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్
-
బంగారు నాగపడగ సమర్పించిన విజయ సాయి రెడ్డి, చెవిరెడ్డి
-
తిరుచానూరు ఆలయంలో నెయ్యి గోల్మాల్!
తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నెయ్యి గోల్మాల్ వ్యవహారం బుధవారం వెలుగుచూసింది. 110 డబ్బాల నెయ్యి మాయమైనట్టు తెలుస్తోంది. నెయ్యి విలువ రూ. 10లక్షల విలువ పైనా ఉంటుందని అంచనా. అయితే ఈ విషయంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్, ఆలయ స్టోర్ సిబ్బంది అస్తమున్నట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల నుంచి టీటీడీలో ఈ తరహా అక్రమాలు చోటుచేసుకున్నట్టు సమాచారం. దీనిపై టీటీడీ విజిలెన్స్ అంతర్గత విచారణ చేపట్టింది.