breaking news
Tilakgarden
-
మూతపడిన ‘పురావస్తు’
నిజామాబాద్ కల్చరల్ : జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శన శాల దాదాపు ఏడాదికాలంగా అలంకారప్రాయంగా మారింది. 2004 లో అప్పటి ప్రభుత్వం జిల్లా ప్రజల కోసం రాతికాలంలో వాడిన పింగాణి పాత్రలు, నవాబుల డాబును తెలిపే కత్తులు,తల్వార్లు, క్రీస్తు పూర్వం నాటి అద్భుతమైన శిల్పసంపద తదితర వాటిని ఈ ప్రదర్శన శాలలో ఉంచారు. 16 వ శతాబ్దం మొదలుకొని ఆ తర్వాత పరిపాలన చేసిన పాలకులు వినియోగించిన అలనాటి వస్తువులను, చారిత్రక సంపదను, కాకతీయుల శిల్పాల కళ లను, ఛాయచిత్రాలను ఈ ప్రదర్శనశాలలో పెట్టారు. పురాతన సంపద,కళావైభవాన్ని తెలిపేందుకు ప్రజలకు ఉచితంగా తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన శాల 2005 నుంచి 2013 మే కాలం వరకు ఉచితంగా చూసే భాగ్యాన్ని కోల్పోయారు. ప్రవేశ రుసుము అమలు ఈ పురావస్తు ప్రదర్శన శాలను తిలక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. అయితే తిలక్గార్డెన్లోకి ప్రవేశించాలంటే * 5 ప్రవేశరుసుము విధించారు. దీంతో ప్రతిరోజు వందల సంఖ్యలో వచ్చే ప్రజలు రోజురోజుకు తగ్గిపోవడం జరిగింది. గత ఏడాది వర్షాకాలం కంటే ముందు వరకు నామమాత్రంగా నడిచిన ఈ ప్రదర్శనశాల ప్రస్తుతం అలంకారప్రాయంగా మారిపోయింది. గత వర్షకాలంలో భారీ వర్షాలు కురవడంతో పురావవస్తు ప్రదర్శన శాల భవనం పెచ్చులూడిపోయి ఎక్కడ కూలుతుందోనని అప్పటి నుంచి మూసివే శారు. శిథిలావస్థకు చేరిన భవనానికి మరమ్మతుల కోసం అప్పట్లోనే 25 లక్షల రూపాయల వరకు ఆ శాఖ మంజూరు చేసింది. వర్షాకాలం పూర్తవగానే మరమ్మతులు చేస్తామని ఆ శాఖ అధికారులు కూడా ప్రకటించారు. ఇప్పటి వరకు పురావస్తు ప్రదర్శన శాల భవనానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పురావస్తు ప్రదర్శన ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంచారు. ఒక ఉద్యోగిని ఇన్చార్జిగా నియమించినప్పటికీ సదరు ఉద్యోగి మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ విషయమై సదరు ఇన్చార్జి ఉద్యోగిని ‘సాక్షి’ సంప్రదించగా తాను బిజీగా ఉన్నానని సమాధానం చెప్పడం గమనార్హం. -
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
నిజామాబాద్ నాగారం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా భూమారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్థానిక తిలక్‌గార్డెన్‌లో గల న్యూఅంబేద్కర్ భవనంలో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులతో ఎస్జీఎఫ్ కార్యదర్శి నియామకంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యదర్శి పదవికి పోటీలో ఆరుగురు నిలిచారు. అందరు ఎన్నికలు జరుగుతాయని అనుకున్నారు.. కానీ గతంలో నుంచి ఇప్పటి వరకు కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఇప్పుడు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని, దీనికి సహకరించాలని డీఈఓ శ్రీనివాసాచారి సూచించారు. దీనికి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో పలువురి అభిప్రాయాలు తీసుకున్నారు. కార్యదర్శి పోటీలో ఉన్నవారు స్టేజీ మీదకు వచ్చి జాయినింగ్, సీనియారిటీ వివరాలు చెప్పాలని, తప్పుడు సమాచారం చెప్పితే సస్పెండ్ చేస్తానని అన్నారు. దీంతో వరుసగా జి.వి.భూమారెడ్డి, ఎం లక్ష్మీనారాయణ, వి.గంగాధర్, ఎం. నాగమణి, రసూల్ తదితరులు వచ్చారు. వీరి సీనియారిటీని డీఈఓ పరిశీలించారు. సీనియారిటీలో ముందున్న జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న జి.వి భూమరెడ్డి(పీడీ)ని జిల్లా కార్యదర్శి పదవికి ఏక గ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు తెలిపారు. దీంతో అందరు చప్పట్లతో అభినందనందించారు. జిల్లాకు పతకాలు తీసుకురావాలి వ్యాయామ ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని డీఈఓ సూచించారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఇంతవరకు జానకీరాం కొనసాగారని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా చాలా బాగా పనిచేశాడని డీఈఓ అభినందించారు. పిల్లలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడించి పతకాలు, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేవిధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. రోజు రెండు పిరియడ్లు బోధించాలి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాయామ విద్యపై తప్పని సరిగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం పీఈటీ, పీడీలు ప్రతి రోజు రెండు పీరియడ్లు విద్యార్థులకు వ్యాయమ విద్యా, ఆరోగ్యంపై అవగాహ న కల్పించాలన్నారు. అలాగే సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు పిల్లలకు విధిగా ఆటలు ఆడించాలన్నారు. పిల్లల దగ్గర నుంచి రూ.3చొప్పున వసూలు చేసి కార్యదర్శికి అందించాల న్నారు. అనంతరం డీఈఓ నూతనంగా ఎన్నికైన ఎస్జీఎఫ్ కార్యదర్శి భూమరెడ్డిని అభినందించారు. అలాగే జానకీరాంను కూడా సన్మానిం చా రు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ పోచాద్రి, జా యింట్ సెక్రటరీ మల్లెష్గౌడ్, సభ్యులు శివరాజ్, మోహన్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, అనురాధ తదితరులు పాల్గొన్నారు.