breaking news
Tickets Reservation
-
సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల టికెట్ రాయితీలరద్దుతో 2022–23లో అదనంగా రూ.2,242 కోట్లు ఆర్జించినట్లు రైల్వే శాఖ తెలిపింది. 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50%, 60 ఏళ్లు దాటిన పురుషులు, ట్రాన్స్జెండర్లకు 40% టికెట్ ధరలో రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి దీన్ని నిలిపేసిన రైల్వే శాఖ ఇప్పటిదాకా పునరుద్ధరించలేదు. -
నో టికెట్స్
నెల్లూరు (సెంట్రల్) : సంక్రాంతి రోజుల్లో ప్రయాణం కష్టతరం కానుంది. దూరప్రాంత ప్రయాణాలకు సంబంధించి రైళ్లు, బస్సుల్లో టికెట్లు నెల రోజుల ముందే బుక్ అయిపోయాయి. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు వెయిటింగ్ లిస్ట్ సైతం లేకుండాపోయింది. మిగిలిన రోజులకు సంబంధించి కొన్ని రైళ్లలో మాత్రమే వెయిటింగ్ లిస్ట్ అందుబాటులో ఉంది. దీంతో దూర ప్రాంతాల్లోని వారు సొంతూళ్లకు వచ్చేందుకు అవస్థలు తప్పని పరిస్థితి నెలకొంది. కన్ఫర్మేషన్ కష్టమే తెలుగు వారికి అతి పెద్ద పండగ కావడంతో సంక్రాంతికి నగరాలు, పట్టణాల నుంచి సొంత ఊళ్లకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. కొందరైతే మూడు నెలల ముందుగానే రైళ్లలో రాను, పోను టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రతి రైలుకు వెయిటింగ్ లిస్ట్‌లో వందలాది మంది నమోదై ఉన్నారు. సాధారణ రోజుల్లో కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 200 వరకు ఉన్నా రిజర్వేషన్ కన్ఫర్మ్ అయ్యేది. ఇప్పుడైతే వెయిటింగ్ లిస్ట్ చాంతాడులా పేరుకుపోయి చివరకు అవికూడా నిలిచిపోయాయి. వెయిటింగ్ లిస్ట్‌లో 50లోపు నమోదైన వారికి కూడా టికెట్ కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి లేదు. క్యాన్సిల్ అయ్యే టికెట్లు ఏవీ ఉండటం లేదని, అందువల్ల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి టికెట్ దొరికే అవకాశం లేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు సాగించే వారు ఏంచేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వెయిటింగ్ లిస్ట్‌లు పేరుకుపోయాయి పండగల దృష్ట్యా ఏ రైలులోనూ సీట్లు ఖాళీ లేవు. రిజర్వేషన్ టికెట్లు దొరకడం లేదు. వందల కొద్దీ వెయిటింగ్ ఉంటోంది. టికెట్లు బ్లాక్‌లోకి వెళ్లకుండా పటిష్ట చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు తెలిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. తక్షణ చర్యలు తీసుకుంటాం. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశాం. –డి.సతీష్, టికెట్స్ ఇన్స్పెక్టర్, నెల్లూరు రైల్వే స్టేషన్ బస్సుల్లో 50 శాతం అ‘ధనం’ నెల్లూరు(క్రైమ్): పండగ వేళ ప్రయాణ మంటేనే సామాన్యులు హడలిపోతున్నారు. ఆ రోజుల్లో అటు ప్రైవేట్ బస్, ఇటు ఆర్టీసీ యాజమాన్యాలు ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో సాధారణ టికెట్ ధరపై 100 నుంచి 200 శాతం ధర పెంచేయగా.. ఆర్టీసీ సైతం స్పెషల్ బస్సుల పేరుతో సాధారణ చార్జీపై 50 శాతం అదనపు వసూళ్లకు రంగం సిద్ధం చేసింది. రైళ్లలో టికెట్లన్నీ బుక్ అయిపోవడంతో ప్రయాణికులంతా ఆర్టీసీపై పడ్డారు. దీంతో చార్జీలు అమాంతం పెరిగిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు, తిరిగి ఈనెల 15 నుంచి 17వరకు ప్రయాణానికి డిమాండ్ అధికంగా ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సీట్లు అన్నీ రిజర్వ్ అయిపోయాయి. 282 ప్రత్యేక సర్వీసులు సంక్రాంతి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ నెల్లూరు రీజియన్ ఈనెల 10నుంచి 282 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు నిర్ణయించింది. సాధారణ బస్సులతో పాటు ప్రత్యేక సర్వీసులు సైతం అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కడప, రాజంపేట రూట్లలో డిమాండ్ ఉండటంతో ఆ ప్రాంతాలకే ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్‌కు 150, బెంగళూరుకు 60, చెన్నైకు 48, కడపకు 20, రాజంపేటకు 4 అదనపు సర్వీసులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఈ బస్సుల్లో సాధారణ టికెట్ చార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేస్తారు. ప్రైవేట్ రాజ్యం ప్రస్తుత పరిస్థితిని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఆన్లైన్ రిజర్వేషన్‌ను బ్లాక్ చేసి.. ఇష్టానుసారంగా చార్జీలు నిర్ణయించి నిలువు దోపిడీ చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే రెండింతలు అదనంగా వసూలు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు అదనంగా చెల్లించి టికెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. -
టికెట్ కోసం బారులు
120 రోజుల ముందుగా రిజర్వేషన్ సదుపాయం ఎగబడ్డ ప్రయాణికులు 8 కౌంటర్లతో టికెట్లు జారీ వెయ్యి మందికిపైగా అందని టికెట్లు విశాఖపట్నం సిటీ : రిజర్వేషన్ టికెట్లు కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. తెల్లవారుజాము నుంచే రిజర్వేషన్ కార్యాలయాల వద్ద క్యూ కట్టారు. ఒకే సారి పెద్ద సంఖ్యలో రిజర్వేషన్ టికెట్ల కోసం బారులు తీరడంతో బుకింగ్ క్లర్కులు సైతం ఆందోళన చెందారు. టికెట్ కోసం 9 నుంచి 10 గంటల పాటు ఉసూరుమంటూ నిరీక్షించారు. వెయ్యి మంది వరకూ టికెట్లు తీసుకోకుండానే ఇంటి ముఖం పట్టారు. ఇదే పరిస్థితి మరి కొన్నాళ్లు ఉంటుందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైల్వే బడ్జెట్లో 60 రోజుల నుంచి 120 రోజులకు రిజర్వేషన్ టికెట్లు తీసుకునే సదుపాయం కల్పిస్తూ కేంద్రం ప్రకటించింది. ఆ నిర్ణయం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రావడంతో వేసవి సెలవుల్లో పర్యటనల కోసం ఏర్పాట్లు చేసుకున్న వారంతా బుధవారం ఉదయాన్నే రిజర్వేషన్ కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. టోకెన్లు కోసం అంతా ఎగబడడంతో ఉదయం 10 గంటలకే 1300కు పైగా చేరిపోయాయి. రాత్రి 8 గంటల సమయానికి 2130 టోకెన్లు జారీ చే శారు. అందులో 1180 మందికి మాత్రమే టికెట్లు అందించగలిగారు. సాధారణ రోజుల్లో వెయ్యి నుంచి 1200 మందికి మాత్రమే టోకెన్లు జారీ చేసి వారందరికీ ఇచ్చేవారు. కౌంటర్లు పెంచినా...! రిజర్వేషన్ కార్యాలయంలో రోజూ 7 కౌంటర్లు ద్వారా టికెట్లు జారీ చేసేవారు. బుధవారం రద్దీని గమనించిన అధికారులు అదనంగా మరో కౌంటర్‌ను తెరిచారు. రెండు షిఫ్ట్‌ల ద్వారా మొత్తం 8 కౌంటర్ల నుంచీ టికెట్లు జారీ చేసినా సుమారు వెయ్యి మందికి టికెట్లు లభించలేదు. 45 మంది బుకింగ్ క్లర్కులు అవసరం కాగా కేవలం 35 మంది మాత్రమే రెండు షిఫ్ట్‌ల్లో అందుబాటులో ఉన్నారు. దీంతో 14 కౌంటర్లు ఉన్నా 8 కౌంటర్లుతోనే పని చేయించాల్సి వస్తోంది. టికెట్ల కోసం రద్దీ..! : రిజర్వేషన్ టికెట్ల కోసం ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు పూర్తికాగా, పదో పరీక్షలు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈలోగా పాఠశాలలకు సెలవులు ఇస్తే ఇక అంతా ప్రయాణాల బాట పడతారు. దీంతో మరింత రద్దీ పెరిగే చాన్స్ ఉంది. రైల్వే ఉన్నతాధికారులు ముందుగానే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే రిజర్వేషన్ టికెట్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోయే ప్రమాదం ఉంది.