breaking news
three held
-
రైస్ పుల్లింగ్ పేరుతో సైబరాబద్లో మోసాలు
-
ఎక్సైజ్ అధికారులు దాడులు : ముగ్గురు అరెస్ట్
విజయవాడ : కృష్ణాజిల్లా నందిగామలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ముమ్మరం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందిగామ పరిసర ప్రాంతాల్లో నాటు సారాను భారీగా తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. -
పేలుడు సామగ్రి పట్టివేత..ముగ్గురి అరెస్టు
బేతంచెర్ల(కర్నూలు): ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పేలుడు సామగ్రిని మంగళవారం బేతంచెర్ల పోలీసులు పట్టుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కర్నూలు నుంచి సంజామల మండలం నొస్సం గ్రామానికి పేలుడు సామగ్రి తరలుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో బేతంచెర్ల వద్ద టాటాసుమోలో తరలిస్తున్న 5000 ఎలక్ట్రానిక్ డిటొనేటర్లు, ఐడీఎల్ పవర్‌జల్ 1249, 500 కేజీల అమ్మోనియా నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నల్లగొండ జిల్లాకు చెందిన వరి కొప్పుల లింగయ్య, కల్లూరు మండలానికి చెందిన ఐతే శ్రీనివాసులు, కర్నూలులోని బళ్లారి చెందిన అందె సత్యాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.