breaking news
Three category
-
శతక నీతి – సుమతి..: వారి వెంట ఉంటే చాలు!
సత్పురుషులు అంటే కచ్చితంగా ఇలానే ఉంటారు అని చెప్పలేం. మంచి గుణాలతో మాత్రం ఉంటారు. రామ్ చరిత్ మానస్ లో తులసీదాస్ గారు సత్పురుషులను మూడు వర్గాలుగా విభజించారు. గులాబీ చెట్టు మంచి పూలు పూస్తుంది. చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. మంచి వాసనలు ఉంటాయి. కానీ ఆ చెట్టుకు కాయలుండవు. పండ్లుండవు. ఒకరకం సత్పురుషులు ఈ గులాబీ చెట్టులాంటివారు. మంచి మాటలు చెబుతూ సమాజాన్ని నడిపిస్తుంటారు. వారు ఎవరికీ అపకారం చేయరు. ఎవరినీ పాడు చేయరు. కానీ వాళ్ళు మంచి పనులు అదే పనిగా చేస్తున్నారా అంటే చెప్పడం కొద్దిగా కష్టమే. మామిడి చెట్టు ఉంటుంది. పూత పూస్తుంది, కాయా కాస్తుంది. పండ్లూ వస్తాయి. రెండో రకం సత్పురుషులు ఇలాటి వారు. మంచి మాటలు చెబుతారు. మంచి పనులూ చేస్తుంటారు. రెండూ ఉంటాయి తప్ప మంచి మాటలు చెప్పి పనులు చెయ్యకుండా కూర్చునే రకం కాదు. తమతో ఉన్న వాళ్ళను తమ వెంట తిప్పుకుంటూ అందరితో మంచి పనులు చేయిస్తుంటారు. పనస చెట్టు ఉంది. మామిడి కాయ లేదా పండయితే ఒకరికే సరిపోతుంది. పనసపండును పదిమందికి పంచవచ్చు. ఈ రకం వారు మంచి మాటలు అదే పనిగా చెప్పరు. కానీ మంచి పనులు మాత్రం ఆపకుండా చేసుకుంటూ పోతుంటారు. ఇదీ తులసీదాసుగారి వర్గీకరణ. ఇటువంటి సత్పురుషులతో కలిసి మెలిసి తిరుగుతుంటే మనం కూడా పూజార్హత పొందుతాం. వారితో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మంచిపనులు చేస్తూ పోతుంటాం. వారి త్యాగశీలత, నిస్వార్థంగా పనిచేసే తత్త్వం, అంకిత భావం, సమాజం పట్ల ప్రేమానురాగాలవంటి గుణాలను వారు చెబుతూ ఆచరించి చూపుతుంటే ... వాటి ప్రభావం మన మీద కూడా గాఢంగా పడుతుంది. క్రమేణా జీవితం దానికి అలవాటు పడి మనలో ఉన్న దుర్గుణాలు వాటతంట అవే మాయమయిపోతుంటాయి. సత్పురుషులతో సహవాస గొప్పదనాన్ని చెప్పడానికి రామకృష్ణ పరమ హంస ఒక ఉదాహరణ చూపుతుంటారు. ఒక ఏనుగు దారివెంట నడిచి వెడుతుంటూంది. కొబ్బరి చెట్టు కనపడితే కొబ్బరి కాయలను తొండంతో తుంపి నోట్లో వేసుకుంటుంది. అరటి చెట్టు కనబడితే ఆకులను పట్టి లాగేస్తుంది, చింపేస్తుంది. అంతవరకు దాని మీద కూర్చున్న మావటి పట్టించుకోడు. అక్కడ అరటి గెలలను తొండంతో పట్టుకుని లాగేయపోతుండగా... అంకుశం గుచ్చే ప్రయత్నం చేస్తాడు.. వెంటనే అది తొండాన్ని వెనక్కి తీసేసుకుంటుంది. సత్పురుషులు మావటిలాంటి వారు. మనం పనికిమాలిన పనులు చేస్తున్నా, అనవసర మాటలు మాట్లాడుతున్నా... మృదువుగానే మనల్ని మందలిస్తారు. మనల్ని చక్కదిద్దుతారు. నిజానికి వారు ప్రత్యేకించి మనల్ని పట్టించుకోనక్కరలేదు. వాళ్ళ సాహచర్యంలో అటువంటి పనులు చేయడానికి, అధిక ప్రసంగాలకు ఆస్కారముండదు. ధూళికణమయినా గాలితో కలిస్తే పైకెగిరినట్టు సత్పురుషుల సాంగత్యం మనల్ని ఉన్నతంగా నిలుపుతుంది. వారి సాంగత్యం లేకపోయినా నష్టమేదీ నేరుగా అనుభవంలోకి రాదు కానీ దుర్జనులతో కలిస్తే మాత్రం హాని జరిగితీరుతుందని చెప్పడానికే బద్దెనగారు –‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ హెచ్చరిస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురుకుల పాఠశాలలకు రూ. 239 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, కస్తూర్బా గాంధీ, మోడల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం రూ. 239 కోట్లు మంజూరు చేసింది. ఈ మూడు కేటగిరీల్లోని పాఠశాలల్లో చదువుతున్న 1,75,000 మంది బాల బాలికలకు హాస్టళ్లలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి సంరక్షణకు కూడా ఈ నిధులను వెచ్చించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం ఆయా సంస్థల అధికారులతో సమీక్ష అనంతరం కడియం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెం చేందుకు నిధులు కేటాయించామన్నారు. ఇప్పటి వరకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. వివిధ నిర్వహణ సంస్థల కింద నడుస్తున్న కస్తూర్బా పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లోని సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఈనెల 26న వైస్ చాన్స్లర్ల సమావేశం నిర్వహించనున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. -
మూడు కేటగిరీల్లో వెబ్ ఆప్షన్లు
-
మూడు కేటగిరీల్లో వెబ్ ఆప్షన్లు
నేటి సాయంత్రం 5 నుంచి ప్రక్రియ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ‘అఫిలియేషన్ల’ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం బుధవారమే తీర్పు ఇచ్చినా.. దాని కాపీ ప్రభుత్వానికి గురువారం అందింది.దానికి అనుగుణంగా ప్రవేశాల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. ముందే జేఎన్టీయూహెచ్ అనుమతి పొంది ఎలాంటి వివాదం లేని కాలేజీలతో పాటు కోర్టు ఆదేశాల మేరకు కొన్ని కాలేజీలు, స్వచ్ఛందంగా తనిఖీలకు ముందుకు వచ్చే కాలేజీలను వెబ్కౌన్సెలింగ్లో చేర్చనున్నారు. తనిఖీల్లో లోపాలున్నట్లు గుర్తిస్తే ఈ కాలేజీల్లో ప్రవేశాలు రద్దయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల విద్యార్థులకు ముందు జాగ్రత్తగా ఈ మూడు రకాల కాలేజీలు, వాటిల్లోని బ్రాంచీలను మూడు రంగుల్లో వేర్వేరుగా సూచిస్తారు. విద్యార్థులు tseamcet.nic.in వెబ్సైట్లో వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన గురువారం సచివాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, సాంకేతిక విద్యా కమిషనర్ వాణిప్రసాద్, జేఎన్టీయూహెచ్ తాత్కాలిక వీసీ శైలజా రామయ్యార్ తదితరులు సమావేశమై కౌన్సెలింగ్కు సంబంధించిన షెడ్యూల్ను ఖరారు చేశారు. అనంతరం కడియం శ్రీహరి ఈ షెడ్యూల్ను ప్రకటించారు. కోర్టుకు వెళ్లని కాలేజీల యాజమాన్యాలు కూడా తాజా తనిఖీలకు ఒప్పుకుంటే వాటిని వెబ్ కౌన్సెలింగ్లో చేర్చుతామని.. ఇందుకోసం గురువారం రాత్రి వరకు జేఎన్టీయూహెచ్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపా రు. కోర్టుకు వెళ్లిన వారికి వర్తించే నిబంధనలే వీటికి వర్తిస్తాయన్నారు. ఇక కోర్టుకు వెళ్లిన 121 కాలేజీల్లో 73 కాలేజీలు తమకు అదనపు సీట్లు అవసరం లేదంటూ జేఎన్టీయూకు లేఖలను అందజేశాయన్నారు. మరికొన్ని కాలేజీలు కొన్ని బ్రాంచీలు వద్దని, మరికొన్ని బ్రాంచీలకు తనిఖీలు చేయాలని కోరాయన్నారు. 3 రంగుల్లో.. 3 కేటగిరీలుగా.. 1. జేఎన్టీయూహెచ్ మొదట అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీలు, బ్రాంచీలు, సీట్లు.. 82,759 ఉన్నాయి. వీటితోపాటు ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లు కలుపుకొని 257 కాలేజీల్లోని 95,629 సీట్లు వెబ్ కౌన్సెలింగ్లో అందుబాటులో ఉంటాయి. ఇవీ ఏ వివాదం లేనివి. వీటిని సాధారణంగా ఉంచడం లేదా ఆకుపచ్చ రంగులో చూపించే అవకాశం ఉంది. 2. హైకోర్టు ఆదేశాల మేరకు పలు కాలేజీలు, బ్రాంచీలు, సీట్ల వివరాలను వెబ్ కౌన్సెలింగ్లో అందుబాటులో పెడతారు. ఈ కాలేజీలకు, బ్రాంచీలకు మరొక రంగు (ఎరుపు లేదా పసుపు) ఇస్తారు. వీటిలో ప్రవేశాలు ఈనెల 20 నుంచి చేపట్టే ఏఐసీటీఈ, జేఎన్టీయూ సంయుక్తంగా తనిఖీ నివేదికలపై ఆధారపడి ఉంటాయి. వీటిల్లో ఏవైనా కాలేజీలు, బ్రాంచీలకు అనుమతి రాకపోతే... వాటిలో చేరే విద్యార్థుల ఫీజులను వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేస్తారు. మరో కాలేజీలోకి మార్చుతారు. 3. కోర్టుకు వెళ్లని వారి కాలేజీలు, బ్రాంచీలను యాజమాన్యాలు కోరుకుంటే కౌన్సెలింగ్లో చేర్చుతారు. వాటిల్లోనూ తనిఖీలు చేసి.. లోపాలున్నట్లు తేలితే అనుమతివ్వరు. కోర్టుకు వెళ్లిన కాలేజీలకు సంబంధించి వర్తింపజేసే నిబంధనలు వీటికి కూడా వర్తిస్తాయి. ఈ కేటగిరీకి మరో రంగును కేటాయిస్తారు. జాగ్రత్తగా ఆప్షను ఇవ్వాలి ‘‘కాలేజీలను, బ్రాంచీలను ఎంచుకునే సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. వెబ్సైట్లో పేర్కొన్న రంగులను చూసి, నిబంధనలు చదువుకొని కాలేజీలను ఎంచుకోవాలి. కోర్టును ఆశ్రయించిన కాలేజీలు, బ్రాంచీలను ఎంచుకుంటే అవి కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలేజీలలోని కోర్సుల వివరాలను జేఎన్టీయూహెచ్, కౌన్సెలింగ్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతారు.’’ - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇదీ షెడ్యూల్ మొదటి దశ ప్రవేశాలు ⇒ ఈనెల 17న సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ⇒ 22న ఆప్షన్లను మార్చుకునే అవకాశం ⇒ 24న సీట్ల కేటాయింపు ⇒ 25వ తేదీ నుంచి 27 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు రెండోదశ ప్రవేశాలు ⇒ 29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (మొదటి దశలో పాల్గొనని వారికి) ⇒ 29 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు, ఆప్షన్లలో మార్పులకు అవకాశం ⇒ 31న సీట్ల కేటాయింపు ⇒ ఆగస్టు 1వ తేదీన కాలేజీల్లో చేరేందుకు అవ కాశం, ఇదే రోజునుంచి తరగతులు ప్రారంభం