breaking news
tharmal power station
-
సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/బూర్జ: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని సందర్శించి ప్రజలు, రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చిన సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధును ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్లో సీపీఎం జిల్లా నాయకులను, శ్రేణులను కలవనీయకుండా బూర్జ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన ఎవరితో మాట్లాడకుండా ముందస్తుగానే సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు సమయంలో సీఐ నవీన్‌కుమార్, మధు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులు, జిల్లా పార్టీ నేతలను మధుతో మాట్లాడనివ్వలేదు. నేతలు పోలీసులతో వాదనకు దిగడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హుటాహుటిన చేరుకున్న శ్రేణులు మధు అరెస్టు వార్త తెలియడంతో జిల్లా పర్యటనలోనే ఉన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దడాల సుబ్బారావుతో పాటు జిల్లా నలుమూలల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి బైఠాయించి, మధు అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో పలువురు నాయకుల్నీ పోలీసులు అరెస్టు చేశారు. మధును 151, 120బి,188, 34 రెడ్‌విత్ సెక్షన్లపై అరెస్టు చేసినట్లు రాత్రి 7.45 సమయంలో మీడియాకు తెలిపారు. అప్పటి వరకూ మీడియాను కూడా అనుమతించలేదు. ఆ తర్వాత మధును విడుదల చేశారు. పొలిట్‌బ్యూరో ఖండన మధును అరెస్ట్ చేయడాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో బుధవారం ఒక ప్రకటనలో ఖండించింది. విద్యుత్ కేంద్రానికి బలవంతంగా భూమిని సేకరిస్తున్నారన్న విషయం తెలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళుతున్న మధును రైల్వే స్టేషన్లోనే అరెస్ట్ చేయడం దుర్మార్గం, అప్రజాస్వామికమని పేర్కొంది. తమ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. -
పాల్వంచ కేటీపీఎస్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్
పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ సిఫారసు భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిబంధనలపై సైతం ఆమోద ముద్ర ఇంకా విడుదల కాని తుది ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) ఏడో దశ విద్యుత్ కేంద్రానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేటీపీఎస్‌లో మొత్తం 1720 మెగావాట్ల సామర్థ్యంతో 11 విద్యుత్ కేంద్రాలను ఆరు దశల్లో నెలకొల్పారు. ఏడోదశ విస్తరణలో భాగంగా తెలంగాణ జెన్కో అక్కడ 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. కేటీపీఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన 230 ఎకరాల స్థలంలోనే ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు పర్యావరణ అనుమతుల కోసం గత రెండేళ్లుగా జెన్కో ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈనెల మొదటివారంలో సమావేశమై ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వాలని సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తాజాగా తెలంగాణ జెన్కోకు లేఖ అందింది. మరో వారం రోజుల్లో అనుమతుల ఉత్తర్వులు సైతం జారీ కానున్నాయని జెన్కో వర్గాలు తెలిపాయి. ఖమ్మం జిల్లా మణుగూరులో 1080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ కేంద్రానికి సంబంధించి అమలు చేయాల్సిన నిబంధనలను సైతం ఇదే సమావేశంలో ఎక్స్పర్ట్ కమిటీ ఆమోదించింది. అదే విధంగా, నల్లగొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి 13,674 హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, అందులో కేవలం 4334 హెక్టార్లను కేటాయించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అంగీకారం తెలిపింది.