breaking news
Thaipusam
-
‘థాయ్‌పుసం’ తెలంగాణ స్టైల్లో!
థాయ్‌పుసం.. తమిళులకు ఇదో ప్రధాన ఉత్సవం. ఒంటికి శూలాలు గుచ్చుకుని అత్యంత భక్తిప్రపత్తులతో సుబ్రమణ్యస్వామికి మొక్కులు చెల్లించే వేడుక. తమిళనాడుతోపాటు మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో స్థిరపడిన తమిళ ప్రజలు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే, తెలంగాణలోనూ థాయ్‌పుసంను జరుపుతారు. అదెక్కడ? ఎలా జరుపుతారు? థాయ్‌పుసంకు మనకు ఉన్న సంబంధమేంటి?అన్న వివరాలు తెలుసుకోవాలంటే.. వందలఏళ్లతరువాత మాతృదేశానికి.. 1962లో బర్మాలో సైనిక తిరుగుబాటు జరిగిన అనంతరం అక్కడి భారతీయులను కట్టుబట్టలతో దేశం ఖాళీ చేయించారు. భారతీయ మహిళల మెడలోని బంగారు పుస్తెలతాళ్లను సైతం లాక్కుని వెనక్కి పంపారు. దీంతో బతుకుజీవుడా అంటూ పలువురు భారతీయులు మాతృదేశానికి వచ్చారు. వీరి కోసం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల్లో శరణార్థుల శిబిరాలను ఏర్పాటు చేసింది. వాటిల్లో పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అంతర్గాం శిబిరం ఒకటి. 1975లో ఇక్కడ శ్రీలంక, తమిళనాడు, ఆంధ్ర నుంచి బర్మాకు వలస వెళ్లిన భారత సంతతివారికి పునరావాసం కల్పించారు. ఈ క్రమంలో అక్కడ జమ్మిచెట్టు కింద స్వయంభూ వెలసిన అమ్మవారిని అప్పటి నుంచి వీరంతా నూకాంబిక–పోచమ్మ అమ్మవారిగా కొలుస్తున్నారు. థాయ్‌పుసం తరహాలో ఇక్కడ కూడా నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంటినిండా శూలాలు గుచ్చుకుని.. అంతర్గాంలో స్థానిక శరణార్థులు ఏటా ఉగాదికి ముందు అమ్మవారికి నవరాత్రులు నిర్వహించి చివరికి అమావాస్య రోజున ఒంటికి పదునైన శూలాలను గుచ్చుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తమను ఆపదలో ఆదుకుంటుందనే నమ్మకంతో అమ్మవారికి ఇలా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. శూలాలు గుచ్చుకున్నా.. భక్తుల శరీరాలపై రక్తం కారదు. సిద్ధహస్తులు, అనుభవజ్ఞులైనవారు రక్తనాళాలు తక్కువగా ఉన్న చోటే శూలాలు, కొక్కాలను గుచ్చుతారట. కొందరు వీపుపై కొక్కెలు గుచ్చుకుని చిన్న రథాలు కూడా లాగి తమ భక్తి చాటుకుంటారు. ఈ క్రమంలో భక్తుల నెత్తిన మిగతా భక్తులు పాలు పోస్తుంటారు. తరువాత కావడి ఆట్టంపేరిట అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ లయబద్ధంగా నర్తిస్తారు. రాత్రిపూట మరికొందరు భక్తులు చింత నిప్పులగుండంలో నడుస్తారు. శరణార్థులంతా అమ్మవారికి మాలధారణ ఆచరిస్తారు. పసుపు వ్రస్తాలు ధరించిన పురుషులు 21 రోజులు, మహిళలు వారం లేదా 11 రోజులపాటు మాలధారణలో ఉంటారు. ఈ ఉత్సవానికి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా స్థిరపడ్డ వీరి సంతతివారే కాకుండా, లండన్, న్యూజిలాండ్, అండమాన్ నికోబార్, శ్రీలంక నుంచి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం అంతర్గాంలో నూకాంబిక అమ్మవారి ఉత్సవాలు ఘనంగానిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తున్నాం:రామారావు,ఉత్సవ నిర్వాహకుడు మా ముత్తాతలను బ్రిటిష్ వారు తోటల్లో పనిచేసేందుకు కూలీలుగా బర్మా (మయాన్మార్)లోని రంగూన్ (ఇప్పుడుయాంగాన్)కు తీసుకెళ్లారు. వారు తమతోపాటు భారతీయ ఆచార వ్యవహారాలను సైతం తీసుకెళ్లారు. తిరిగి ఇండియాకు వచ్చాక మేం మా పూర్వీ కుల ఆచారాలను కొనసాగిస్తున్నాం. గ్రామంలో వెలిసిన అత్యంత శక్తిమంతురాలైన నూకాంబిక–పోచమ్మ అమ్మవారికి ఏటా ఉత్సవాలు నిర్వహించి మా భక్తిని చాటుకుంటున్నాం. అత్యంత భక్తి, నిష్టలతో శూలాలతోఒంటికి గుచ్చుకుని, బొనమెత్తుకొని చింతనిప్పులపై నడిచి మొక్కులు చెల్లిస్తుంటాం. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
ఘనంగా తైపూసం ఉత్సవాలు
ప్యారిస్, న్యూస్‌లైన్: మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధర్ పీఠంలో తైపూసం జ్యోతి ప్రజ్వలన ఉత్సవాలను గురువారం సా యంత్రం ఆధ్యాత్మిక గురువు బం గారు అడిగళార్ జ్యోతిని వెలిగించి ఘనంగా నిర్వహించారు. నవంబర్ నెల 22వ తేదీ నుంచి తైపూసం శక్తి మాలను ధరించిన భక్తులు ఆలయం లో కొలువుదీరిన ఆదిపరాశక్తి అమ్మవారికి ప్రతిరోజూ అభిషేకం చేస్తూ వచ్చారు. గురువారంతో ఇరుముడి ఉత్సవాలు ముగిశాయి. తైపూస ఉత్సవాలు బుధవారం వేకువజామున 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని సిద్ధర్ పీఠం ఉపాధ్యక్షుడు శ్రీదేవి రమేష్ ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు సిద్ధర్ పీఠం అధ్యక్షురాలు లక్ష్మీ బంగారు అడిగళార్ కలశ పూజను, యాగాన్ని నిర్వహించారు. రాత్రి 8 గంటలకు దిండుగల్ అంగింగు సంగీత బృందం ఆధ్వర్యంలో సంగీత కచేరి చేపట్టారు. తైపూస జ్యోతిని గురువారం సాయంత్రం 4 గంటలకు ఆదిపరాశక్తి సిద్ధర్ పీఠం ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగలార్ వెలిగించి భక్తులకు చూపారు. సాయంత్రం 5 గంటలకు కలైమామణి డ్రమ్స్ శివమణి సంగీత కార్యక్రమం జరిగింది. అనంతరం ఆధ్యాత్మిక గురువు ఇంటిలో గోపూజ చేసి, ప్రధాన జ్యోతిని లక్ష్మీ బంగారు అడిగళార్ వెలిగించారు. దాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో కరగాట్టం, ఒయిలాట్టం, పొయ్‌కాల్ కుదిరై వంటి గ్రామీణ కళాకారులు నృత్యాలను ప్రదర్శించారు. ఆలయానికి చేరిన ప్రధాన జ్యోతిని అందుకున్న బంగారు అడిగళార్ ఆలయంలో ఉన్న తైపూసం జ్యోతిని వెలిగించారు. అనంతరం దీపారాధన చేసి భక్తులు హారతి చూపించారు. ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆకాశ బాణసంచా వేడుక కనువిందు చేసింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.