breaking news
terrorisrs
-
పుల్వామాలో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్ : జమ్మూ-కశ్మీర్లో కాల్పుల మోత మోగింది. శనివారం ఉదయం పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావటంతో ఆర్మీ బలగాలు అవంతిపొరలో గోరిపోరా ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఈ క్రమంలోనే జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులతోపాటూ వారికి సహకరిస్తున్న మరో వ్యక్తిని భద్రతాదళాలు మట్టుపెట్టాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (సీఆర్పీఎఫ్ శిబిరంపై గ్రనేడ్ దాడి) -
సీఆర్పీఎఫ్ శిబిరంపై గ్రనేడ్ దాడి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో సీఆర్పీఎఫ్ శిబిరంపై గుర్తుతెలియని ఉగ్రవాదులు శుక్రవారం గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. చదూర ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ పోస్ట్‌పై గ్రనేడ్ విసిరారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. గ్రనేడ్ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. గ్రనేడ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దూనివారి చదూరలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారని దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నామని బుద్గాం ఎస్పీ పేర్కొన్నారు. చదవండి : గ్రనేడ్ దాడిలో ఇద్దరు జవాన్ల మృతి -
ఉగ్రవాదుల ప్రీపెయిడ్ లావాదేవీలు
పారిస్: ఇటీవలి కాలంలో నేరుగా నగదు రూపంలో చెల్లింపులు తగ్గిపోయాయి. వీసా, మాస్టర్ కార్డుల లోగోలతో కూడిన ప్రీపెయిడ్ కార్డుల ద్వారా చెల్లింపులు పెరిగాయి. ఇలాంటి కార్డుల వాడకం ద్వారా నగదు చెల్లింపు సులభం అవుతున్నా.. వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా లేకపోలేదని ఇటీవలి పరిణామాలు తెలియజేస్తున్నాయి. పారిస్ దాడుల్లో 130 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు.. దాడికి ముందు రోజు బస చేసిన హోటల్ బిల్లులు, ఇతర ఖర్చులకు ప్రీపెయిడ్ కార్డుల ద్వారా చెల్లింపులు చేపట్టడం ద్వారా నిఘా వర్గాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. కార్డులను ఉపయోగించే వ్యక్తి పేరును సైతం తెలియజేయాల్సిన అవసరం లేకుండా యూరప్‌లో ఈ ప్రీపెయిడ్ కార్డులను జారీ చేస్తారు. దీనివల్ల ఉగ్రవాదులు సులభంగా తమ లావాదేవీలను నిర్వహించుకోవడానికి వీలవుతుందని నిఘావర్గాలు తెలుపుతున్నాయి. ఫ్రాన్స్‌లో 2008 నుంచి జారీ చేస్తున్న ప్రీపెయిడ్ కార్డులు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. సాధారణంగా కార్డుల జారీకి బ్యాంక్ ఎకౌంట్ అనుసంధానం అవుతుంది. కానీ బ్యాంకుల మధ్య పోటీ వల్ల వ్యక్తిగత వివరాలను నమోదు చేయకుండానే బ్యాంకింగేతర రంగాలలో వాడటానికి ప్రీపెయిడ్ కార్డులను జారీ చేస్తున్నారు. 18 ఏళ్ల వయసు నిండితే చాలు.. ఈ కార్డులను పొందవచ్చు. ఈ కార్డులను రీచార్జ్ చేసుకొని విదేశాలలో లావాదేవీలు నిర్వహించుకోవడానికి వీలుగా నిబంధనలు ఉన్నాయి. దీంతో ఉగ్రవాదులు నిఘా వర్గాలకు చిక్కకుండా డబ్బును బదిలీ చేసుకున్నారని తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో ప్రీపెయిడ్ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీలు తమ దృష్టికి వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్ అధికారులు భావిస్తున్నారు.