breaking news
Term insurance schemes
-
1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్!
‘‘ముప్పై ఏళ్ల యువకుడు.. ఇటీవలే కెరియర్లో స్థిరపడ్డాడు. మంచి జీతం. ఈఎంఐలతో ఇల్లు, కారు కొనుగోలు చేశాడు. అయితే, అనుకోని ప్రమాదంలో మరణించాడు. అతని ఆదాయంపై ఆధారపడిన తన భార్య, చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆర్థిక కష్టాల్లో పడ్డారు. పెద్ద మొత్తంలో ఉన్న లోన్ భారం, పిల్లల చదువుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆర్థిక భద్రతకు అత్యంత సరళమైన, శక్తివంతమైన మార్గమైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఈ దుర్భర పరిస్థితిని నివారించేవారు’’ఈ రోజుల్లో ఆర్థిక నిపుణులు ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు (నేటి మధ్య వయస్కులు, సీనియర్ ప్రొఫెషనల్స్), 1997-2007 మధ్య పుట్టిన యువతరం (మిలీనియల్స్/జనరేషన్ జెడ్) తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి ప్లాన్ కాదు. ఇది కేవలం ప్యూర్ ప్రొటెక్షన్ (Pure Protection) ప్లాన్. బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ కాలంలో మరణిస్తే అతని కుటుంబానికి లేదా నామినీకి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం లభిస్తుంది.టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?టర్మ్ ఇన్సూరెన్స్ ఒక నిర్దిష్ట కాలానికి (ఉదాహరణకు, 10, 20, 30 సంవత్సరాలు లేదా 60/ 80 ఏళ్ల వయసు వరకు) కవరేజీని అందిస్తుంది. ఈలోపు పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బు నామినీకి చెందుతుంది. ఇతర జీవిత బీమా పథకాలతో పోలిస్తే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్‌కు ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మీ కుటుంబానికి రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కవరేజీని అందించవచ్చు.పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తాన్ని (Sum Assured) ఏకమొత్తంగా లేదా నిర్ణీత కాల వ్యవధిలో నెలవారీ ఆదాయంగా పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పాలసీ కాలం ముగిసే వరకు జీవించి ఉంటే సాధారణంగా చెల్లించిన ప్రీమియం తిరిగి రాదు (టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం - వంటి ప్రత్యేక ప్లాన్లలో ప్రీమియం కూడా వస్తుంది. అయితే అందుకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది). అందుకే ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.1980 తర్వాత పుట్టిన వారికి..1980 తర్వాత పుట్టిన వారిలో చాలా మంది ఇప్పుడు 40 లేదా 45 ఏళ్ల వయసులో ఉన్నారు. ఈ దశలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదా ఉన్న కవరేజీని పెంచుకోవడం చాలా అవసరం. పిల్లలు కాలేజీ లేదా ఉన్నత విద్య దశలో ఉంటారు. వారి చదువులు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇంటి పెద్ద లేని సమయంలో ఈ లక్ష్యాలు నెరవేరడం కష్టమవుతుంది.చాలా మందికి ఈ వయసులో హోమ్ లోన్, కార్ లోన్ వంటి భారీ ఈఎంఐ బాధ్యతలు ఉంటాయి. పాలసీదారు మరణిస్తే ఈ లోన్ భారం మొత్తం కుటుంబంపై పడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే మొత్తం ఈ రుణాలను సులభంగా తీర్చడానికి ఉపయోగపడుతుంది.ఆరోగ్య సమస్యలువయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య ప్రమాదాలు (క్రిటికల్ ఇల్నెస్) పెరిగే అవకాశం ఉంటుంది. టర్మ్ ప్లాన్‌తో పాటు రైడర్స్ తీసుకోవడం ద్వారా ముఖ్యమైన అనారోగ్యాలు సంభవించినా ఆర్థిక భద్రత లభిస్తుంది.1997-2007 మధ్య పుట్టిన యువతఈ జనరేషన్ జీ/మిలీనియల్స్‌కు టర్మ్ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యమైంది. ఎందుకంటే వారికి అతి తక్కువ ప్రీమియంతో జీవితకాలం రక్షణ పొందే అద్భుత అవకాశం ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వయసు ముఖ్యమైన అంశం. చిన్న వయసులో (20-30 ఏళ్ల మధ్య) తీసుకుంటే ఆరోగ్య ప్రమాదాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులో తీసుకున్న ప్రీమియం, 35 ఏళ్లలో తీసుకున్న ప్రీమియం కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది.ఆర్థిక బాధ్యతలుఈ యువతరం ఇప్పుడిప్పుడే వివాహం చేసుకుని, పిల్లల పెంపకం, సొంత ఇల్లు, ఇతర జీవిత లక్ష్యాల దిశగా అడుగులు వేస్తారు. కుటుంబం వారిపై ఆధారపడటం మొదలవుతుంది. ఈ దశలోనే రక్షణ కవచం ఏర్పరచుకోవడం తెలివైన నిర్ణయం.దీర్ఘకాలిక రక్షణతక్కువ ప్రీమియంతో 60 లేదా 70 ఏళ్ల వరకు కూడా కవరేజీ తీసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందుతాయి.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం -
టర్మ్‌ప్లాన్‌తో మెరుగైన బీమా రక్షణ
జీవిత బీమా తీసుకోవడం అంటే.. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే. అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అచ్చమైన జీవిత బీమా అని చెప్పుకోవాలి. ‘‘టర్మ్ ప్లాన్ అయితే, తక్కువ ఖర్చు (ప్రీమియం)కు గరిష్ట బీమా కవరేజీనిస్తుంది. టర్మ్ ప్లాన్ ను ఇప్పుడు 99 ఏళ్లకు మించిన కాలానికీ తీసుకునే అవకాశం ఉంది. టర్మ్ ప్లాన్‌లో చెల్లించే ప్రీమియం వెనక్కి రాదని తెలిసిందే. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే కట్టిందంతా వ్యర్థమే అవుతుందన్న ఆలోచనతో కొంత మంది టర్మ్ ప్లాన్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో బీమా కంపెనీలు పాలసీ కాల వ్యవధి తీరే వరకు జీవించి ఉంటే కట్టిన ప్రీమియంను వెనక్కిచ్చే ఫీచర్‌తోనూ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. వీటి మధ్య సారూప్య, వ్యత్యాసాలను చూస్తే.. రెగ్యులర్ టర్మ్ ప్లాన్లు అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ నిర్దేశిత కవరేజీతో, నిర్ణీత కాలానికి అందించేది. 5 నుంచి 45ఏళ్ల కాలానికి బీమా కవరేజీ లభిస్తుంది. పాలసీదారు పాలసీ కాల వ్యవధిలో మరణానికి గురైతే నామినీకి బీమా మొత్తాన్ని అందిస్తుంది. ఏకమొత్తంలో లేదా ఏటా నిర్ణీత శాతం చొప్పున ఎంచుకున్న ప్లాన్ ఆప్షన్ ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. పాలసీ కాలవ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే ఎటువంటి ప్రయోజనాలు వెనక్కి రావు. పాలసీదారుకు జీవిత కాలం పాటు సంపూర్ణ కవరేజీ అన్నది ఇందులో లభిస్తుంది. కేవలం మరణానికి కవరేజీ మాత్రమే లభిస్తుంది. భరించగలిగే ప్రీమియంతో వచ్చే ప్లాన్ ఇదొక్కటే. ప్రీమియం అన్నది పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు స్థిరంగా (మార్పు లేకుండా) ఉంటుంది. ప్రీమియం వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్ దురదృష్టవశాత్తూ మరణానికి గురైతే తన కుటుంబానికి పరిహారం రావాలి. ఒకవేళ పాలసీ గడువు తీరే వరకు జీవించి ఉన్నా ఎంతో కొంత వెనక్కి రావాలని ఆలోచించే వారు చాలా మంది ఉన్నారు. రిటర్న్ ఆఫ్ ప్రీమియం (ఆర్వోపీ) టర్మ్ ప్లాన్లు ఈ కోవకు చెందినవే. వీటిల్లో గడువు తీరే వరకు పాలసీదారు జీవించి ఉంటే కట్టిన ప్రీమియం మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. పాలసీదారుకు హామీపూర్వక విలువను ఆఫర్ చేస్తుంది. పాలసీదారుగా మీ ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా పాలసీ కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. తమకు ఎంతో కొంత వెనక్కి రావాలని ఆశించేవారికి ఆర్వోపీ టర్మ్ ప్లాన్ అన్నది విలువకు తగిన పాలసీ అవుతుంది. సాధారణంగా 20, 25, 30, 40 ఏళ్ల టర్మ్ తో ఈ పాలసీలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల కాలవ్యవధిపై ఎంతో కొంత రుణం తీసుకుని ఉంటే, 20 ఏళ్ల టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అనుకోని విధంగా మరణం చోటు చేసుకుంటే రుణం ఎలా చెల్లించాలన్న సమస్య ఉండదు. ఒకవేళ జీవించి ఉంటే చివర్లో నూరు శాతం ప్రీమియం వెనక్కి వచ్చేస్తుంది. కొన్ని ఆర్వోపీ ప్లాన్లు చెల్లించిన ప్రీమియానికి అధికంగానే వెనక్కి ఇస్తున్నాయి. ఇలా మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. బీమా ప్రీమియం చెల్లింపు సమయంలోనూ ఆ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ప్రీమియం చెల్లింపులు మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రీమియం చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. సాధారణంగా అయితే వార్షికంగా, అర్ధ సంవత్సరానికి, త్రైమాసికం, నెలవారీగా చెల్లించే ఆప్షన్లు ఉంటాయి. కొన్ని సింగిల్ (ఒక్కసారి చెల్లించే) ప్రీమియం ఆప్షన్ తోనూ వస్తున్నాయి. సంతోష్ అగర్వాల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పాలసీబజార్ డాట్ కామ్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం -
ఆన్లైన్ బీమాతో 3 ప్రయోజనాలు
ప్రతీ ఒక్కరు కలిగి ఉండాల్సిన వాటిలో జీవిత బీమా ఒకటి. ఆర్థిక ప్రణాళిక అనేది బీమాతోనే మొదలు పెట్టాలి. మీ అవసరాలను తీర్చే విధంగా విభిన్నమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న వయస్సు వారి దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు , పేదవాళ్ల దగ్గర నుంచి ధనికులకు అవసరమైన అన్నిరకాల పథకాలు ఉన్నాయి. కానీ బీమా ప్రధానోద్దేశ్యం ఇంటిలో ప్రధానంగా సంపాదించే వ్యక్తికి అనుకోని సంఘటన ఏదైనా జరిగితే అతనిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఆర్థిక భరోసా కల్పించడమే. దీన్ని టర్మ్ ఇన్సూరెన్స్ పథకాలు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి. తక్కువ ధరతో అధిక బీమా రక్షణను టర్మ్ పాలసీలు కల్పిస్తాయి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఏజెంట్లు ద్వారా కాని నేరుగా ఆన్లైన్ ద్వారా కాని కొనుగోలు చేయొచ్చు. అదే ఆన్లైన్లో కొనుగోలు చేస్తే మరికొన్ని అదనపు ప్రయోజనాలు పొందచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం... తక్కువ ధర టర్మ్ ఇన్సూరెన్స్ పథకాల్లో ప్రీమియం అనేది చాలా ప్రధానమైన అంశం. ఆన్లైన్లో లభించే టర్మ్ ఇన్సూరెన్స్ పథకాల ప్రీమియాలు 50 నుంచి 70 శాతం తక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఎటువంటి మధ్యవర్తి ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీ నుంచే పాలసీ తీసుకుంటుండటంతో వ్యయాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఏజెంట్ కమీషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎంచుకోవడం విభిన్న కంపెనీల పథకాలను పరిశీలించి అందులో మీ అవసరాలకు సరిపోయే పాలసీని ఎంచుకోవచ్చు. అంతేకాదు అప్లికేషన్ ఫారం మీరే పూర్తి చేస్తారు కాబట్టి కంపెనీకి ఇచ్చే సమాచారంపై కచ్చితత్వం ఉంటుంది. దీంతో క్లెయిమ్‌ల సమయంలో సమస్యలు తలెత్తవు. సౌకర్యం చాలా సులభంగా, మీకు నచ్చిన సమయంలో పాలసీ తీసుకోవచ్చు. దీనివల్ల విలువైన సమయం ఆదా అవుతుంది.


