breaking news
tenth class marks
-
సోషల్ మీడియాలో విద్యాబాలన్ మార్కులు..
ముంబై: బాలీవుడ్ హీరోయిన్లు తమ వ్యక్తిగత అభిరుచులను సోషల్ మీడియాలో పంచుకుంటు అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తన పదవ తరగతి మార్కులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా విడుదలైన శకుంతలా దేవి బయోపిక్‌లో విద్యాబాలన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే తాను చదువులో జీనియస్‌ను కాదని, కానీ సంతృప్తికర మార్కులు వచ్చేవని తెలిపింది. తన పదవ తరగతి మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో 150 మార్కులకు గాను 125మార్కులు వచ్చావని, అన్ని సబ్జెక్ట్‌లను కలిపి పదవ తరగతిలో 82.42శాతం మార్కులు సాధించానని పేర్కొంది. మరోవైపు విద్యాబాలన్ తాను చూపెట్టినట్లుగానే అభిమానులు మ్యాథ్స్ మార్కులు చూపెట్టాలని సూచించారు. గణిత మేధావి శకుంతులా దేవీ తన గణిత ప్రతిభతో హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు సంపాధించుకున్నారు. అయితే శకుంతలా దేవి జీవితాన్ని విద్యా బాలన్ గొప్పగా నటిస్తే అంజు మీనన్ దర్శకత్వం సినిమాను విపరీతంగా ఆకర్శించింది. హాస్యం, వ్యంగ్యం, తీవ్రమైన భావోద్వేగం ఉండే శకుంతలా దేవిగా పాత్రలో విద్యా బాలన్ నటన అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. చదవండి: ‘నేనెప్పుడూ ఓడిపోను.. గుర్తుపెట్టుకో’ -
బీపీఎం పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కర్నూలు డివిజన్ పరిధిలోని 11 పోస్టాఫీస్‌లో బ్రాంచి పోస్టు మాస్టర్ (బీపీఎం) ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాల వయసు నిండిన వారు అర్హులన్నారు. టెన్త్ క్లాస్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. వివరాలకు వెబ్సైట్ (www.royalpost.in)లో చూడవచ్చన్నారు. కర్నూలు డివిజన్ సూపరింటెండెంట్ కార్యాలయంలో కూడా సంప్రదించవచ్చని తెలిపారు. 27 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన .. మొదటి రోజు ఉదయం 10 గంటలకు హాలహర్వి మండలం మీదేహాలు(ఓసీ), మధ్యాహ్నం 2 గంటలకు తుగ్గలి మండలం పగిడిరాయి(ఎస్సీ) పోస్టాఫీస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 28వతేదీ ఉదయం ఇంగదహాల్ ఎస్ఓ పరిధిలోని లింగదహళ్లి(ఓసీ), మధ్యాహ్నం వందవాగిలి(ఎస్సీ), 29 ఉదయం బసాపురం (ఓసీ), మధ్యాహ్నం ఓర్వకల్లు ఎస్ఓ పరిధిలోని ఎన్. కొంతలపాడు(ఓబీసీ), 30వతేదీ ఉదయం ఇంగల్దహాల్ ఎస్ఓ పరిధిలోని హెబ్బటం(ఓసీ), మధ్యాహ్నం కోసిగి పరిధిలోని డి.బెళగల్లు (ఓబీసీ), 31 ఉదయం దేవనకొండ పరిధిలోని నేలతలమర్రి (ఓసీ), మధ్యాహ్నం ఎరుకల చెర్వు పరిధిలోని ఇగవేలి(ఓసీ), సాయంత్రం పత్తికొండ పరిధిలోని హోసూరు(ఎస్టీ) పోస్టాఫీస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.