సోషల్‌ మీడియాలో విద్యాబాలన్‌ మార్కులు..

Vidya Balan Shares Pics Of Class 10 Marksheet In Social Media - Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరోయిన్‌లు తమ వ్యక్తిగత అభిరుచులను సోషల్‌ మీడియాలో పంచుకుంటు అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌  తన పదవ తరగతి మార్కులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా విడుదలైన శకుంతలా దేవి బయోపిక్‌లో విద్యాబాలన్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అయితే తాను చదువులో జీనియస్‌ను కాదని, కానీ సంతృప్తికర మార్కులు వచ్చేవని తెలిపింది. తన పదవ తరగతి మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌లో 150 మార్కులకు గాను 125మార్కులు వచ్చావని, అన్ని సబ్జెక్ట్‌లను కలిపి పదవ తరగతిలో 82.42శాతం మార్కులు సాధించానని పేర్కొంది. 

మరోవైపు విద్యాబాలన్‌ తాను చూపెట్టినట్లుగానే అభిమానులు మ్యాథ్స్‌ మార్కులు చూపెట్టాలని సూచించారు. గణిత మేధావి శకుంతులా దేవీ తన గణిత ప్రతిభతో హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరు సంపాధించుకున్నారు. అయితే శకుంతలా దేవి  జీవితాన్ని విద్యా బాలన్‌ గొప్పగా నటిస్తే అంజు మీనన్‌ దర్శకత్వం సినిమాను విపరీతంగా ఆకర్శించింది.  హాస్యం, వ్యంగ్యం, తీవ్రమైన భావోద్వేగం ఉండే శకుంతలా దేవిగా పాత్రలో విద్యా బాలన్‌ నటన అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది.
చదవండి: ‘నేనెప్పుడూ ఓడిపోను.. గుర్తుపెట్టుకో’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top