breaking news
Tenth CBSE
-
CBSE: ఇక ఏడాదికి రెండుసార్లు పదో తరగతి పరీక్షలు
సాక్షి,ఢిల్లీ: విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ఈపీ) భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏడాది నుంచి రెండుసార్లు (twice a year) పది పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు బోర్డు ఆమోదం తెలిపింది. బోర్డు నిర్ణయంతో సీబీఎస్ఈ విధానంలో 10వ తరగతి (CBSE Class 10 board exams) చదివే విద్యార్థులు వచ్చే ఏడాది అంటే 2026 నుంచి బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు రాయాల్సి ఉంటుంది. ఇందులో తొలి దఫా పరీక్షలు ఫిబ్రవరిలో రెండో విడత పరీక్షలు మేలో జరుగుతాయని సీబీఎస్ఈ కంట్రోలర్ సన్యాం భరద్వాజ్ తెలిపారు. దీనికి అనుగుణంగా తొలి విడత పదో తరగతి పరీక్షలను బోర్డు తప్పనిసరి చేసింది. రెండో విడత పదో తరగతి పరీక్షలను ఆప్షనల్‌గా పెట్టింది. రెండు విడతల్లో మంచి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. రెండు దశలకు సంబంధించిన ఫలితాలు వరుసగా ఏప్రిల్, జూన్‌లో ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.సీబీఎస్ఈ (CBSE) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, విద్యార్థులు సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజ్ సబ్జెక్ట్స్‌లలో ఏదైనా మూడు విభాగాలలో తక్కువ మార్కులు వచ్చినా, వారు మళ్లీ పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. తద్వారా విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి, వారి అసలు సామర్థ్యాన్ని మెరుగ్గా చూపించేందుకు సహాయ పడనుట్లు తెలిపారు. -
CBSE Results:టెన్త్‌లో కుమార్తెకు 100శాతం మార్కులు.. బాధపడుతున్న తల్లి!
చండీగఢ్: తమ పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో పాసైతేనే తల్లిదండ్రులు సంతోషంలో అందరికీ చెప్పుకుంటారు. అలాంటిది 100 శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు. తమ పిల్లల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ, ఓ తల్లి తన కూతురికి పదో తరగతిలో 100 శాతం మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు. ఆమె బాధకు గల కారణాలేంటి? హర్యానాకు చెందిన అంజలి యాదవ్ అనే విద్యార్థిని ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించింది. కానీ, ఆమె తల్లి మాత్రం ఓ పక్క సంతోషంగా ఉన్నా.. మరోవైపు బాధపడుతున్నారు. తన కుమారఢ్ను పైచదువులకు ఏ విధంగా పంపించాలో తెలియటం లేదని తనలోతానే మదనపుడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కడాని కుటుంబం వారిది. దీంతో పైచదువులకు అయ్యే ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినికి డాక్టర్ కావాలనేది కల. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌లో చదవాలనుకుంటోంది. కానీ, వారి కుటుంబంలో తల్లి పని చేస్తేనే పూట గడిచే పరిస్థితులు ఉన్నాయి. వారికి కొద్ది పాటి వ్యవసాయ భూమి ఉన్నా.. అందులో పండేవి ఇంటికే సరిపోవు. విద్యార్థిని తండ్రి పారామిలిటరీలో చేరిన క్రమంలో 2010లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనారోగ్య సమస్యలతో 2017లో తన విధుల నుంచి వైదొలిగారు. ఆ సమయంలో పీఎఫ్ ద్వారా రూ.10 లక్షలు అందాయి. కానీ, అవి అప్పులు, ఇతర ఖర్చులకే అయిపోయాయని వాపోయారు విద్యార్థిని తల్లి ఊర్మిళ. విద్యార్థిని సోదరుడు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. సిలార్పుర్‌లో నివాసం ఉంటున్న విద్యార్థిని అంజలి.. మహోందర్‌గఢ్‌లోని ఇండస్ వాలీ పబ్లిక్ స్కూల్లో చదవుతోంది. ‘ఆమె కష్టపడి చదువుతుంది. తాను అనుకున్నది సాధిస్తే మన కష్టాలు తొలగిపోతాయని చెబుతుంటుంది. ఆమెకు ఎప్పుడూ మద్దతు ఇస్తూ చదువుపై దృష్టి పెట్టాలని చెప్పేదాన్ని. ’ అని పేర్కొన్నారు ఊర్మిళ. నెలకి రూ.20వేల స్కాలర్షిప్.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆదివారం ఫోన్ చేసి విద్యార్థినిని అభినందించారు. ఈ క్రమంలో తన కుటుంబ పరిస్థితుల గురించి సీఎంకు వివరించింది విద్యార్థిని. దీంతో ఆమెకు నెలకు రూ.20వేల స్కాలర్షిప్ ప్రకటించారు ముఖ్యమంత్రి. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ‘ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించటమే గగనంగా మారింది. అందుకే మా పరిస్థితులపై ముఖ్యమంత్రికి తెలియజేశాను. స్కాలర్షిప్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ’ అని విద్యార్థిని తల్లి ఊర్మిళ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’ -
మళ్లీ సీబీఎస్ఈ టెన్త్ బోర్డు పరీక్షలు!
న్యూఢిల్లీ: విద్యాప్రమాణాలు దిగజారుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ బోర్డు పరీక్షలను తిరిగి ప్రవేశపెట్టడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనిపై మానవ వనరుల అభివృద్ధిమంత్రి ప్రకాశ్ జవదేకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పరీక్షలను తిరిగి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తున్నామని, అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. 5 రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన కమిటీతో పాటు దేశవ్యాప్తంగా తల్లిదండ్రులూ విద్యా ప్రమాణాలు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారని, ఈ పరీక్షలు జరపాలంటున్నారని తెలిపారు. బోర్డు పరీక్ష తిరిగి ప్రవేశ పెట్టడంపై హెచ్ఆర్డీ మంత్రి అధ్యక్షతన ఈ నెల 25న జరిగే సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. నో-డిటెన్షన్ విధానం వల్ల ప్రమాణాలు దిగజారాయనే ఆందోళన వ్యక్తమవుతోందని హెచ్ఆర్డీ అధికారి ఒకరు చెప్పారు.