breaking news
Temporary Assembly Building
-
అసెంబ్లీ గోడల లోపల నీటి ఊట!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తాత్కాలిక భవనాల డొల్లతనమేంటో అధికారుల పరిశీలనలోనే బయటపడింది. ఫైరింజన్ ఉపయోగించి అసెంబ్లీ తాత్కాలిక భవన గోడలపై బయట వైపు నుంచి నీళ్లు కొడితే భవనం లోపలవైపు గదుల్లో నీరు చేరడాన్ని అధికారులు గుర్తించారు. మంగళవారం చిన్నపాటి వర్షానికే.. అసెంబ్లీ తాత్కాలిక భవనంలోని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చాంబర్లోకి నీరు చేరిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు బుధవారం అగ్ని మాపక శకటంతో అసెంబ్లీ తాత్కాలిక భవనంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు జరిగే సమయంలోనూ, అనంతరం అసెంబ్లీ లోపలికి మీడియా రాకపోకలపై అసెంబ్లీ అధికారులు ఆంక్షలు విధించారు. తనిఖీల సమయంలోనూ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలను అనుమతించిన భద్రతాధికారులు అదే సమయంలో మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్లడానికి గేటు వద్దే అడ్డుకున్నారు. అధికారులు జగన్ చాంబర్ వద్ద గోడ బయట వైపు నుంచి అగ్నిమాపక శకటం ద్వారా నీళ్లు కొట్టారు. కొద్దిసేపటికే గోడ లోపల వైపు నీటి ఊట రావడం పరిశీలనలో తేలినట్టు సమాచారం. -
అమరావతిలో మరో తాత్కాలిక భవనం
-
రాజధాని నిర్మాణానికి సమయం కావాలి
ప్రతి ఒక్కరిదీ ఒక్క రూపాయైనా భాగస్వామ్యం ఉండాలి తాత్కాలిక అసెంబ్లీ భవన ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు సాక్షి, అమరావతి: తాను అనుకున్న విధంగా రాజధాని నిర్మాణం చేయాలంటే సమయం, తగినన్ని వనరులు కావాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనసభ, శాసనమండలి భవనాలకు చంద్రబాబు గురువారం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పొలంలో అయినా అసెంబ్లీ బ్రహ్మాండంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం అంటే ఒక్క ముఖ్యమంత్రి లేదా మంత్రులో చేసేది కాదని, ప్రతి ఒక్కరిదీ ఒక్క రూపాయైనా భాగస్వామ్యం ఉండాలని కోరారు. చంద్రబాబు తాత్కాలిక శాసనసభ, శాసనమండలి భవనాలను పరిశీలించారు. వారు అసెంబ్లీలో తమకు కేటాయించే కుర్చీల్లో కూర్చొని పరిశీలించారు. అసెంబ్లీ భవనాల్లో తమ చాంబరులో కూర్చొని కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు గాను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వసతి ఏర్పాటుకు బదులుగా ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున అదనపు భత్యం చెల్లింపునకు సంబంధించిన ఫైలుపై చంద్రబాబు గురువారం సంతకం చేశారు. ప్రజా గోడుకు పోలీసు ‘చాటు’ ప్రజలు తమ సమస్యలపై గొంతెత్తకుండా ప్రభుత్వం పోలీసులను ఉపయోగించడం రాష్ట్రంలో ఎక్కువైంది. శాసనసభ, మండలి భవనాల ప్రారంభోత్సవం అనంత రం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతు న్నప్పు డు సభికుల మధ్య కూర్చొన్న ఒక మహిళ లేచి తనకు జరి గిన అన్యాయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆమెకు అక్కడున్న పోలీసులు ఆ అవకాశం లేకుండా చేశారు. దీనితో ఆమె నిరాశకు గురయ్యారు. కాగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణితో పాటు ప్రభు త్వ సీఎస్ అజయ్ కల్లం, డీజీపీ ఎన్. సాంబశివరావు, పలు వురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.