రేపు ఢిల్లీకి చేరుకోనున్న తెలుగు యాత్రికులు
ఉత్తరాఖండ్: వరదలలో చిక్కుకుని బయటపడిన 168 తెలుగు యాత్రికులు ఈ రోజు జోషిమఠ్ నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు రిషికేష్ లోని టీటీడీ ఆశ్రమానికి చేరుకోనున్నారు. టీటీడీ ఆశ్రమం నుంచి తెలుగు యాత్రికులు రేపు న్యూఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా అక్కడ కొండ చరియలు విరిగిపడటం, వరదలు సంభవించి చార్ దామ్ కు వెళ్లిన తెలుగు యాత్రికులు ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే.