breaking news
Telangana secretariat employees
-
నల్లధనంతో ఉద్యోగులకు ఏంటి సంబంధం..
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుభేరుల మాట పక్కన పెడితే.. సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. మొదటి రోజు నోట్ల మార్పిడికి బ్యాంకులకు క్యూ కట్టిన ప్రజలు.. శుక్రవారం నుంచి ఏటీఎమ్ ల వద్ద కొత్త నోట్లు అందుబాటులోకి రావడంతో రద్దీ పెరిగింది. తెలంగాణ సచివాలయంలో ఉన్న రెండు బ్యాంకుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. ఏటీఎమ్ లలో నగదు తీసుకునేందకు సచివాలయ ఉద్యోగులు క్యూ కట్టారు. నగదు డ్రా విషయంలో రూ.100 నోట్లు తీసుకునేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా కొందరు ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. కేంద్రం ఎవరిని దృష్టిలో పెట్టుకుని పెద్ద నోట్లను రద్దు చేసిందో అర్థంకావడం లేదన్నారు. నల్లధనంతో ఉద్యోగులకు ఏంటి సంబంధం.. తామేందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. రోజు వారీ కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు రూ.4 వేలకు మించి ఇవ్వమంటున్నారని.. నిన్న డ్రా చేసిన వారికి ఈ రోజు అవకాశం లేదనడం దారుణమన్నారు. తక్షణమే రోజువారీ నగదు డ్రా చేసుకునే మొత్తాన్ని పెంచాలి ఉద్యోగులు డిమాండ్ చేశారు. -
ఉద్యోగుల తోపులాట.. సచివాలయంలో ఉద్రిక్తత
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు నిరసనకు దిగారు. దిగ్విజయ్ సింగ్ ను గోబ్యాక్ అంటూ నినాదాలు చేయసాగారు. బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయానికి భారీ ర్యాలీగా తరలివచ్చారు. అయితే సీమాంధ్ర ఉద్యోగులు దిగ్విజయ్ దిష్టిబొమ్మను దహనం చేయడంపై తెలంగాణ ఉద్యోగులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరుప్రాంతాల ఉద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులకు పోటీగా తెలంగాణ నినాదాలు చేయసాగారు. ఎంతగా అదుపుచేసినా ఉద్యోగుల మధ్య ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు.