breaking news
TDP government
-
‘రాష్ట్రంలోని దుర్మార్గాలకు ఆద్యుడు నారా లోకేష్’
సాక్షి,తాడేపల్లి: రాజ్యాంగ ప్రకారం ప్రజల హక్కులను కాపాడుతూ.. రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన వెలగపండులా తయారయ్యాయని.. వైయస్సార్సీపీ స్టేటే కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృతరూపం బట్టబయలైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యమైందని.. కూటమి ప్రభుత్వం నేర స్వభావాన్నే రూల్ ఆఫ్ లా గా నడుపుతుందని మండిపడ్డారు. రెండేళ్లలోనే ఇంతటి దారుణమైన పాలన ఉంటే... రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే ప్రమాదముందని.. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, మీడియా వీటిని అధ్యయనం చేసి.. జరుగుతున్న దారుణాలను ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...రాష్ట్రంలో ప్రభుత్వం శూన్యం..2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రభుత్వం అన్నమాటకు నిర్వచనమే మారిపోయింది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం మెజారిటీ ప్రజల కోరికలు, ఆకాంక్షలన్నింటికీ ఫలానా పార్టీ పరిష్కరిస్తుందని ఎన్నుకుంటారు. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక భాగం అయితే రెండోది.. పరిపాలన. పాలనా పరమైన విధులన్నీ అధికారులు చేస్తున్నప్పుడు .. ప్రభుత్వం అవసరం ఎందుకంటే అది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మేనిఫెస్టోను అమలు చేస్తుంది. అదే ప్రజాస్వామ్యం. అది ఏ మేరకు నెరవేరుతుందన్నది వేరే విషయం. అలా అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక పద్దతి ప్రకారం నడవడానికి అవసరమైన మార్గదర్శకం ఇచ్చి నడిపే ఒక రాజకీయ వ్యవస్థ ఉంటుంది అనుకుంటే.. అది 2024 జూన్ తర్వాత ఈ రాష్ట్రంలో శూన్యం అయింది. పాలన గాలికొదిలేయడమో, లేక చేతకాని తనంతో చేయలేకపోవడమన్నది ఒక రకం. కానీ ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే... అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్లే దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ నేరస్వభావాన్నే ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తూ.. బ్యూరోక్రాట్స్ లో అలాంటి వాళ్లను దగ్గరకు తీసుకుంటున్నారు. కానివాళ్లను మెడలు వంచడమే, దూరం పెట్టడమే చేస్తుండడంతో వాళ్లు కూడా గత్యంతం లేక అదే దారిలో పయనిస్తున్నారు. ఇలా ఈ ఏడాది కాలంలో వ్యవస్థలను తమ నేర స్వభావాలకు అనుకూలంగా... తాము చేసే తప్పులకు ప్రొటెక్ట్ చేసేదిలా మార్చివేస్తున్నారు.టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ...మాజీ మంత్రి, వెనుకబడిన వర్గాలకు చెందిన బలమైన నాయకుడిగా ఎదిగిన జోగి రమేష్ ను ఏ తప్పు చేయకుండా అక్రమంగా అరెస్టు చేశారు. ఈ కేసు చూస్తే... నేరం జరుగుతున్న మొలకల చెరువు, ఇబ్రహీం పట్నం, అనకాపల్లి, ఏలూరులో నకిలీ మద్యం తయారీ చేస్తున్న చోట పోలీసులు పట్టుకున్నారు. నిన్నా, మొన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మా పాత్ర లేదు అని చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ సాక్షాత్తూ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ 2024 అభ్యర్ధి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ ఫ్యాక్టరీ బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రెండేళ్లు అవుతుంది. ఒకవైపు వైయస్సార్సీపీ నాయకుల తప్పు లేకపోయినా... వారిని అరెస్టులు చేస్తుంటే... రెండేళ్లుగా నకిలీ లిక్కర్ తయారీ మొత్తాన్ని వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ ఉన్నాడంటూ అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెట్టడంతో మొదలై... వైయస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తూ.. తప్పుడు స్టేట్ మెంట్లతో వేరేవాళ్లను అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో ఉంచారు.ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ నేతలపై కేసులు..పల్నాడు వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా తప్పుడు కేసులు నమోదు చేసారు. స్ధానిక టీడీపీ నాయకులు వాళ్ల మధ్య అంతర్గత కలహాలతో గొడవపడి జంట హత్యలు జరిగితే... దాని మీద ఎస్పీ కూడా ఇది టీడీపీ అంతర్గత విభేదాల వల్లే అని ప్రకటన ఇచ్చినా, ఘటనా స్ధలంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వాహనంతో సహా పలు ఆధారాలున్నా.. వైయస్సార్సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను జైల్లో పెట్టారు.ఇటీవల సోషల్ మీడియా యాక్టవిస్టు సవీంద్ర రెడ్డిను ఏదో పోస్టు పెట్టారని అరెస్టు చేసి.. కన్ఫషన్ కింద వేరకొటి నమోదు చేసి.. అదీ సరిపోదనుకుని ఏకంగా గంజాయి ప్యాకెట్ పెట్టి కేసు నమోదు చేశారు. అయితే అదృష్టవశాత్తూ అరెస్టు చేసిన టైమింగ్ ఆధారాలు, పోలీసులు చెప్పిన విషయాలు సరిపోలకపోవడంతో హైకోర్టు సీబీఐకి రిఫర్ చేయడంతో ఆయన బైటపడ్డాడు. అదే కేసులు మరికొంత యువకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.టీడీపీ నేతల తప్పులనూ వైఎస్సార్సీపీకి అంటగట్టే దుర్మార్గం..ఇక తునిలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంలో ఈ ఘాటుకానికి పాల్పడింది కూడా టీడీపీ నేతే. టీడీపీ నేతను పట్టుకుంటే... రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘాతుకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఆందోళన రావడంతో ఉలిక్కపడ్డ ప్రభుత్వం, పోలీసులు కస్టడీలో ఉన్న వ్యక్తి చెరువులో దూకి చనిపోయాడని పోలీసులు చెప్పారు. మరుసటి రోజు లైంగిక అకృత్యానికి పాల్పడ్డ వ్యక్తి కుమారుడు తన తండ్రి మరణంపై అనుమానం ఉందని కేసు పెట్టాడు. మరోవైపు మైనర్ బాలికపై లైంగిక అఘాయిత్యానికి పాల్డడ్డ వ్యక్తిని వీడియో తీసి... బాలిక చదువుతున్న స్కూల్ కి పంపిస్తే... దానికి అతనిపై చనిపోయిన వ్యక్తి కుమారుడు చేత ఫిర్యాదు తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. అందులో అదర్స్ అని రాయడం ద్వారా వైయస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేరం చేసిన వాళ్లకు సంబంధించి అనుమానాస్పదంగా చనిపోయాడని చెబుతూ... నిందితుల తరపున ఎందుకు వకాల్తా తీసుకున్నారు. వీరికి ప్రభుత్వ అండదండలు పూర్తిగా ఉన్నాయి. జోగి రమేష్ అరెస్టులో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో టీడీపీ నేతలే ఉన్నారు.. ఆధారాలు సైతం అక్కడే ఉంటే... ఇక్కడ విజయవాడలో జోగి రమేష్ ను అరెస్టు చేస్తున్నారు. తప్పుడు కేసు పెట్టడానికి కూడా జనం నమ్ముతారా ? కోర్టులో నిలబడుతుందా? అన్నది ఆలోచించడం లేదు. ఇవాల్టికి అరెస్టు చేసి.. రెండు మూడు నెలలు జైల్లో వేస్తే.. మిగిలిన విషయాలు తర్వాత చూసుకోవచ్చు అని భావిస్తున్నారు. నకిలీ లిక్కర్ కేసులో అసలు సూత్రధారి జయచంద్రా రెడ్డి, అతనే ఫ్యాక్టరీ పెట్టాడు, అతనికి సంబంధించిన బార్లలో నకిలీ లిక్కర్ అమ్మకాలు చేస్తున్నాడని పోలీసులే చెప్పారు. అతను సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, కానీ వారి అరెస్టులు మాత్రం ఉండవు.నకిలీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జయచంద్రా రెడ్డికి చంద్రబాబు బీఫామ్ ఇస్తున్న దృశ్యం చూస్తే.. జనరల్ గా బీపామ్ తీసుకున్నప్పుడు పక్కనే కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ జయచంద్రారెడ్డి పక్కనే ఆయన ఆత్మలా జనార్ధనరావు పక్కనే ఉన్నాడు. ఇది పక్కన పెట్టి.. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం జోగి రమేష్ తో ఏదో పెళ్లిలో జనావర్ధన రావు ఫోటో దిగితే దాన్ని ఆధారంగా చూపిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబుతో బీపామ్ తీసుకుంటున్న జయచంద్రా రెడ్డి, పక్కనే జనార్ధన రావు ఉంటే దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు. వీళ్లద్దరూ ఆఫ్రికాలో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వాస్తవానికి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ వ్యవహారం బయటపడ్డంతోనే రాష్ట్రంలో ఒక దుమారం చెలరేగింది. మద్యం సేవించే వారిలోనూ ఒక భయం మొదలైంది. దీన్ని డైవర్షన్ చేయడానికి.. సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవడం అలవాటైన చంద్రబాబు... తక్షణమే నకిలీ మద్యం వ్యవహారాన్ని జోగి రమేష్ వైపు తిప్పాడు. జోగి రమేష్ , వైయస్సార్సీపీకి దెబ్బ కొట్టడంతో పాటు, తన పార్టీ నేతలైన జయచంద్రారెడ్డి ఇతరులను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఆఫ్రికాలో ఉన్న జనార్ధన రావుతో ముందే మాట్లాడుకుని అతడ్ని ఇండియాకు తీసుకొచ్చారు. ఎయిర్ పోర్టులో జనార్ధరావు చొక్కా, పోలీసుల కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన పేరు మీద విడుదల చేసిన వీడియోలో చొక్కా రెండూ ఒకటే. ఇదెలా సాధ్యం. మరో కీలకమైన విషయం జనార్ధన రావు ఫోన్ దొరికితే అందులో జయచంద్రా రెడ్డితో పాటు టీడీపీ నేతల వివరాలు, వారి లావాదేవీలు బయటపడతాయి కాబట్టి ముంబాయిలో పోన్ పోయిందని చెప్పారు. ఆ తర్వాత జనార్ధన రావు ఒక వీడియో విడుదల చేశాడు. ఇది ఎలా అతుకుతుంది.ఆగని నకిలీ లిక్కర్ తయారీ...లిక్కర్ బాటిల్లు చూసి కొనండి.. క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించింది. అంటే నకిలీ లిక్కర్ తయారిని ప్రభుత్వం అంగీకరించింది. వైన్ షాపులలో క్యూ ఆర్ కోడ్ పెడతారు సరే.. బెల్టు షాపులలో ఏం క్యూఆర్ కోడ్ ఉంటుంది. అక్కడెలా నకిలీ లిక్కర్ ని నియంత్రిస్తారు. రాష్ట్రంలో లక్షకు పైగా బెల్టు షాపులున్నాయి. వీటి ద్వారా ఈ నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. ఇవి కాక వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చారు. అక్కడ లూజ్ సేల్ ఉంటుంది. అంటే అక్కడ కూడా నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోడా మిషన్లు మాదిరిగా కూటమి పాలనలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. దానికి సాక్ష్యం బెల్టు షాపుల్లో జరుగుతున్న అమ్మకాలే. ప్రభుత్వానికి అంతంత మాత్రం ఆదాయం పెరిగింది. లిక్కర్ అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఇదే నిదర్శనం. జోగి రమేష్ అరెస్టు అత్యంత దుర్మార్గం, అన్యాయం. నియంతల పాలనలో కూడా లేనంతగా వ్యవస్దలను కూటమి ప్రభుత్వం కంట్రోల్ చేసి... హిట్లర్ కంటే దారుణంగా పాలన సాగిస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఈ దారుణాలన్నీ కొనసాగిస్తున్నాడు.తప్పులు నిలదీస్తే కేసులు - నారా వారి రూల్ ఆఫ్ లా...కేవలం తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా, పూర్తి స్పృహతోనే, క్రూరమైన, అణిచివేత ధోరణితో కూడిన పాలన సాగిస్తున్నారు. ప్రత్యర్థుల వాయిస్, ప్రజల ఆకాంక్షలు బయటకు వినిపించకుండా గొంతు నొక్కడంతో పాటు వీరి చేస్తున్న దుర్మార్గాలను ఎదుట వాళ్ల మీద నెట్టడంలో వీళ్లు సిద్ధహిద్దులు. లోకేష్ వీటన్నింటికీ ఆద్యుడు. ముందు అరెస్టు చేసి.. సెల్ఫ్ కన్ఫెషన్ పేరుతో వారే స్టేట్ మెంట్లు తయారు చేస్తున్నారు. కోర్టుల్లో నిలబడినా, లేకున్నా ముందుగా జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ కేసు తీసుకున్నా మూడు అంశాల మీదే నడుస్తుంది. తామనుకున్న వారిని అరెస్టు చేయడం, వారి పేరు మీద స్టేట్మెంట్ రాసుకోవడం, ఎవరి మీద వాళ్లకు కోపం ఉంటే.. వాళ్ల స్ధాయిలను బట్టి వారి పేర్లు కూడా కేసులో చేర్చడం పనిగా మారింది. ఇలా నెలల తరబడి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది నారా వారి కొత్త రూల్ ఆఫ్ లా. కన్ఫెషన్ పేరుతో అరెస్టు చేయడం, తమకు నచ్చిన సెక్షన్లతో కేసు నమోదు చేయడం అలవాటుగా మారింది. అరెస్టు చేసిన తర్వాత వాళ్ల ఇంట్లో సోదాలు చేసి... అక్కడ పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు చూపిస్తున్నారు. అవి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తమకు కావాల్సిన అధారాలను వీళ్లే అక్కడ పెట్టి.. వాటినే కోర్టులో ఎవిడెన్స్ గా పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి.నిష్పాక్షపాతంగా దర్యాపు చేయడానికి ఇన్వెస్టిగేషన్ అధికారికి చట్టానికి లోబడి ఇచ్చిన వెసులుబాటును పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. కోర్టులు కూడా ఆమాత్రం వెసులు బాటు ఇవ్వకపోతే దర్యాప్తు ఎలా ముగుస్తుందని అనుకుంటున్న పరిస్థితి. దానివల్ల నేరం చేయకుండా కూడా అధికారంలోకి ఉన్నవాడికి నచ్చకపోతే శిక్షకు గురవుతావన్నది రుజువు అవుతుంది. శిక్ష కరారు కాకముందే.. నిందితుడు 50 రోజులో, 60 రోజులో... ఏ నేరం చేయకున్నా, ఆధారాలు లేకున్నా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. ఈ కేసులో నిజానికి ఇంకా రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ జరుగుతున్న మాట వాస్తవం. ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరిస్తుంది కాబట్టే... లిక్కర్ షాపులలో మద్యం బ్యాటిళ్లకు క్యూ ఆర్ కోడ్ పెట్టింది. దీన్ని అందరూ గమనించాలి.ప్రజా రక్షణ పట్టని ప్రభుత్వమిదికాశీబుగ్గ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రమాదం అంటేనే అకస్మాత్తుగా జరుగుతుంది. ఎవరూ ప్రమాదాలు జరుగుతాయని ముందే ఊహించరు. కానీ ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పోలీసులదే. కాశీబుగ్గ ఘటన జరిగిన వెంటనే అధికార తెలుగుదేశం పార్టీ మంత్రులు మాకు సంబంధం లేదు.. అది ప్రైవేటు దేవాలయం అని ప్రకటించారు. ఘోరం జరిగిన వెంటనే అది మాది కాదు అన్నారంటే.... తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే. సిగ్గున్న ప్రభుత్వం ఇలా చేస్తుందా? ఏ మాత్రం బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం ఇలా చేస్తుందా? ప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపడుతున్నారంటే.. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, సింహాచలంలో ప్రమాదం జరిగింది ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. కారణం మీ ప్రాధాన్యాతలు వేరు. బాథ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావించడం లేదు. వ్యవస్ధలో పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా... దాన్నుంచి తప్పించుకోవడంతో పాటు పక్కవారిమీదకు నెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆలయ ధర్మకర్త తాను ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. ఒకవేళ చెప్పకపోయినా.. రెండేళ్ల నుంచి నిర్వహణలో ఉన్న ఆలయంలో పవిత్ర దినం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న విషయం తెలియదా? పలాస లాంటి పట్టణంలో ఒకే దగ్గర అంత పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటే నాకు తెలియదని ఎలా తప్పించుకుంటారు ? చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న ప్రచార సాధనాల బలం తలకెక్కడంతో దేన్నీ పట్టించుకోవడం లేదు. ఏం జరిగినా ఎదుట వాళ్లదే తప్పు అని చెప్పడం పరిపాటిగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయడమో.. సంబంధిత అధికారులను బాధ్యులను చేయకుండా... విచారణ చేయకుండానే, అసలేం జరగలేదని ముందే చెబితే ఇది ఏ రకమైన పాలన? ఎక్కడైనా సమస్య వచ్చినా పోలీసులో, అధికారులో చూసుకుంటారు, వారికి ఆ మేరకు అవగాహన ఉంటుందని ప్రజలు భావిస్తారు. ధైర్యంగా ఉంటారు. అలా ఉండే వారిని కూడా ప్రభుత్వం నీరుగార్చుతుంటే... ఇలాంటి పాలనే ఉంటుంది.రెండేళ్లలోనే రాష్ట్రంలో ఇంతటి దారుణంగా ఉంటే రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో జరుగుతున్న దారుణాలను మీడియా, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు స్టడీ చేసి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వమే తప్పు చేసి ఎదుట వారి మీద కేసులు పెట్టి.. ఆ తప్పును కొనసాగించడం మరింత దారుణమని మండిపడ్డారు -
దేవుడా.. మరో ఘోరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి నెట్వర్క్: మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు.. నిన్న సింహాచలంలో గోడ కూలి ఏడుగురు.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఘటనకు ప్రధాన కారణం అని స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయానికి కార్తీక ఏకాదశి రోజున వేలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా బందోబస్తు ఇవ్వలేదు. ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్తే అక్కడ వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తారు. ఈ క్రమంలో దర్శనానికి వెళ్లే వారు.. దర్శనం చేసుకుని బయటకు వచ్చే వాళ్లతో ప్రవేశ మార్గం (రాకపోకలకు ఒకే మెట్ల మార్గం) కిక్కిరిసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో ఉదయం 11.45 గంటల సమయంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. తీవ్ర గందరగోళం ఏర్పడింది. కేకలు.. ఆర్తనాదాలు.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. ప్రాణ భయంతో మిగితా వారు కింద పడిన వారిని తొక్కుకుంటూ బయటకు వెళ్లడానికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో భక్తుల ఒత్తిడి కారణంగా కుడి వైపు రెయిలింగ్ ఒరిగిపోయింది. దీంతో క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. దీంతో కింద పడిపోయిన వారిలో ఊపిరి ఆడక తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరికొంత మంది మెట్లపై నుంచి కిందకు దూకి గాయపడ్డారు. కింద పడిపోయిన తర్వాత వృద్ధులు, పిల్లలు లేచేందుకు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని.. ‘అమ్మా.. అయ్యా.. ఊపిరి అందడం లేదు.. మీకు దండం పెడతా.. చచ్చిపోతున్నా.. ఎవరైనా కాపాడాలంటూ..’ ప్రాధేయపడి అడుగుతున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితే లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశం క్షమార్హం కాని ప్రభుత్వ నిర్లక్ష్యంఈ ఆలయానికి కొంత కాలంగా ప్రతి శనివారం వేలాది మంది భక్తులు వస్తారనే విషయం అందరికీ తెలుసు. పైగా శనివారం కార్తీక ఏకాదశి. ఈ దృష్ట్యా భక్తులు మరింతగా తరలి వస్తారని ఎవరూ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా పర్వదినాల్లో, కార్తీక మాసంలో ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకునేలా దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పడానికి ఈ ఘోర ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చినా పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. పైన ఉన్న ఆలయంలో మామూలుగా 2000 మంది భక్తులు ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఘటన జరిగే సమయానికి అంతకు రెండు మూడు రెట్లలో భక్తులు ఉన్నారు. వారంతా ఒక్కసారిగా కిందకు రావడానికి ప్రయత్నించడంతో మెట్లపై తోపులాట చోటు చేసుకుంది. వారు కిందకు రాకుండా నియంత్రించి ఉంటే ఇంతగా ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని, ఇలా జరగడానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని భక్తులు మండిపడుతున్నారు. మార్చురీ వద్ద పోలీసులతో వాగ్వాదం చేస్తున్న మృతుల బంధువులు తొలుత స్పందించిన వైఎస్సార్సీపీ నేతలువిషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి సీదిరి పలువురికి సీపీఆర్ చేశారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష సంఘటనా స్థలానికి చేరుకోగా, కొంత సమయం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు వచ్చారు. అనంతరం మృతదేహాలను తరలించే చర్యలు చేపట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి పోలీస్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆలయం, ఆస్పత్రితో పాటు పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు, క్షతగాత్రుల కేకలతో ఆస్పత్రి దద్దరిల్లింది. డీఐజీ గోపినాథ్ జెట్టి ఆస్పత్రి వద్దకు చేరుకుని పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ తదితరులు ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి మంత్రి లోకేశ్ వచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు మృతులు, క్షతగాత్రుల బంధువులు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీషను నిలదీశారు. ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదట!ఏకాదశి కావడంతో 20 వేల నుంచి 25 వేల మంది ఒక్కసారిగా వచ్చారని అంచనా. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. రహదారిపై 10–20 మంది నిరసన తెలపడానికి వస్తే.. వెంటనే ఆంక్షల పేరిట పెద్ద సంఖ్యలో పోలీసులు వాలి పోవడం చూస్తుంటాం. అలాంటిది ఏకాదశి రోజున వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులు తరలి వచ్చారని తెలిసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం దారుణం అని భక్తులు మండిపడుతున్నారు. ఘటన జరిగిన తర్వాత వందల సంఖ్యలో పోలీసులను పెట్టి లాభమేమిటని ప్రజలు నిలదీస్తున్నారు. 20 మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. క్షతగాత్రులను తరలించేందుకైనా.. మృతదేహాలను పక్కకు తీసేందుకైనా ప్రభుత్వ యంత్రాంగమెవరూ చాలా సేపటి వరకు అక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఘటన తర్వాత భక్తుల సంఖ్యపై వేర్వేరు ప్రకటనలు చేశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దాదాపు 20 వేల మందికిపైగా భక్తులు వచ్చారని చెబుతున్నారు. అసలు ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదని చెప్పుకొచ్చారు. ఇలా గందరగోళ ప్రకటనలు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగా, మృతుల బంధువులు, క్షతగాత్రులకు ఏదైనా సాయం కావాలంటే 08942–240557 నంబర్‌కు సంప్రదించాలని అధికారులు తెలిపారు. పోలీసు దిగ్బంధంలో సీహెచ్‌సీ ఈ దుర్ఘటనలో మరణించినవారి మృతదేహాలను ఉంచిన కాశీబుగ్గ కమ్యూనిటీ హాస్పిటల్(సీహెచ్‌సీ) వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మృతుల బంధువులు అక్కడ ఆందోళన చేయకుండా చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన చేస్తుండగా పోలీసులు బలవంతంగా తరలించారు.మృతుల వివరాలు1. ఏదూరి చిన్నమ్మి (50), రామేశ్వరం, టెక్కలి మండలం2. రాపాక విజయ (48), పిట్టలసరియా, టెక్కలి మండలం3. మురుపింటి నీలమ్మ (60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు మండలం4. దువ్వు రాజేశ్వరి (60), బెల్లుపటియా, మందస మండలం5. లొట్ల నిఖిల్ (13), బెంకిలి, సోంపేట మండలం6. డొక్కర అమ్ములమ్మ (54) పలాస–కాశీబుగ్గ7. చిన్ని యశోదమ్మ (56), శివరాంపురం, నందిగాం మండలం8. బోర బృంద (62), మందస9. రూప (52) గుడ్డిభద్ర, మందస మండలంతల్లికి కడుపుశోకంసోంపేట: కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనలో బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్(12) మృతిచెందడంతో అతని తల్లి అనుకు తీరని కడుపుశోకం మిగిలింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. నిఖిల్‌కు చిన్నతనం నుంచే వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. జింకిబద్ర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. దీపావళి నుంచి బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో గోవిందుని నగర సంకీర్తనల్లో పాల్గొంటున్నాడు. ఆరేళ్లుగా కార్తీక సంకీర్తనల్లో పాలుపంచుకుంటున్నాడు. శనివారం వేకువజామున గ్రామంలోని శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం అనంతరం భక్తులతో కలిసి సంకీర్తన చేశాడు. ఉదయం 9 గంటలకు అమ్మ అనుతోపాటు, అక్క, మరికొందరితో కలిసి కాశీబుగ్గ వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పలాస ప్రభుత్వాస్పత్రి వద్ద అపస్మారకస్థితికి వెళ్లింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నిఖిల్ తండ్రి పాపారావు సోంపేట లోకనాథేశ్వర కలాసీ సంఘంలో కలాసీగా పనిచేస్తున్నారు.మృతులంతా సామాన్యులే⇒ సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన బాలుడు నిఖిల్ తండ్రి పాపారావు కలాసీగా పని చేస్తున్నాడు. ⇒ టెక్కలి మండలం పిట్టలసరియా గ్రామానికి చెందిన రాపాక విజయ వ్యవసాయ కూలీ. ఈమె భర్త చిన్నారావు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు.⇒ టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన యేదూరి చిన్నమ్మి భర్త గణపతిరావు మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.⇒ వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేట గ్రామానికి చెందిన మురిపింటి నీలమ్మ గృహిణి. భర్త కన్నయ్య మృతి చెందడంతో కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం బెల్లుపటియా గ్రామానికి చెందిన దువ్వు రాజేశ్వరి వ్యవసాయ కూలీ. ⇒ నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన చిన్ని యశోదమ్మ వృద్ధురాలు. కుటుంబం వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. ఈమె ఇంటి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రూపది నిరుపేద కుటుంబ. ⇒ మందస గ్రామానికి చెందిన బోర బృందావతి భవన నిర్మాణ కార్మికురాలు.⇒ పలాస గ్రామానికి చెందిన డొక్కరి అమ్ములమ్మ సామాన్య గృహిణి. ఇప్పుడు ఏం చే ద్దామని వచ్చారు?మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే శిరీషపై బాధితుల మండిపాటు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఇప్పుడు మీరు ఎందుకొచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? చీమ చిటుక్కుమంటే తెలుసుకునే మీరు ఇక్కడికి ఇంత మంది భక్తులు వచ్చారని ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయారు? ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా.. ఇక్కడ కనీసం ఒక్క పోలీసు అయినా లేరు. పట్టించుకునే వారే లేరు. వేలాది మంది భక్తులు వస్తే ఇలా చేస్తారా? ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా సేపటి వరకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు.. కనీసం వైద్యులు, అంబులెన్స్ అయినా పంపలేదు. అచ్చెన్నాయుడు, శిరీషలను ప్రశ్నిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు మీ తీరు ఏం బాగోలేదు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులు, గాయపడ్డ వారు, ఇతర భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అనంతరం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శిరీష ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడే మృతదేహాల వద్ద రోదిస్తున్న వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లగా మంత్రిని చూసి బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగిందని గట్టిగా నిలదీశారు. బాధితులు వేసే ప్రశ్నలకు మంత్రి, ఎమ్మెల్యే సమాధానం చెప్పలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయారు.ఆపద్బాంధవుడు సీదిరి అప్పలరాజుపలువురి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రివజ్రపుకొత్తూరు రూరల్: ఆలయంలో జరిగిన తోపులాట ఘటనలో గాయపడిన వారికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అత్యవసర సేవలు అందించారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన స్వతహాగా వైద్యుడు కావడంతో తొక్కిసలాటలో ఊపిరి తీసుకోలేకపోతున్న వారిని, స్పృహ తప్పిన వారిని గుర్తించి సీపీఆర్ చేశారు. వృత్తి ధర్మం పాటిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. తోపులాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళలకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలపడంతో పాటు, అంబులెన్స్‌ను రప్పించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పలరాజు స్ఫూర్తితో పక్కనున్న వారు సైతం గాయపడ్డ వారికి సేవలందించారు. -
ఛలో విజయవాడకి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల పిలుపు
సాక్షి,విజయవాడ: ఛలో విజయవాడకి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు పిలుపునిచ్చాయి. ఈ నెల 23వ తేదీన మహాధర్నా చేపట్టనున్నట్లు ఆశా ప్రకటించింది. 10వ తేదీ నుండి నెట్ వర్క్ ఆసుపత్రులు సమ్మె కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం రూ.2700 కోట్ల రూపాయిల బకాయిలు విడుదల చేయాలని సమ్మె బాట పట్టాయి. సమ్మెబాట పట్టి 10 రోజులు దాటిన ప్రభుత్వం పట్టించుకోలేదు.దీంతో ఆగ్రహానికి గురైన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఛలో విజయవాడ సమ్మెలో ఆసుపత్రి యాజమాన్యాలతో పాటు సిబ్బంది పాల్గొననున్నారు.మరోవైపు, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వైద్యం అందక తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నా.. కూటమి ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్క్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సాక్షి బ్యాన్.. TDPపై సుప్రీం సీరియస్
-
దొడ్డిదారి బదిలీలు!
మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ హైసూ్కల్లో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్న హెచ్ఎం వెంకటేశ్వరరావును బదిలీ చేసి తాడికొండ మండలం పొన్నెకల్లు జెడ్పీ హైసూ్కల్కి పంపించారు. ఆ స్థానంలో కృష్ణాజిల్లా పెనమలూరు జెడ్పీ హైసూ్కల్ గ్రేడ్–2 హెచ్ఎం దుర్గాభవానికి పోస్టింగ్ ఇచ్చారు. ఆదివారం సెలవు అయినప్పటికీ ఆమె నిడమర్రు స్కూల్‌కు వచ్చి బాధ్యతలు తీసుకున్నారు.ఇదేమీ అంతర్ జిల్లా బదిలీ అనుకునేరు! కేవలం సిఫారసు లేఖతో జరిగిందే. ఇలా ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి సిఫారసు బదిలీలు చేసినట్టు సమాచారం. గతంలో సిఫారసు బదిలీలు జరిగినా ఖాళీస్థానాల్లో మాత్రమే అవకాశం ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా రెండున్నరేళ్ల సర్వీసు ఉన్నవారిని బలవంతంగా పంపించేసి తమకు కావాల్సిన వారికి పోస్టింగ్ ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు తెరతీశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలు ఉన్నవారిని వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలో మే/జూన్ నెలలో జరిగిన బదిలీల్లో వచ్చినవారిని సైతం బలవంతంగా మరోచోటుకు పంపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తాజాగా అన్ని జిల్లాల్లోను 150 మందికిపైగా ఉపాధ్యాయులను మార్చినట్టు తెలుస్తోంది. మరో 2 వేలమంది ఉపాధ్యాయులు తమ నియోజకవర్గ ముఖ్యనేతల లేఖలతో బదిలీకి సిద్ధంగా ఉన్నట్టు అంచనా.తాజా బదిలీలు ఉపాధ్యాయ బదిలీ చట్టం మేరకే చేసినట్టు చెబుతున్నా.. పూర్తిగా సిఫారసు లేఖలు, నగదు కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏటా జూన్‌లో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలుంటాయని, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పూర్తి పారదర్శకతతో బదిలీలు చేపపట్టేందుకు ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిప్రకారం ఈ ఏడాది ఉపాధ్యాయ బదిలీ చట్టం కూడా తీసుకొచ్చారు.అయితే.. అవసరం అనుకుంటే ప్రభుత్వం ఎవరినైనా ఎప్పుడైనా బదిలీ చేయవచ్చన్న నిబంధన కూడా ఇందులో పొందుపరిచారు. దీని ఆధారంగానే కూటమి ప్రభుత్వం ‘సిఫారసు బదిలీ’లు చేపట్టినట్టు తెలుస్తోంది. నిడమర్రులో వెంకటేశ్వరరావు ఇంకా రెండున్నరేళ్లు పనిచేసే అవకాశం ఉన్నా బలవతంగా బదిలీచేసి, కృష్ణాజిల్లా టీచర్‌ను అక్కడ నియమించడంపై ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి. బదిలీకి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు!రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉపాధ్యాయుల సిఫారసు బదిలీలకు రంగం సిద్ధం చేశారు. జిల్లాల నుంచి కూటమిలోని ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు కావాల్సిన టీచర్లకు, డబ్బులిచి్చన వారికి కోరుకున్న చోటుకు బదిలీ కోసం లేఖలిచ్చి సిఫారసు చేశారు. ఇలా దాదాపు రెండువేలకు పైగా దరఖాస్తులు విద్యాశాఖకు చేరినట్టు అంచనా. ఒక్కో బదిలీకి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్టు ఉపాధ్యాయులే చెబుతున్నారు. అయితే.. వెంటనే బదిలీలు చేస్తే ఉపాధ్యాయవర్గాల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతుందని భావించిన ప్రభుత్వం.. సిఫారసు బదిలీలకు చట్టం ముసుగు వేసింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం–2025’ చేసింది. ఇందులో సంవత్సరానికి ఒకసారి మాత్రమే బదిలీలుంటాయని చెబుతూ, అభ్యర్థన/పరస్పర/అంతర్ జిల్లా/అంతర్రాష్ట్ర బదిలీలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. అంటే సిఫారసు లేఖల కోసమే ఈ నిబంధన పెట్టినట్టు అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఆ నిబంధనను తొలగించాలని పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ నిబంధనే తమ నెత్తిన కుంపటిలా మారిందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో బదిలీపై కొత్త స్కూళ్లకు వెళ్లిన వారు సైతం ఎప్పుడు ఎవరి స్థానం మారుతుందోనని ఆందోళనగా ఉన్నట్లు తెలిసింది. -
టీడీపీ నేత గుప్పెట్లో రెవెన్యూ వ్యవస్థ
-
మీరు ఎంత అణగదొక్కలని చూస్తే అంత తిరగబడతారు..
-
బాబు సర్కార్ అంతానికి ఆరంభం ఇదే..!
-
నేను టీడీపీ వాడినే.. చంద్రబాబును ఏకిపారేసిన రైతులు
-
బాబు సర్కారుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం... చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్‌లో ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’ పేరిట ప్రతిఏటా 350 కోట్ల రూపాయల ప్రజాధనానికి టెండర్... కుప్పంలో ప్రారంభమైన పైలెట్ ప్రాజెక్టు
-
మంత్రి అవినీతి బండారాన్ని బయటపెట్టిన అధికారి
-
దివ్యాంగులకు పింఛన్లు కట్ నోటీసులు
-
దివ్యాంగుల జీవితాల్లో పింఛను చిచ్చు... అనర్హులని పేర్కొంటూ పింఛను నిలిపివేస్తున్నట్టు ఏపీలో కూటమి ప్రభుత్వం నోటీసులు
-
KSR Comment: ఒక్క హామీ..100 కండిషన్లు.. పోయాం మోసం
-
మహాత్ముడు తెచ్చిన స్వాతంత్య్రం బాబు మంటల్లో కలిపారు
-
నన్ను అరెస్ట్ చేస్తారేమో.. బైరెడ్డి సెటైర్లు..
-
అడ్డదారిలో గెలవడమే బాబు సిద్ధాంతం
-
సాక్షి టీవీ కేసులో.. బాబు సర్కార్ కు సుప్రీం నోటీసులు
-
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడి హేయమైన చర్య: మేయర్ డాక్టర్ శిరీష
-
రండి.. దోచుకోండి! కార్పొరేట్ సంస్థలకు బాబు బంపరాఫర్
-
ఏం చేస్తారో చేసుకోండి.. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకొక్కడికి..
-
ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వేధింపులు... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం... వేధింపులకు గురైన వారి కోసం త్వరలో ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు వెల్లడి
-
రెడ్ బుక్ ప్రకారం బెదిరించి వాంగ్మూలాలు తీసుకుంటున్న పోలీసులు
-
నిలువెల్లా విషం.. సిట్ పేరుతో చిల్లర కుట్రలు
-
బాబు రెండు కళ్ల సిద్ధాంతం.. రాయలసీమపై గురుశిష్యుల కుట్ర
-
Big Question: సైకోలను ఇక సహించం.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
-
ఇంకా మూడేళ్లు.. కళ్లు మూసుకుంటే బాబు ఎగిరిపోతాడు..!
-
బొజ్జలను సేవ్ చేసేందుకు తమిళనాడు పోలీసులపై బాబు ఒత్తిడి
-
ఢిల్లీ హైకోర్టులో బాబుకు మొట్టికాయలు
-
TV5, మహా న్యూస్, ఈనాడు.. పాత్రికేయ ముసుగులో పచ్చ వ్యభిచారం
-
అమరావతిలోని భూ కేటాయింపుల్లో ప్రభుత్వ పెద్దల దమననీతి
-
ఓటమి గ్యారంటీ! చంద్రబాబుకు సర్వేల షాక్..
-
కాయలు పారబోశారని కేసులు.. రైతులపై అక్రమ కేసులు నమోదు చేసిన పోలీసులు
-
జగన్ దెబ్బకు దిగొచ్చిన కూటమి.. పెరిగిన మామిడి మద్దతు ధర
-
Political Corridor: కూటమి ఏడాది పాలనపై సర్వే.. దిమ్మదిరిగే షాకిచ్చిన ప్రజలు
-
జగన్ 2.0 దగ్గర్లోనే ఉంది.. కాకినాడ YSRCP నేతలు ఫైర్..
-
జగన్ భద్రతపై కుట్రలు.. హైకోర్టు చివాట్లు పెట్టినా మారని బాబు
-
చేతకాకపోతే దిగిపోండి.. మంత్రులకు బాబు వార్నింగ్
-
మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. టీడీపీని ఏకిపారేసిన పేర్ని నాని
-
కూటమి సర్కార్ కు వైఎస్ జగన్ హెచ్చరిక
-
రైతుకు గడ్డు కాలం.. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు... చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
బాబు మాకొద్దు.. జగన్ వస్తేనే మా జీవితాలు బాగుంటాయి
-
జగన్ పర్యటనకు వెళ్తే.. రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం..!
-
సర్కారు బడులు మాకొద్దు బాబోయ్
-
మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం?..
-
చినిగిపోతున్న లోకేష్ రెడ్ బుక్.. AP పోలీసులకు హెచ్చరిక
-
బాబు సర్కార్ కు వ్యతిరేకంగా భారీ నిరసన
-
లోకేష్ రెడ్ బుక్ పతనం స్టార్ట్
-
ABN,టీవీ 5 ఇది మిస్ అవ్వకండి.. రికార్డ్ చేసి పంపించండి.. బొత్స కౌంటర్
-
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.. ఉద్యోగ సంఘాలు డిమాండ్
-
రాజధాని అప్పులు పక్కదారి.. బాబుకు షాకిచ్చిన ప్రపంచ బ్యాంక్
-
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల రెడ్‌బుక్ అరాచకాలకు హైకోర్టు రెడ్‌సిగ్నల్
-
ఇండోసోల్ పై కుట్ర
సాక్షి, అమరావతి: ఇండోసోల్ యూనిట్‌పై కూటమి సర్కారు కుట్ర మరోసారి బహిర్గతమైంది. ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టుపై విషం కక్కిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అడ్డంకులు సృష్టించింది. ఇప్పటికే ఉత్పత్తికి అన్ని విధాలా సిద్ధమైన ఇండోసోల్ యూనిట్‌ను రైతుల ఆమోదయోగ్యం లేని మరో చోటుకు తరలించడం ద్వారా మొత్తం ప్రాజెక్టునే గందరగోళంలోకి నెట్టేసింది. గత ప్రభుత్వం చేవూరు, రావూరు మండలాల్లో ఎటువంటి వివాదం లేని, పంటలు పండని 5,148 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇప్పుడు దాన్ని రద్దు చేసి, రైతుల ఆమోదయోగ్యం లేని రెండు పంటలు పండే భూమిని కేటాయించడం ద్వారా వివాదం రాజేసింది.గత ప్రభుత్వం ఇండోసోల్ కోసం రైతులను ఒప్పించి, ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా భూ సేకరణ పూర్తి చేస్తే, ఇప్పుడు ఈ భూమిని ప్రభుత్వం ఇవ్వనంటోంది. దీనికి ప్రతిఫలంగా కారేడు, ఉలవపాడు మండలాల్లో 8,348 ఎకరాలను సేకరించి ఇస్తానంటోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉలవపాడు మామిడి, రెండు పంటలు పండే భూమిని కేటాయించడం ప్రభుత్వ దురుద్దేశాన్ని బహిర్గతం చేస్తోంది. చేవూరు, రావూరు వద్ద భూసేకరణ కోసం గత ప్రభుత్వ హయాంలోనే ఇండోసోల్ రూ.500 కోట్లు చెల్లించింది. 114 ఎకరాల్లో తొలి దశ కింద ఒక గిగావాట్ సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేసి ఉత్పత్తికి సిద్ధంగా ఉంది.విస్తరణ కోసం ఇప్పటికే రూ.1,200 కోట్లతో డిజైన్లు, పరికరాలు, మౌలిక వసతులను కల్పించింది. ఇప్పుడు భూ మారి్పడితో మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. 114 ఎకరాల్లో ఉన్న యూనిట్‌ను ఇక్కడే కొనసాగిస్తూ మిగిలిన విస్తరణ పనులను కారేడు, ఉలవపాడులో కొనసాగించమని చెప్పడంపై పారిశ్రామికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఎంపిక చేసుకున్న పనులు ప్రారంభించిన తర్వాత యూనిట్‌ను ఎలా తరలిస్తారని వారు ప్రశి్నస్తున్నారు. రూ.76,033 కోట్ల పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ కంపెనీ అయిన ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.76,033 కోట్ల పెట్టుబడితో 13,200 మందికి ఉపాధి కల్పించేలా విశాఖలో 2023లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్æ (జీఐఎస్)లో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు సమీపంలో రూ.42,040 కోట్ల వ్యయంతో సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 20 గిగా వాట్ల పాలీసిలికాన్, 15 గిగావాట్ల వేఫర్స్, 10 గిగావాట్ల పీవీ మ్యాడ్యూల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ ద్వారా పరోక్షంగా మరో 8,000 మందికి ఉపాధి లభించనుంది.ఈ యూనిట్‌కు కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) కింద రూ.1,875 కోట్ల మేర అనుమతులు కూడా లభించాయి. దిగుమతులు తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ పథకం ద్వారా యూనిట్ ఏర్పాటు చేసి, ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. దీనికి భిన్నంగా కూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఇప్పుడు ఏకంగా పచ్చని పంట పొలాలను కేటాయించి కొత్త వివాదాన్ని సృష్టించింది. తద్వారా ప్రాజెక్టుకు పూర్తిగా అడ్డంకులు కల్పిస్తోంది. -
చనిపోయిన వారిని కూడా బదిలీ చేసిన సర్కారు
-
తల్లికి వందనం వేస్తారా లేదా? విద్యుత్ పోలెక్కి నిరసన
-
బాబుకు హైకోర్టు షాక్.. మీ ఇష్టమొచ్చినట్టు అరెస్టులు చేస్తే కుదరదు
-
రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటున్న రైతులు
-
ఈ ఘటన చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. ఎంపీ తనుజారాణి ఎమోషనల్
-
వైఎస్ జగన్ ను కలవొద్దని మామిడి రైతులను కూటమి నేతలు బెదిరిస్తున్నారు
-
ఏపీలో నరకాసుర పాలన: పేర్ని నాని
-
అమ్మకానికి అమరావతి.. సర్కారు వారి పాట ఎకరా 30 కోట్లు..!
-
కాళ్లతో తొక్కేసి.. జుట్టు పట్టుకొని ఈడ్చేసి..! వైద్యులపై పోలీసుల జులుం
-
హత్య వెనుక లోకేష్? సింగయ్య భార్య సంచలనం..!
-
సింగయ్య మృతిపై బయటికొస్తున్న నిజాలు టెన్షన్ లో బాబు, లోకేష్
-
కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనను ఎండగట్టిన హైకోర్టు
-
ఏపీలో ఉద్యోగం చేయాలంటేనే బెదిరిపోతోన్న ఐఏఎస్, ఐపీఎస్ లు
-
ఘటన జరిగిన రెండేళ్లకు కేసు నమోదు చేయడం ఏమిటి?... వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య... బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం
-
మెడికల్ విద్యార్థులపై పోలీసులతో దాడి చేయిస్తారా: YS జగన్
-
ఏపీలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది: వైఎస్ జగన్
-
బాబుకు జగన్ క్యూఆర్ కోడ్ వణుకు
-
ఇదేం కర్మరా బాబు
-
బాబుకు షాకిచ్చిన హైకోర్టు
-
దొంగలు, దొంగలు పంచుకుంటున్నారు
-
నేను టీడీపీని వీడటానికి కారణం.. చంద్రబాబు బండారం బయటపెట్టిన సుగవాసి
-
Watch Live: జగన్ కి ఏంటి సంబంధం.. సింగయ్య ఘటనపై హైకోర్టు..
-
మరో దోపిడీకి బాబు భారీ స్కెచ్
-
సీఎం గారి భూతవైద్యం
-
గవర్నర్ కు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
-
హైకోర్టులో విచారణ జరుగుతున్నా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులా?... టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించటంపై వైఎస్ జగన్ ఫైర్
-
బాబు ఏడాది పాలనంతా.. మోసం.. దగా.. డైవెర్షన్
-
Magazine Story: ఏపీలో రెడ్ బుక్ ఎమర్జెన్సీ
-
జగన్ భద్రతపై నారా వారి కుట్రలు.. పక్క ఆధారాలతో...
-
జగన్ కు ప్రాణహాని.. బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్.. తరువాత జరగబోయేది ఇదే!
-
జగన్ పై కుట్ర.. టీడీపీ ఆఫీస్ నుంచే ప్లాన్
-
బాబు మోసాలపై.. జగన్ యాక్షన్ ప్లాన్
-
జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్.. అదిగో కుట్ర - ఇదిగో సాక్ష్యం..
-
నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ?
-
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఇంటర్వ్యూల్లో గూడు పుఠాణీ... అంతా గుంభనంగా!
-
Watch Live: కూటమి సర్కార్ పై YSRCP యువత పోరు
-
కూటమి కుట్ర.. ప్రెస్ మీట్ లో మాట మార్చిన ఎస్పీ సతీష్
-
వైఎస్ జగన్ పై అక్రమ కేసు నమోదు కోసం కూటమి ప్రభుత్వ కుతంత్రం
-
వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నేడు 'యువత పోరు'
-
సింగయ్య మృతి ఉదంతంలో ఏ1 చంద్రబాబు ప్రభుత్వమే..!
-
10 లక్షల కుటుంబాలు కోర్టుకెక్కితే.. ఇది కదా అసలైన గిన్నీస్ రికార్డు
-
జనసంద్రాన్ని చూసి బాబు ఏడుపు.. కరకట్టలో పగిలిన టీవీలు!
-
5 ఏళ్ల సీరియల్ మీకు బోర్ కొట్టినా వదలరు.. సజ్జల సెటైర్లు అదుర్స్
-
బాబు బుద్ధి వంకర..! కోర్టు తిట్టినా మారరా..?
-
YS జగన్ పర్యటనలో పాల్గొన్న నాయకులపై అక్రమ కేసులు
-
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ..!
-
చంద్రబాబు హామీల మోసంపై డైవెర్షన్ పాలిటిక్స్
-
Magazine Story: తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో రాక్షసానందం
-
మోసాలతో చంద్రబాబు పాలన కొనసాగుతోంది: జగన్
-
‘బాండు’లు చూపి చంద్రబాబును నిలదీయండి... ఏపీ ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
-
జగన్ పర్యటనపై రెడ్ బుక్.. YSRCP నేతలపై అక్రమ కేసులు
-
ఒక్కొక్కడిని రప్పా.. రప్పా
-
తల్లికి వందనం పథకం అంతా మోసం
-
ఆలస్యమైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్న చెవిరెడ్డి
-
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఫైర్
-
Big Question: జగన్ మళ్ళీ వస్తే వామ్మో.. వణుకు మొదలాయె
-
మీ పాలనలో రాష్ట్రంలో మహిళలకు లభిస్తున్న రక్షణ, ఆత్మగౌరవం ఇదేనా?... ఏపీ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి... కుప్పం నియోజకవర్గంలో భర్త అప్పు చెల్లించలేదని అతడి భార్యను హింసించడంపై ఆగ్రహం
-
రెడ్ బుక్ అరాచకం.. హింసలు, వేధింపులు
-
అరెస్టులు, కక్షసాధింపులు తప్ప అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదు!
-
ఫీజు చెల్లింపులు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం పై ఆగ్రహం
-
సూపర్ సిక్స్ కాదు.. ఫస్ట్ బాల్కే కూటమి ఔట్. ఏపీలో చంద్రబాబు ఏడాది పాలనపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా
-
కూటమి ప్రభుత్వంపై TDP MLA ఫైర్
-
తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్ మహా మోసం
-
సూపర్ సిక్స్ ఫినిష్.. అడిగితే నాలుక కోస్తా..!
-
ప్రకాశం జిల్లాలో రైతుల మీద అక్రమ కేసులపై YS జగన్ ఆగ్రహం
-
పొగాకు రైతుల సమస్య డైవర్ట్ చేయడానికి దుర్మార్గానికి పాల్పడటం భావ్యమా?... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
మీరు ఎన్ని కేసులైన పెట్టుకోండి.. సర్వే పల్లి మొత్తం నా కుటుంబమే
-
చంద్రబాబు ఏడాది పాలన.. వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్
-
ఏడాది పాలన.. గందరగోళం.. రఫ్పాడించిన ఏపీ ప్రజలు
-
వైఎస్ జగన్ దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది.. రైతులు థాంక్స్ చెప్పాలి
-
ఇంటిపైకి ఎక్కి.. రాళ్లు, చెప్పులతో దాడి.. 3 కానిస్టేబుల్స్ తలకి గాయాలు
-
జనసంద్రాన్ని చూసి కూటమి వెన్నులో వణుకు మొదలైంది
-
బాబు పాలన రైతుకు శాపం
-
Thalliki Vandanam: ప్రతి తల్లీని, ప్రతి విద్యార్థినీ మోసం చేసిన సీఎం చంద్రబాబు
-
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు శాపంగా మారింది... పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
-
టీడీపీ ప్రభుత్వంలో రైతులు అలాడి పోతున్నారు..
-
జగన్ రాకతో దిగొచ్చిన కూటమి..
-
కూటమి ఎమ్మెల్యే అవినీతి... ఆంధ్రజ్యోతి వార్తే పెద్ద సాక్ష్యం
-
మీ దందాలు ఆపండి.. కూటమికి ABN రాధాకృష్ణ హెచ్చరిక
-
చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ అప్పు చేసిన కూటమి ప్రభుత్వం
-
జైలుకు పంపాక కూడా కొమ్మినేనిపై మరో కుట్ర..
-
ఏడాది కూటమి పాలనతో ఏపీలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం. పాఠశాలల్లో అటకెక్కిన నాడు-నేడు అభివృద్ధి పనులు. అమ్మ ఒడికి వీడ్కోలు.. ఇంగ్లిష్ మీడియంకు మంగళం
-
సాక్షి రిపోర్టర్ ప్రశ్నలకు తెల్లమొహం వేసిన ఏపీ పోలీసులు
-
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్
-
రాష్ట్రంలో రోజు రోజుకూ దిగజారుతున్న మహిళల భద్రత
-
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో ఆగని అఘాయిత్యాల పర్వం... బాలికలు, మహిళలపై అత్యాచారాలతో భయానక పరిస్థితులు
-
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు జీవం తీస్తున్న కూటమి నేతలు
-
కదం తొక్కిన టీచర్లు.. బాబుకు డెడ్ లైన్..
-
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం... ప్రభుత్వం చెప్పేదానికి కాగ్ నివేదికలు పూర్తి విరుద్ధం... చంద్రబాబు కూటమి ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి: సజ్జల
-
KSR Live Show: నీచంగా దిగజారుతున్న టీడీపీ.. శాతవాహన కాలేజీని కూల్చేసిన పచ్చ మాఫియా
-
బెడిసికొట్టిన బాబు సర్వే.. జగన్ కు జై కొట్టిన టీడీపీ ఓటర్లు
-
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కూటమికి సర్వేల షాక్
-
బాబు ఓవర్ కాన్ఫిడెన్స్.. KK సర్వే షాక్


