breaking news
the task force
-
నగరంలో పాతనోట్ల మార్పిడి ముఠా ఆటకట్టు
బన్సీలాల్‌పేట్(హైదరాబాద్‌సిటీ): పాతనోట్ల మార్పిడికి యత్నిస్తున్న ముఠాను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా రూ. 500, రూ. 1,000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం డీసీపీ లింబారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి క్రిష్ణచైతన్యరెడ్డి ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నాడు. వాటి నుంచి గట్టేక్కేందుకు తన స్నేహితుడు సురేష్‌బాబుతో కలిసి పాతనోట్ల మార్పిడికి ఒడిగట్టాడు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సుబ్బారెడ్డి తన వద్ద ఉన్న పాతనోట్లను మార్చుకునేందుకు నగరానికి రాగా, రామంతాపుర్‌కు చెందిన జగదీష్, బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు మధ్యవర్తులుగా పాతనోట్ల మార్పిడికి రంగం సిద్ధం చేశారు. అంబర్పేట్ పోస్టాఫీస్ వద్ద కారులో నోట్లు మార్పిడికి పాల్పడుతుండగా టాస్క్ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఆరు సెల్ఫోన్లు, కారు, రూ. 48.66 లక్షల పాతనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం అంబర్పేట్ పోలీసులకు అప్పగించారు. -
ఎన్నాళ్లీ ఫోర్స్?
తిరుపతి ఏపీ టాస్క్ఫోర్సులో సిబ్బంది కొరత ఉండాల్సింది 463.. ఉన్నది మాత్రం 247 మందే కత్తిమీద సాములా మారిన కమెండో ఆపరేషన్లు పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ టాస్క్ఫోర్సు విభాగం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. ప్రస్తుతం ఉన్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లపై పనిభారం పెరిగింది. విశ్రాంతి లేని విధులతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అన్ని కేడర్లలోనూ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ఎప్పటికప్పుడు చెబుతున్న సర్కారు రెండేళ్లుగా ఉదాసీనత కనబరుస్తోంది. దీంతో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తిరుపతి: పని ఒత్తిడితో టాస్క్ ఫోర్స్ విభాగం సతమతమవుతోంది. విధుల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అరుదుగా ఉన్న ఎరచ్రందనం వంటి విలువైన వృక్ష సంపదను పరిరక్షించడంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి శేషాచలంలో చొరబడే స్మగ్లింగ్ ముఠాలను అరికట్టేందుకు ప్రభుత్వం 2014లో రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్సు (ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్) విభాగాన్ని నెలకొల్పింది. తిరుపతి కేంద్రంగా ఇది పనిచేస్తుంది. మొదట్లో మొత్తం 463 మంది కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలను ప్రభుత్వం టాస్క్ఫోర్సుకు కేటారుుంచింది. అరుుతే రెండు దశల్లో కేవలం 247 మందిని మాత్రమే కేటారుుంచింది. ఇందులో డీఐజీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సై, కానిస్టేబుళ్లు ఉన్నారు. రెండేళ్లుగా వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. అరుుతే 5 లక్షల హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉన్న శేషాచలంలో నిత్యం కాపలా కాయడం, స్మగ్లర్లను అరికట్టడం ఉన్న కొద్దిమంది ఉద్యోగులతో సాధ్యం కావడం లేదు. ఒక్కో కానిస్టేబుల్ రోజూ కిలోమీటర్ల కొద్దీ అడవిలో తిరగాల్సి వస్తోంది. ఒక్కోసారి ఎర్ర కూలీలు పట్టుబడినపుడు వారి వద్ద ఉన్న దుంగలను సైతం అడవి నుంచి వీరే బయటకు తీసుకెళ్లాల్సి వస్తోంది. కొంతమంది కమెండో ఆపరేషన్లలో ఉన్నపుడు అడవుల్లో సిబ్బంది సరిపోవడం లేదు. అంతేకాకుండా టాస్క్ఫోర్సుకే కేసులు నమోదు చేసే బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ నేపథ్యంలో కే సులు నమోదు చేయడం, నేరస్తులను కోర్టులకు తీసుకెళ్లడం వంటి పనులు కూడా పెరిగారుు. ఎరచ్రందనం దుంగలను స్మగ్లర్లు ఎక్కడెక్కడ విక్రరుుంచారో, లేక గోదాముల్లో దాచారో గుర్తించాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉంది. ఒకవేళ దేశవిదేశాల్లో ఎక్కడ సరుకున్నా రికవరీ చేయాల్సిన బాధ్యత కూడా వీరిదే. అధికారాలు, బాధ్యతలు పెరిగినప్పటికీ సరిపడ ఉద్యోగులను కేటారుుంచకపోవడం టాస్క్ఫోర్సుకు ఇబ్బందికరంగా మారింది. సేకరించిన గణాంకాల ప్రకారం.. ఏపీ టాస్క్ఫోర్సు విభాగంలో ఒక ఎస్పీ, ముగ్గురు ఏసీఎఫ్‌లు, ఒక సీఐ, సివిల్ ఎస్సైలు 3, ఎఫ్‌బీవోలు 4, సివిల్ పీసీలు 20, ఏఆర్ పీసీలు 66, ఏపీఎస్పీ పీసీలు 65, ఎస్పీవోస్ 80, హెడ్గార్డ్స 50, అవుట్సోర్సింగ్ పోస్టులు 24 ఖాళీగా ఉన్నారుు. వీటన్నింటిని భర్తీ చేస్తే స్మగ్లింగ్‌ను అరికట్టడం తేలికవుతుందని అధికారవర్గాలు చెబుతున్నారుు. పని ఒత్తిడితోనే రోగాలు.. పెరిగిన పని ఒత్తిడి రోగాలకు దారితీస్తోందని టాస్క్‌ఫోర్స్ ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నారుు. అడవుల్లో ఎక్కువ రోజులు ఉండటం వల్ల వివిధ రకాల రోగాలు సంక్రమిస్తున్నాయనీ, సిబ్బంది ఎక్కువమంది ఉంటే రొటేషన్ పద్ధతి ప్రకారం విధుల నిర్వహణ ఉంటుందని కానిస్టేబుళ్లు చెబుతున్నారు. ఇటీవల హార్ట్ ఎటాక్‌తో మరణించిన హన్మంతు అనే కానిస్టేబుల్ కూడా పనిఒత్తిడి కారణంగానే గుండెనొప్పికి గురై మరణించినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. -
నాటుసారా నిల్వలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
సుండుపల్లి మండలం ఎర్రమనేనిపాలెం గ్రామ పంచాయితీ కువ్వగుట్ట,బాకుదానది సమీపంలోని కోతలగుట్ట, ఏరూటుమడుగు ప్రాంతాల్లో నాటుసారా నిల్వలైపై టాస్క్‌ఫోర్స్ అధికారుల మంగళవారం దాడులుచేశారు. ఈ దాడుల్లో సుమారు 1180 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.