టోల్ వద్దన్నా వసూలు.. భారీ ట్రాఫిక్
పశ్చిమగోదావరి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో తణుకు టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కలెక్టర్ ఆదేశాలు కూడా లెక్కచేయకుండా టోల్ గేట్ వద్ద ఫీజులు వసూలు చేస్తుండటంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. తణుకు జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు జోక్యం చేసుకొని పరిష్కరించకుంటే పరిస్థితి ఆందోళన కరంగా మారే అవకాశం ఉంది.