breaking news
tamilaruvi Manian
-
దేవుడు ఆదేశించాడు.. ‘తలైవా’ వస్తున్నాడు
తమిళరివి మణియన్ ప్రకటన.. రజనీకి ప్రస్తుతం 25 శాతం ఓట్లు సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబో తున్నారని గాంధేయ వక్కల్ ఇయక్కం నేత తమిళరవి మణియన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రజనీకి 25 శాతం ఓటు బ్యాంక్ ఉందని, రాజకీయాల్లోకి రాగానే ఆ సంఖ్య 45 శాతానికి చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తిరుచ్చి వేదికగా ‘రజనీ’ రాజకీయ నినాదంతో మహానాడు తమిళరివిమణియన్ నేతృత్వంలో జరిగింది. ఈ మహానాడుకు రజనీ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎక్కడ చూసినా మహాత్మాగాంధీ, తమిళనాడు మాజీ సీఎం కామరాజ్ చిత్ర పటాలతోపాటుగా రజనీకాంత్ చిత్ర పటాల్ని హోరెత్తించారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో తమిళరవి మణియన్ చేసిన ప్రసంగం రజనీ రాజకీయాల్లోకి రావడం ఖాయమనే సంకేతాలిస్తోంది. రజనీకాంత్‌తో తాను సమావేశమైన సమయంలో ఆయన మాటలు, వ్యాఖ్యలు నిజమైన నాయకుడిని గుర్తు చేసినట్టు మణియన్ తెలిపారు. ఇది దేవుడు ఇచ్చిన ఆదేశం.. ఇదే సరైన తరుణం.. అని రజనీ తనతో చెప్పినట్టుగా వివరించారు. తమిళుల జీవనాధారం పరిర క్షణ కోసం నదుల అనుసంధానం, అవినీతిరహిత పాలన, పారదర్శక పాలన అనే మూడు నినాదాలతో రజనీ రాజకీయాల్లో రావడం ఖాయం అని స్పష్టం చేశారు. -
రజనీ రావడం ఖాయం
♦ రెండు వారాల్లో కొత్త పార్టీ ప్రకటన ♦ గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షులు తమిళరువి మణియన్ వెల్లడి ♦ రాజకీయవేత్తలతో రజనీ రహస్య మంతనాలు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా.. రారా.. అనే ప్రశ్న తమిళనాడు ప్రజల మెదళ్లను తొలిచేస్తుండగా మరో రెండు వారాల్లో రజనీ సొంత పార్టీని ప్రకటిస్తారని తమిళరువి మణియన్ వెల్లడించారు. ‘‘ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి.. తప్పకుండా వస్తాను’’ అని తలైవా తనతో అన్నట్లుగా ఆయన వివరించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షులు తమిళరువి మణియన్ తెలిపారు. చెన్నైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని ఆయన ఇంటిలో ఇటీవల రెండుసార్లు రజనీని కలుసుకున్నానని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సుమారు మూడుగంటలకు పైగా చర్చించినట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలపై రజనీ ఎంతో అభిమానం, ప్రేమను చాటుకున్నారని, నాలుగు దశాబ్దాల క్రితం చెన్నై చేరుకున్న తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన ప్రజలకు ఏమైనా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ‘ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి, తప్పకుండా వస్తాను’ అని తనతో అన్నట్లుగా తమిళరువి తెలిపారు. ఆస్తుల కోసం ఎంతమాత్రం రాజకీయ ప్రవేశం చేయదలుచుకోలేదని, కామరాజనాడార్, అన్నాదురై ఆదర్శంగా నిస్వార్థ రాజకీయాలు సాగించాలని ఆయన ఆశిస్తున్నారని చెప్పారు. మరో రెండు వారాల్లో పార్టీని, అజెండాను ప్రకటిస్తారని తెలిపారు. పలువురితో రజనీ చర్చలు రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులతో చర్చలు జరుపుతూ అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం. తమిళరువితోపాటూ తుగ్లక్ పత్రిక సంపాదకులు ఎస్ గురుమూర్తితో అనేకసార్లు సమావేశమయ్యారు. అలాగే మరోసారి అభిమానులతో సమావేశం అయ్యేందుకు రజనీ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఐదురోజులపాటూ అభిమానులతో సమావేశమైనపుడు రాజకీయ ప్రవేశంపై సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ తరువాత కాలా చిత్ర షూటింగ్లో బిజీ అయిపోయారు. ఇటీవల మరలా రాజకీయాలపై దృష్టి పెట్టి పలువురిని కలుసుకుంటున్నారు. అభిమానులతో రెండో విడత సమావేశాలు ముగిసిన తరువాత భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు.