Tamilanadu assembly sessions
-
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సంచలనం?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా తలపడుతున్న డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు ప్రారంభమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47 సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం 106సీట్లు. ఇతర చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే,అన్నా డీఎంకేల మధ్య జరిగిన చర్చల్లో చెరో రెండున్నరేళ్లు పాలించేలా ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, డీఎంకే, అన్నా డీఎంకే మధ్య చర్చలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నో సార్లు పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం కోసం చేతులు కలపాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య విభేదాలు 1970ల నుండి కొనసాగుతున్నాయి. ఈ రెండు పార్టీలు తమిళనాడులో ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చి, రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా, దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న ఈ పార్టీలు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ పొత్తు జరిగితే, తమిళనాడు రాజకీయాల్లో ఇది చారిత్రక మలుపు అవుతుంది. అయితే, ఇరుపార్టీల కేడర్, నాయకత్వం ఈ నిర్ణయాన్ని ఎంతవరకు అంగీకరిస్తారన్నది చూడాలి. మరోవైపు, కొత్తగా ఎదుగుతున్న పార్టీలు కూడా ఈ సమీకరణల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. -
పాపం.. పెద్దాయన!
చెన్నై: తమిళనాడు రాజకీయ చరిత్రలో తనదంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు డీఎంకే చీఫ్ కరుణానిధి. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా దశాబద్ధాల పాటు పనిచేసిన ఆయన.. తన కార్యక్షేత్రం అసెంబ్లీలో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా వీల్ చైర్ కే పరిమితమైన కరుణానిధి.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే వీలు లేకుండాపోయింది. ఇందుకు మొదటికారణం అమ్మ జయలలిత ప్రభుత్వ తీరు కాగా, రెండో కారణం ఆయన ఆయన కుమారుడు స్టాలిన్. గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కరుణానిధికి కేబినెట్ హోదా ఉండేది. అంతేకాక సభలో ఆయన కూర్చునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయించింది. అయితే ప్రస్తుత సభలో డీఎంకే కోశాధికారి, కరుణ చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ పక్షానికి నాయకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీ నేతకు తప్ప మిగతవారికి అదనపు సౌకర్యాలు లభించవు. అయితే కరుణానిధి పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిందేనని డీఎంకే డిమాండ్ చేస్తోంది. శుక్రవారం ఉదయం అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన స్టాలిన్.. కరుణానిధికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని స్పీకర్ ధనపాల్ ను గతంలోనే కోరామని గుర్తుచేశారు. డీఎంకే అభ్యర్థనను పరిగణలోకి తీసుకోకుండా సీనియర్ నేతకు రెండో వరుసలో సీటు కేటాయించారని ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. ఇప్పటికైనా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు సభలో గడగడలాడించిన కరుణానిధికి ప్రస్తుతం ఎదురవుతోన్న సమస్యలను తలుచుకుని బాధతో 'పాపం పెద్దాయన' అనుకుంటున్నారట ఆయన అభిమానులు.


